ట్రాన్స్ జెండర్లని పెళ్లికి పిలిచిన మెగా కోడలు ఉపాసన.. సర్వత్రా ప్రశంసలు.. ఫోటోలు వైరల్‌

First Published Dec 3, 2021, 9:12 PM IST

మెగా కోడలు, రామ్‌చరణ్‌ భార్య ఉపాసన ఇప్పుడు సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతుంది. ఆమె చేసిన పనికి సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి.  ఉపాసనలోని మరో కోణాన్ని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అభినందనలు కురిపిస్తున్నారు. 

ఉపాసన మహిళా సాధికారతకు అద్దం పడుతుంది. ఆమె ప్రతిష్టాత్మకమైన అపోలో ఆసుపత్రుల నిర్వహణ చూసుకుంటోంది. అపోలో ఫార్మసీకి సంబంధించి తనే లీడ్‌ చేస్తుంటుంది. ఇది విజయవంతంగా రన్‌ అవ్వడంలో ఆమె కీలక భూమిక పోషిస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మరోవైపు మెగా కోడలుగా ఆదర్శంగా నిలుస్తుంది. ఓ వైపు వ్యాపారవేత్తగా, మరోవైపు ఇంటి కోడలుగా ఆమె రెండింటిని బ్యాలెన్స్ చేస్తుంది. 
 

తాజాగా ఉపాసన అభిమానుల ప్రశంసలందుకుంటుంది. అందరి చేత అభినందనలు అందుకుంటుంది. కారణం ఉపాసన లెస్బియన్లని ప్రోత్సహించడం. (LGBT-lesbian, gay, bisexual, transgender) స్వలింగ సంపర్కులు, నపుంసకులు వంటి వారి గురించి మన సమాజంలో అవగాహన చాలా తక్కువ ఉంది. కానీ, వారితో స్నేహంగా ఉండి, ఇంటి వేడుకలలో వారిని భాగం చేసింది ఉపాసన. ఒక ట్రాన్స్ జెండర్ తో అన్యోన్యంగా ఉన్న ఫొటోను ఉపాసన తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. 

తనకు ట్రాన్స్‌ జెండర్స్‌ ఫ్రెండ్స్ ఉన్నారని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఓపెన్‌గా చెప్పి ఆశ్చర్యానికి గురి చేసిన ఉపాసన ఇప్పుడు మరో అడుగు ముందుకేసింది. తన సోదరి పెళ్లి ఏర్పాట్లకు ట్రాన్స్‌ జెండర్లని ఆహ్వానించి, వారిని వేడుకలో భాగం చేసింది. సోదరి అనుషపాలా పెళ్లి వేడుకల్లో భాగంగా ట్రాన్స్ జెండర్ల ఆశీస్సులు తీసుకుంది. అనంతరం వారి దగ్గర ఆశీర్వాదాలు తీసుకుంటోన్న ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది.

ఇందులో ఉపాసన చెబుతూ, `కలయికని, మానవీయతని, ఇంకా జీవితాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఈ ఆశీర్వచనాల వేడుక కంటే మంచి సందర్భం ఏముంది?` అని తెలిపింది. `లక్ష్మీనారాయణ త్రిపాఠి అమ్మా నిండు మనసుతో మీరు ఈ పెళ్లి వేడుకల్ని ప్రారంభించినందుకు సంతోషంగా ఉంది. నిండైన జీవితాన్ని నిండారా అనుభవించడం ఎప్పుడూ మీరు నేర్పిందే` అంటూ లక్ష్మీనారాయణ త్రిపాఠి ని అక్కున జేర్చుకొని ఒక ఫోటో పెట్టింది ఉపాసన. 

హైదరాబాద్ లోని ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీని గౌరవిస్తానని, అది ఇది మన దేశంలోని అనాది సమాజాల్లో ఒకటని ఆ పోస్టులో ఆమె పేర్కొంది. `హైదరాబాద్ లోని 6 బదాయి గృహాల ప్రతినిథులకు ఆతిథ్యం ఇవ్వడం  విశేషంగా భావిస్తున్నాం. వారి కథలు జీవన సారాన్ని బోధించే నిధులు.  ఆ కమ్యూనిటీతో మరింత సన్నిహితంగా మెలగగలుగుతున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది` అని అని పేర్కొంది.

సామాజిక అంశాల మీద స్పందిస్తూ ఆరోగ్య సలహాలు అందిస్తూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది ఉపాసన. మల విసర్జన సమయంలో టాయ్‌లెట్‌లో  వెస్టర్న్ కమోడ్‌ కంటే భారతీయ కమోడ్‌లను వినియోగించడమే ఆరోగ్యానికి అత్యంత సురక్షితమంటూ తన ఫొటోలతో ఉపాసన ప్రచారం చేసిన విషయం తెలిసిందే.  

ఎల్.జి.బి.టి.క్యు.ఐ.ఏ వంటి లైంగిక అల్పసంఖ్యాకవర్గాల (sexual minorities) పట్ల సమాజానికి చిన్నచూపు ఉండటం, సినిమా వంటి పాపులర్ మీడియంలో వారు హేళనకి గురికావడం సర్వసాధారణమైన ప్రస్తుత పరిస్థితుల్లో, ట్రాన్స్‌ జెండర్ల తో సన్నిహితంగా మెలిగి వాటిని ఉపాసన బోల్డ్ గా  షేర్ చేయడం నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఇటువంటి పోస్ట్స్ ప్రజల్లో  ఆలోచన పెంచి, ట్రాన్స్ జెండర్ల పట్ల మంచి అవగాహన కలిగిస్తాయంటున్నారు. 

also read: ట్రాన్స్ జెండర్ తో స్నేహం, ఆ విషయంలో ఎన్నో అవమానాలు... షాకింగ్ విషయాలపై ఓపెన్ అయిన చరణ్ వైఫ్ ఉపాసన
 

click me!