ప్రభాస్ ఈ ఏడాది సంక్రాంతికి `ది రాజాసాబ్`తో వచ్చారు. ఈ మూవీ ఆడియెన్స్ ని డిజప్పాయింట్ చేసింది. ప్రస్తుతం ఆయన రెండు సినిమాల్లో నటిస్తున్నారు. `ఫౌజీ`, `స్పిరిట్` చిత్రాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి. హను రాఘవపూడి దర్శకత్వంలో `ఫౌజీ`, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో `స్పిరిట్` రెండూ సమాంతరంగా చిత్రీకరణ జరుపుకుంటున్నాయి.
24
కల్కి 2 అప్ డేట్, జులైలో ప్రభాస్ ఎంట్రీ
ఇప్పుడు కల్కి 2 అప్ డేట్ వచ్చింది. `కల్కి 2898 ఏడీ` వచ్చి రెండేళ్లు అయిపోయింది. ఇప్పుడు రెండో పార్ట్ కి సంబంధించిన అప్ డేట్ ఇచ్చాడు దర్శకుడు నాగ్ అశ్విన్. ఇప్పటికే ఈ మూవీ చిత్రీకరణ ప్రారంభమైంది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్‌లకు సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. అదే సమయంలో ప్రభాస్‌కి సంబంధించిన అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చాడు నాగ్ అశ్విన్. జులైలో ప్రభాస్ ఈ మూవీ చిత్రీకరణలో పాల్గొంటాడట. అమితాబ్, కమల్, ప్రభాస్‌లపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తారని సమాచారం.
34
కల్కి 2 రిలీజ్ డేట్ చెప్పిన నాగ్ అశ్విన్
అదే సమయంలో ఈ మూవీ రిలీజ్ డేట్ కూడా చెప్పాడు దర్శకుడు నాగ్ అశ్విన్. వచ్చే ఏడాదిలోనే ఈ మూవీ రిలీజ్ ఉంటుందట. 2027 డిసెంబర్‌లో ప్లాన్ చేస్తున్నట్టు చెప్పాడు. డిసెంబర్ మొదటి వారంలోగానీ, లేదంటే క్రిస్మస్ స్పెషల్‌గానీ రిలీజ్ చేయబోతున్నారట. ప్రస్తుతం ఈ మూవీ హైదరాబాద్‌లో ఓ స్టూడియోలో చిత్రీకరణ జరుగుతుందట, హాట్ స్టూడియోలో చిత్రీకరిస్తున్నామని హీరో కమల్ హాసన్ తెలిపిన విషయం తెలిసిందే. తాజాగా `సింగ్ గీతం` మూవీ ఈవెంట్‌లో పాల్గొన్న ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఇందులో కమల్.. `యాస్కిన్` అనే పాత్రలో నెగటివ్ రోల్‌లో నటిస్తున్నారు. మొదటి పార్ట్ లో గెస్ట్ గా మెరిసిన ఆయన ఇప్పుడు పార్ట్2లో మాత్రం విశ్వరూపం చూపించబోతున్నారట.
`కల్కి 2` వచ్చే ఏడాది డిసెంబర్‌లో వస్తే.. ప్రభాస్ నుంచి ఒకే ఏడాది మూడు సినిమాలు రాబోతున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే `ఫౌజీ` ఈ ఏడాది చివర్లో.. అంటే డిసెంబర్‌లోనే విడుదల చేయాలనుకుంటున్నారు. కానీ షూటింగ్ అవుతున్న తీరు చూస్తుంటే, అది డిసెంబర్‌లో రావడం కష్టమే అని చెప్పొచ్చు. ఒకవేళ అదే జరిగితే, 2027 మిడ్‌లో వస్తుందని చెప్పొచ్చు. ఇక స్పిరిట్ మూవీని మార్చి 5న రిలీజ్ చేయనున్నట్టు సందీప్ రెడ్డి వంగా ఇప్పటికే ప్రకటించారు. ఇక ఇప్పుడు `కల్కి 2` కూడా అదే ఏడాది ఎండింగ్‌లో రాబోతుంది. ఏడాది గ్యాప్‌తో మూడు సినిమాలతో అభిమానులను అలరించబోతున్నారు ప్రభాస్. ఇక వచ్చేదంతా ప్రభాస్ సినిమాల పండగే అని చెప్పొచ్చు.