Upasana Networth: సినిమాలకు సంబంధం లేకుండా వేల కోట్లకు అధిపతిగా ఎదిగిన ఉపాసన.. ఆమె ఆస్తులెంతంటే?

Published : Jun 08, 2026, 12:12 PM IST

రామ్‌ చరణ్‌ భార్య ఉపాసన.. సినిమాలకు సంబంధం లేకుండా వేలకోట్లకు అధిపతిగా ఎదిగారు. ఆమె ఎన్ని వేల కోట్లకు వారసురాలో తెలిస్తే మాత్రం ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే. 

PREV
15
ఓ వైపు తల్లిగా, మరోవైపు వ్యాపారవేత్తగా రాణిస్తోన్న ఉపాసన

మెగాకోడలు, మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ భార్య ఉపాసన.. ఓ వైపు తన పిల్లల సంరక్షణ చూసుకుంటూనే, మరోవైపు తన వ్యాపారాలు నిర్వహిస్తోంది. ఆమె అపోలో ఆసుపత్రులకు సంబంధించి ఫార్మాసీ విభాగానికి హెడ్‌గా ఉన్నారు. అలాగే ఫ్యామిలీ హెల్త్ ప్లాన్‌ ఇన్సూరెన్స్ టీపీఏకి మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఉన్నారు.  UR.Life పేరుతో హెల్త్, వెల్‌నెస్ ప్లాట్‌ఫామ్ ప్రారంభించారు. క్యాన్సర్‌ కేర్‌కి సంబంధించిన తనే హెడ్‌ అని సమాచారం. మరోవైపు ముగ్గురు పిల్లలకు తల్లిగానూ ఉంది. రామ్‌ చరణ్‌, ఉపాసనలకు ముందుగా కూతురు క్లీంకార జన్మించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఇటీవలే కవలలు జన్మించారు. ఇందులో కుమారుడికి శివ్‌ రామ్‌ కొణిదెల, కూతురికి అన్వీరా దేవి కొణిదెల గా నామకరణం చేశారు.

25
సినిమాల ద్వారా వేల కోట్లు సంపాదించిన చరణ్‌, చిరంజీవి

ఇదిలా ఉంటే ఇప్పుడు ఉపాసన ఆస్తులకు సంబంధించిన చర్చ స్టార్ట్ అయ్యింది. ప్రస్తుతం చిరంజీవి, రామ్‌ చరణ్‌ సినిమాలు చేస్తూ వచ్చారు. చిరంజీవి గత యాభై ఏళ్లుగా సినిమాలు చేస్తూ వచ్చారు. వేల కోట్లు సంపాదించారు. అలాగే చరణ్‌ కూడా తనవంతుగా  సంపాదించారు. ఆయన సినిమాలు చేయడంతోపాటు వ్యాపారాలు కూడా నిర్వహిస్తున్నారు. ఓ ప్రైవేట్‌ విమాన సంస్థలో భాగస్వామ్యం ఉన్నట్టు సమాచారం.

35
ఉపాసన ఆస్తులు

ప్రస్తుతం చిరంజీవికి ఉన్న ఆస్తుల విలువ రూ.1650కోట్లు అంటూ ప్రచారం జరుగుతుంది. సోషల్‌ మీడియాలో పలువురు అంచనా వేస్తున్నారు. అలాగే రామ్‌ చరణ్‌కి రూ.1350కోట్ల వరకు ఆస్తులుంటాయని సమాచారం. ఇద్దరి ఆస్తులు కలిపితే సుమారు రూ. 3 వేల కోట్ల వరకు ఉంటుంది. మరి ఉపాసన ఆస్తులు ఎంతో తెలిస్తే మాత్రం షాక్‌ అవ్వాల్సిందే. అపోలో ఆసుపత్రుల నెట్‌ వర్త్ రూ.77వేల కోట్లు. ఈ ఆస్తికి ఉపాసన కూడా వారసురాలే అని చెప్పొచ్చు. అపోలో ఆసుపత్రిల హెడ్‌ ప్రతాప్‌ సి రెడ్డి ఈ సామ్రాజ్యాన్ని స్థాపించారు. దానికి వారి పిల్లలు వారసులుగా ఉన్నారు. అందులో ఒక మనవరాలు అయిన ఉపాసన కూడా వారసురాలే అని చెప్పొచ్చు. ఆమెకి కూడా ఈ ఆస్తిలో వాటా వస్తుంది. ఆమె వాటా కింద సుమారు 15-20వేల కోట్ల వరకు వచ్చే అవకాశం ఉంది.

45
వేలకోట్లకు ఉపాసన అధిపతి

ఉపాసన ఇప్పుడు సుమారు ఇరవై వేల కోట్లకి అధిపతి అని చెప్పొచ్చు. ఈ లెక్కన రామ్‌ చరణ్‌, చిరంజీవి కంటే ఉపాసన ఆస్తినే ఎక్కువ అని చెప్పొచ్చు. సినిమాలతో సంబంధం లేకుండా ఆమె ఈ స్థాయిలో ఆస్తులు సంపాదించుకుంది. మరి ఇందులో తన ఫ్యామిలీకి ఎంత ఆస్తులు బదిలి చేస్తుందనేది చూడాలి. మొత్తంగా అటు చిరంజీవి నుంచి, రామ్‌ చరణ్‌ నుంచి, ఇంకోవైపు ఉపాసన నుంచి వారి పిల్లలకు భారీగా ఆస్తులు రాబోతున్నాయి. వారి పిల్లలు పుట్టుకతోనే గోల్డెన్‌ స్పూన్‌లో కాదు, డైమాండ్‌ స్పూన్‌లో జన్మించారని చెప్పినా తక్కువే అవుతుంది.

55
పెద్దితో అలరిస్తోన్న రామ్‌ చరణ్‌

ఇదిలా ఉంటే ఉపాసన భర్త, రామ్‌ చరణ్‌ ప్రస్తుతం `పెద్ది` సినిమాతో ఆడియెన్స్ ని అలరిస్తున్నారు. జూన్‌ 4న విడుదలైన ఈ చిత్రం విజయవంతంగా రన్‌ అవుతుంది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటించింది. శివరాజ్‌ కుమార్‌, జగపతిబాబు కీలక పాత్రలు పోషించారు. గుర్తింపుకి నోచుకోని తమ ఊరుకి గుర్తింపు కోసం ఒక యువకుడు ఆటతో చేసిన పోరాటమే ఈ చిత్రం. ఇందులో చరణ్‌ పెద్దిగా నటించాడు. ఆయన మొదట క్రికెట్‌లో ఫేమస్‌. అది గుర్తింపు తేలేకపోతుంది. దీంతో కుస్తీ వైపు టర్న్ తీసుకుంటాడు, అందులో జాతీయ స్థాయికి వెళ్తాడు, కానీ ఛాంపియన్‌ కాలేకపోతాడు. దీంతో రన్నింగ్‌ వైపు టర్న్ తీసుకుని ప్రపంచ ఛాంపియన్‌గా నిలుస్తాడు. తమ ఊరికి గుర్తింపుని తీసుకొస్తాడు. ఈ సినిమా  మిశ్రమ స్పందన రాబట్టుకున్నా, వసూళ్ల పరంగా దూసుకుచూపిస్తోంది. ట్రేడ్‌ వర్గాల సమాచారం ప్రకారం ఈ మూవీ నాలుగు రోజుల్లో రూ.233కోట్లు రాబట్టినట్టు సమాచారం. తాజాగా టీమ్‌ అధికారికంగా వసూళ్లని ప్రకటించింది. నాలుగు రోజుల్లో ఇది రూ.292.5కోట్లు కలెక్ట్ చేసినట్టు వెల్లడించడం గమనార్హం.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories