కొన్నేళ్లుగా బాక్సాఫీస్ వద్ద పౌరాణిక చిత్రాల ట్రెండ్పెరిగింది. పురాణ కథల ఆధారంగా కొన్ని, ఫిక్షన్ కథలతో కొన్ని పౌరాణిక సినిమాలు వస్తున్నాయి. కాగా 2026లో రాబోతోన్న భారీ బడ్జెట్ పౌరాణిక సినిమాలు ఏవో తెలుసా?
రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, సౌత్ స్టార్ హీరో యష్ రావణాసురిడిగా నటిస్తోన్న సినిమా రామాయరణం పార్ట్ 1. సన్నీ డియోల్ కూడా ఈసినిమాలో ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో శ్రీరాముడి జీవిత గాథను చూపించనున్నారు. నితేష్ తివారీ దర్శకుడు. నమిత్ మల్హోత్రా, శ్రీధర్ రాఘవన్ నిర్మాతలు. దాదాపు గా ఈసినిమా సిరీస్ ల కోసం 2000 కోట్లుకు పైగా బడ్జెట్ ను ఖర్చు చేస్తున్నారు.
26
2. జై హనుమాన్
విడుదల తేదీ : 2026 (తేదీ ఖరారు కాలేదు)
శ్రీరాముడికి ఇచ్చిన మాటను హనుమంతుడు నిలబెట్టుకోవడం ఈ సినిమా కథ. ఇది 2024 బ్లాక్‌బస్టర్ 'హను-మాన్'కి సీక్వెల్. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నా ఈసినిమాలో కాంతార ఫేమ్ రిషబ్ శెట్టి హనుమాన్ గా కనిపించబోతున్నారు. ఈమూవీలో రానా, తేజ సజ్జ, అమృత అయ్యర్ నటిస్తున్నారు.
36
3. మహావతార్
విడుదల తేదీ : క్రిస్మస్ 2026
'స్త్రీ', 'భేదియా' లాంటి హారర్ కామెడీ చిత్రాలకు ప్రసిద్ధి చెందిన దినేష్ విజన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అమర్ కౌశిక్ దర్శకుడు. విష్ణువు అవతారమైన పరశురాముడి కథ ఇది. విక్కీ కౌశల్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు.
మైథలాజికల్ సినిమాలలో ఎక్కువగా టాలీవుడ్ నుంచే తెరకెక్కుతున్నాయి. అందులో మరో క సినిమా పవనపుత్ర హనుమంతుడి కథ ఆధారంగా తెరకెక్కుతుంది. ఈ యానిమేటెడ్ చిత్రానికి చందూ మొండేటి దర్శకుడు. నాగ వంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
56
4. నాగ్‌జిలా : నాగలోక్ కా పెహ్లా కాండ్
విడుదల తేదీ : 14 ఆగస్టు 2026 (అంచనా)
ఇది ఫాంటసీ-కామెడీ చిత్రం. కార్తీక్ ఆర్యన్, శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలు. మృగదీప్ సింగ్ లాంబా దర్శకత్వం వహిస్తున్నారు. కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా మూడు భాగాలుగా రానుండగా, మొదటి భాగం 2026లో విడుదల కానుంది.
66
4. చిరంజీవి హనుమాన్ : ది ఇటర్నల్
విడుదల తేదీ : హనుమాన్ జయంతి 2026
ఇది AI టెక్నాలజీతో రూపొందుతున్న చిత్రం. విక్రమ్ మల్హోత్రా, విజయ్ సుబ్రమణియన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈమూవీకి సంబంధించి మరిన్న వివరాలు తెలియాల్సి ఉంది.