#Kalki2898AD:'కల్కి' మెగా ఈవెంట్, చంద్రబాబు చీఫ్ గెస్ట్ గా ?

Published : Jun 08, 2024, 07:32 AM IST

600 కోట్ల భారీ బడ్జట్ తో తెరకెక్కిన  కల్కి పై  భారీ అంచనాలు ఉన్నాయి.  వైజయంతి మూవీస్ పై అశ్వనీదత్ నిర్మిస్తున్నారు.

PREV
110
 #Kalki2898AD:'కల్కి' మెగా ఈవెంట్, చంద్రబాబు చీఫ్ గెస్ట్ గా ?
Aswani dutt


ప్రముఖ నిర్మాత అశ్వనీదత్  నిర్మిస్తున్న భారీ చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ గురించి ప్రేక్షకులు ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్‌ హీరోగా  నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ జూన్‌ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓవర్సీస్‌లో ఇప్పటికే టిక్కెట్ల అమ్మకం మొదలై రికార్డ్ లు క్రియేట్ చేస్తోంది. మరో ప్రక్క చిత్రం టీమ్ ప్రమోషన్స్ బిజీలో ఉంది. అయితే తాజాగా ఈ చిత్రానికి సంభందించిన మెగా ఈవెంట్ ని అశ్వనీదత్ ప్లాన్ చేసినట్లు సమాచారం. 

210


సీనియర్ నిర్మాత అశ్వనీదత్ మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకు సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ అయ్యినప్పుడు జైలుకు వెళ్ళి  పరామర్శించి , తెలుగుదేశం వచ్చే ఎలక్షన్స్ లో 160 సీట్లు గెలుస్తుందని చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే తెలుగుదేశం పార్టీ 2024 ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. ఎన్నికల్లో విజయం సాధించినందుకు శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల ఫలితాలు  వచ్చిన వెంటనే సోషల్‌ మీడియాలో అభినందనలు తెలిపిన అశ్వినిదత్‌.. తాజాగా చంద్రబాబును (Chandra babu) మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్నికల్లో విజయం సాధించినందుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ నేపధ్యంలో ఈ వార్త బయిటకు వచ్చింది.

310


తాము చేయబోయే కల్కి ఈవెంట్ కు చంద్రబాబు చీఫ్ గెస్ట్ గా రావాలని కోరారని తెలుస్తోంది. అందుకు చంద్రబాబు ఓకే చెప్పారని అంటున్నారు. అయితే ఎప్పుడు, ఎక్కడ ఈ ఈవెంట్ జరగనుంది అనే విషయాలు తెలియాల్సి ఉంది.  ఈ సినిమా జూన్‌ 26న  విడుదల కానుంది. సమయం ఎంతో లేదు.
 

410


మరో ప్రక్క ఓవర్ సీస్ లో  అడ్వాన్స్‌ బుకింగ్స్‌ ఓపెన్‌ చేయగా టికెట్స్‌ హాట్‌ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. విదేశాల్లో ఈ చిత్రాన్ని 124 లోకేషన్లలో రిలీజ్‌ చేస్తున్నారు.  ఇప్పటి వరకు 116 థియేటర్లలో అడ్వాన్స్‌ బుకింగ్స్‌ ఓపెన్‌ చేయగా ఒక్కరోజులోనే 4933 టికెట్స్‌ సేల్‌ అయ్యాయి. త్వరలోనే థియేటర్ల సంఖ్య పెంచనున్నట్లు తెలుస్తోంది. 

510

   
నాగ్ అశ్విన్  మీడియా ఇంటరాక్షన్ చెప్పినదాని ప్రకారం ఈ చిత్రం మహాభారత కాలంలో మొదలై 2898 లో ముగుస్తుంది. అందుకే ఈ చిత్రానికి ‘Kalki 2898 AD’అని పెట్టామని చెప్పారు.  అలాగే  మేము ఇక్కడ  మన వరల్డ్ ని క్రియేట్ చేయటానికి  ప్రయత్నిస్తున్నాము. పూర్తి భారతీయతను ఈ సినిమాలో అందిస్తాము. ముఖ్యంగా  ఈ సినిమాని బ్లేడ్ రన్నర్ (హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ చిత్రం) లాగా చేయకూడదనేది మా ముందు ఉన్న ఛాలెంజ్. క్రీ.శ. 2898 నుండి మనం 6000 సంవత్సరాల వెనక్కి వెళితే, మనం క్రీ.పూ. 3102కి చేరుకుంటాం, అంటే కృష్ణుడి చివరి అవతారం గడిచిపోయినట్లే అని క్లారిటీ ఇచ్చారు నాగ్ అశ్విన్. 
 

610


ఈ సినిమాలో కమలహాసన్ ఒక కీలకమైన పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన పాత్రను నాగ్ అశ్విన్ డిజైన్ చేసిన తీరు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందని అంటున్నారు.  కొన్ని రోజులుగా కమల్ - ప్రభాస్ కాంబినేషన్లోని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు. ప్రభాస్ - కమల్ కాంబినేషన్ సీన్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని చెబుతున్నారు. సాంకేతిక పరంగా ఈ సినిమా హాలీవుడ్ సినిమాలను తలపిస్తుందని అంటున్నారు. మరో ప్రక్క ప్రభాస్ విష్ణుమూర్తి పాత్రలో కనిపిస్తారనే (Prabhas Plays Lord Vishnu)వార్త ఇండస్ట్రీ వర్గాల్లో తెగ సర్క్యులేట్ అవుతోంది.
 

710


మరోవైపు కల్కి ప్రాజెక్ట్ గురించి నిత్యం.. సోషల్ మీడియాలో ఆసక్తిరక విషయాలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.  కల్కి తో పాటు రాజాసాబ్, సలార్ పార్ట్ 2, స్పిరిట్ చిత్రాలు .. ప్రభాస్ కు క్యూలో ఉన్నాయి.  

810

తాజాగా కల్కి ట్రైలర్‌పై మూవీ టీమ్ అప్‌డేట్ ఇచ్చింది.  కల్కి 2898 AD థియేట్రికల్ ట్రైలర్‌ను జూన్ 10న విడుదల చేయనున్నట్లు చిత్రనిర్మాతలు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఈ అనౌన్స్‌మెంట్‌తో పాటు ప్రభాస్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ చూస్తుంటే సినిమాలో యాక్షన్ సీక్వెన్స్‌లు అదిరిపోతాయనిపిస్తుంది.

910

ఈ సినిమా ప్రమోషన్స్‌ను పెద్ద ఎత్తున చేస్తుంది మూవీ టీమ్. ఇప్పటికే బుజ్జి పాత్రను పరిచయం చేస్తూ ఇటీవల రామోజీ ఫిలిం సిటీలో భారీ ఈవెంట్ చేసిన సంగతి తెలిసిందే. బుజ్జి గ్లింప్స్ కూడా ఫ్యాన్స్‌ను ఫిదా చేసింది. దీనికి తోడు ఇటీవల 'బుజ్జి అండ్ భైరవ' పేరుతో ఓటీటీలో ఓ యానిమేషన్ సిరీస్‌ను కూడా రిలీజ్ చేశారు. అమెజా్ ప్రైమ్ వీడియోలో ఇది స్ట్రీమింగ్ అవుతుంది. అలానే అంతకుముందు రిలీజ్ చేసిన అశ్వత్థామ గ్లింప్స్‌ కూడా ఆడియన్స్‌కి బాగా రీచ్ అయింది. 

1010

ఈ చిత్రంలో దీపికా పదుకొణె, దిశా పటాని, బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్ వంటి స్టార్ క్యాస్టింగ్ ఉంది. ప్రతిష్టాత్మకమైన వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీ దత్ ఈ చిత్రాన్ని భారీ బడ్డెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. సంతోష్ నారాయణన్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories