జబర్దస్త్ కమెడియన్ కు అనిల్ రావిపూడి బెస్ట్ ఫ్రెండ్ అని మీకు తెలుసా? ఇద్దరు ఏమని పిలుచుకుంటారంటే?

Published : Nov 09, 2025, 12:04 PM IST

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడికి, జబర్దస్త్ కమెడియన్ క్లోజ్ ఫెండ్ అంటే మీరు నమ్ముతారా? అనిల్ ని మామా మామా అని పిలుచుకునేంత స్నేహం ఉన్న ఆ నటుడు ఎవరు? అనిల్ సినిమాల్లో ఆ కమెడియన్ ఎందుకు కనిపించడు?

PREV
14
రాజమౌళి తరువాత అనిల్ రావిపూడిదే రికార్డు...

టాలీవుడ్ లో చిన్న రైటర్ గా కెరీర్ స్టార్ట్ చేసి.. స్టార్ డెరెక్టర్ గా ఎదిగాడు అనిల్ రావిపూడి. దర్శకుడిగా పటాస్ సినిమాతో మొదలైన ప్రయాణం.. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసే రేంజ్ కు వచ్చింది. మహేష్ బాబు, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి హీరోలతో వరుసగా సూపర్ హిట్ సినిమాలు చేస్తూ వస్తున్నాడు అనిల్ రావిపూడి. అంతే కాదు రాజమౌళి తరువాత అరుదైన రికార్డు ను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు అనిల్. ఇప్పటి వరకూ ఫెయిల్యూర్ ఎరుగని దర్శకుడిగా అనిల్ రావిపూడికి పేరుంది. అనిల్ రావిపూడి సినిమాలకు కామెడీ ప్రధాన బలం. అందకే ఆయన చేసిన సినిమాలన్నీ హిట్ అవుతూ వస్తున్నాయి. ఎంత సీరియస్ గా ఉండే హీరోతో అయినా కామెడీ చేయించగలడు అనిల్ రావిపూడి. ప్రస్తుతం ఆయన మెగాస్టార్ చిరంజీవితో మన శంకరవరప్రసాదు గారు సినిమా చేస్తున్నాడు.

24
జబర్దస్త్ కమెడియన్ తో అనిల్ రావిపూడి స్నేహం

ఫిల్మ్ ఇండస్ట్రీలోకి రాకముందు.. అవకాశాల కోసం చాలా ఇబ్బందులు పడ్డాడు అనిల్ రావిపూడి. అసిస్టెంట్ డైరెక్టర్ గా చాలా కాలం పనిచేసిన తరువాత, అతనికి రైటర్ గా ఛాన్స్ వచ్చింది. అలా రైటర్ గా చాలా సినిమాలకు పనిచేశాడు. ఆ టైమ్ లోనే... డైరెక్టర్ గా, నటుడిగా ఇండస్ట్రీకి వచ్చిన అభితో పరిచయం ఏర్పడింది. అయితే అదిరే అభిని అప్పుడు హరి అని పిలిచేవారట. జబర్దస్త్ కు వచ్చిన తరువాత అతని పేరు అభిగా.. ఆతరువాత కాలంలో అదిరే అభిగా మారిపోయింది. అయితే అనిల్ రావిపూడి గౌతమ్ SSC సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న టైమ్ లో.. అభితో స్నేహం ఏర్పడింది. ఆ సినిమాలో హీరో ఫ్రెండ్ పాత్రలో అభి నటించారు. అప్పుటి నుంచి అనిల్,అభి బెస్ట్ ఫ్రెండ్స్ గా మారారు. ఈ విషయం చాలామందికి తెలియదు. రీసెంట్ గా ఓ ఈవెంట్లో అనిల్ రావిపూడివెల్లడించారు.

34
అనిల్ రావిపూడికి సహాయం చేసిన అదిరే అభి..

అదిరే అభితో అనిల్ రావిపూడి స్నేహం చాలా ఏళ్లు కొనసాగింది. ఇద్దరు కలిసి చాలా సినిమాలకు పనిచేశారు కూడా. కందిరీగ సినిమాలకు రైటర్ గా అనిల్ రావిపూడికి తెలంగాణ స్లాంగ్ ను రాయాల్సి వచ్చింది. ఆ టైమ్ లో అభి తనకు ఎంతో సహాయం చేశాడు. రైటింగ్, డైరెక్షన్ లో కూడా అభి అనిల్ రావిపూడికి హెల్ప్ చేసేవాడట. ఈ విషయాన్ని చిరంజీవ సినిమా ఈవెంట్ లో అనిల్ రావిపూడి ప్రత్యేకంగా వెల్లడించారు. అంతే కాదు అభితో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. అంతే కాదు తాము మామ మామా అని పిలుచుకుంటామని.. అంత క్లోజ్ ఫ్రెడ్షిప్ తమ మధ్య ఉందన్నారు అభి. తన సినిమాల్లో అభికి క్యారెక్టర్ ఇవ్వకపోవడానికి కారణం ఏంటో కూడా.. ఆయన పలువురితో వెల్లడించినట్టు తెలుస్తోంది.

44
అభి డైరెక్షన్ లో రాజ్ తరుణ్ హీరోగా సినిమా

రీసెంట్ గా రాజ్ తరుణ్ హీరోగా పెట్టి ‘చిరంజీవ’ అనే సినిమాను డైరెక్ట్ చేశాడు అభి. ప్రముఖ ఓటిటి సంస్థ ఆహాలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించి ఒక ఈవెంట్ జరిగింది. దానికి ముఖ్య అతిథిగా అనిల్ రావిపూడి వచ్చారు. అదిరే అభి తో ఉన్న అనుబంధం కారణంగా.. ఆయన పిలవగానే అనిల్ ఈ వేడుకకి వచ్చారు. అయితే అనిల్ ఇంత వరకూ తన సినిమాలో నటించే అవకాశం అభికి ఇవ్వలేదు. అనిల్ రావిపూడి అదిరే అభి ఇద్దరిని కావాలనే పక్కన పెట్టేసారు అంటూ.. కామెంట్లు చేసిన వారు ఉన్నారు. కానీ అభికి సరిపోయే పాత్ర లేకనే తన సినిమాలో అవకాశం ఇవ్వలేకపోయాడట అనిల్. ఏదో చిన్న పాత్ర ఇచ్చి చేతులు దులుపుకోవడం తనకు ఇష్టం లేక, అభికి ఇవ్వడానికి సరిపడా పాత్రలు లేకనే అనిల్ తన సినిమాల్లోకి అభిని తీసుకోలేదట.

Read more Photos on
click me!

Recommended Stories