విజయ్ దళపతి పాడిన చివరి పాట... జననాయగన్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎన్ని కోట్లు?

Published : Nov 09, 2025, 10:40 AM IST

Jananayagan First Single : దళపతి విజయ్ చివరి సినిమా జననాయగన్ నుంచి ఫస్ట్ సింగిల్ 'వచ్చేసింది. అనిరుధ్ సంగీతం అందించిన ఈ  పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. 

PREV
14
జననాయగన్ నుంచి ఫస్ట్ సింగిల్

తమిళ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరో విజయ్ 69వ సినిమా జననాయగన్. ఈ సినిమాకు హెచ్. వినోద్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో విజయ్‌కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. బీస్ట్ సినిమా తర్వాత విజయ్, పూజా కలిసి నటిస్తున్న సినిమా ఇది. ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మించింది. ఈ సినిమా కోసం విజయ్‌ 275 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు సమాచారం. ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందించాడు. ఇంతకుముందు కత్తి, మాస్టర్, లియో, బీస్ట్ లాంటి విజయ్ సినిమాలకు సంగీతం అందించిన అనిరుధ్, ఇప్పుడు జననాయగన్ సినిమాతో ఐదోసారి జతకట్టాడు.

24
సంక్రాంతి కానుకగా విజయ్ సినిమా

నటుడిగా విజయ్‌కి జననాయగన్ చివరి సినిమా. ఈ సినిమా తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పాలని విజయ్ నిర్ణయించుకున్నాడు. రాజకీయాల్లోకి వస్తున్నందున ఇకపై సినిమాల్లో నటించకూడదని డిసైడ్ అయ్యాడు. ఈ సినిమాలో విజయ్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడు. ఇందులో విజయ్‌తో పాటు ప్రియమణి, ప్రకాష్ రాజ్, గౌతమ్ మీనన్, మమితా బైజు, డీజే అరుణాచలం లాంటి సీనియర్ స్టార్స్ కనిపించబోతున్నారు.  ఈ సినిమా షూటింగ్ పూర్తయి, పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. 2026 సంక్రాంతి కానుకగా ో జననాయగన్ రిలీజ్ కానుంది.

34
ప్రీ-రిలీజ్ బిజినెస్ ఎన్నికోట్లంటే?

జననాయగన్ సినిమా రిలీజ్‌కు ఇంకా రెండు నెలల సమయం ఉండగానే, అప్పుడే ప్రీ-రిలీజ్ బిజినెస్ ఊపందుకుంది. అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా డిజిటల్ హక్కులను 110 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ సినిమా తమిళనాడు, కేరళ థియేట్రికల్ హక్కులను రోమియో పిక్చర్స్ 115 కోట్లకు దక్కించుకుంది. ఇక ఈ సినిమా ఆడియో హక్కులను టీ-సిరీస్ సంస్థ 35 కోట్లకు కొనుగోలు చేసింది. దీని ద్వారా ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ మాత్రమే 260 కోట్లకు పైగా జరిగింది.

44
విజయ్ స్వయంగా పాడిన పాట

ఈ క్రమంలో  జననాయగన్ సినిమా ఫస్ట్ సింగిల్‌ను మూవీ టీమ్ తాజాగా రిలీజ్ చేశారు. 'దళపతి కచేరి' అనే ఈ పాటను నటుడు విజయ్ పాడాడు. విజయ్ కెరీర్‌లో అతను పాడిన చివరి పాట ఇదే. ఈ పాటకు అనిరుధ్ సంగీతం అందించాడు. ఈ పాట సాహిత్యాన్ని తేరుకురల్ అరివు రాశాడు. ఈ పాటలో విజయ్ అద్భుతంగా డ్యాన్స్ కూడా చేశాడు. ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశాడు. 

Read more Photos on
click me!

Recommended Stories