Ram charan-Upasana: రాంచరణ్ కొణిదెల, ఉపాసన కొణిదెల ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరూ సంపన్న కుటుంబాల్లో పుట్టినప్పటికీ సమాజంలో కట్టుబాట్లు, విలువలు పాటిస్తూ ఎంతో అన్యోనంగా ఉంటున్నారు. చానాళ్ల తర్వాత ఈ దంపతులకు ఓ పాప పుట్టింది. ఆమెను అల్లారుముద్దుగా పెంచుతున్నారు. ఇక చరణ్‌ది సినిమా ప్రపంచం.. ఉపాసనది వ్యాపార సామ్రాజ్యం... అసలు ఇద్దరూ మనసువిప్పి మాట్లాడుకునే సమయం ఎప్పుడు దొరుకుంది అని చాలామందికి డౌట్. మరి ఆ సీక్రెట్‌ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఉపాసన చెప్పేసిందండోయ్.. అదేంటో తెలుసుకుందామా..
పెళ్లంటే నూరేళ్ల పంట అని పెద్దలు అంటుంటారు. పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయని మరికొందరు చెబుతుంటారు. మరి అంతటి పవిత్ర బంధంతో ఒక్కటవుతున్న నేటి దంపతులు.. చిన్న చిన్న విషయాలకే విడిపోతున్నారు. ప్రధానంగా ఇగోలతో ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోవడం, సర్దుకుపోలేకపోవడం వంటివి లేకపోవడంలో దంపతుల మధ్య గొడవలు పెరిగిపోతున్నాయి. ఇలాంటి అంశాలపై ఉపాసన స్పందించారు. పెళ్లి అంటే ఆషామాషీ విషయం కాదని ఆమె చెబుతున్నారు. సినిమాలకు రివ్యూలు ఉన్నట్లే పెళ్లి తర్వాత కూడా రివ్యూలు ఉండాలని అంటున్నారు ఉపాసన.
24
ram charan upasana konidela
ఈ మధ్య కాలంలో పెళ్లి చేసుకున్న వాళ్లు విడిపోవడం కాదు.. ఒకరినొకరు చంపుకోవడం ఎక్కువైంది. తాజాగా అనేక ఘటనల్లో భర్తను చంపుతున్న భార్యలు.. భార్యలను కడతేరుస్తున్న భర్తలు.. అది కూడా మామూలుగా కాదండోయ్.. ఎంతో కర్కశంగా చంపుతున్నారు. అసలు ఇంతటి శతృత్వం భార్యాభర్తల మధ్య ఎందుకు వస్తుంది. దీనికి ప్రధాన కారణం ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోవడం.. కనీసం ఇద్దరూ కలిసి మనసు విప్పి మాట్లాడుకోలేకపోవడమే కారణంగా చెబుతున్నారు. భార్యాభర్తల మధ్య మనస్పర్థుల రావడం అన్న అంశంపై ఉపాసన మాట్లాడారు. ఎన్ని పనులు ఉన్నా.. చరణ్‌తో కలిసి వారంలో ఒకరోజు డిన్నర్ డేట్‌కి ఉపాసన వెళ్తుందట. అక్కడే ఆ వారంలో జరిగిన విషయాలు, వ్యక్తిగత విషయాలు గురించి ఇద్దరు మాట్లాడుకుంటారంట. అలా చేయడం వల్ల ఒకరిపై ఒకరికి ప్రేమ పెరుగుతుందని ఆమె చెబుతున్నారు.
34
Ram Charan, chiranjeevi, Upasana, Game changer
చరణ్ సినిమాల్లో పెద్ద హీరో అయినప్పటికీ ఇంట్లో ఎప్పుడు అలా బిహేవ్ చేయడని ఉపాసన అంటున్నారు. ఇంట్లోని పనులన్నీ చేస్తుంటారని, తనకి కూడా సాయం చేస్తుంటారని చెబుతున్నారు. దీంతోపాటు రాంచరణ్ మహిళలకు ఎప్పుడూ మద్దతుగా ఉంటారని, ఏది చేయాలన్నా ప్రోత్సహిస్తారని అంటున్నారు. అందుకే తాను ధైర్యంగా అటు వ్యాపారం, ఇంటి వ్యవహరాలు చక్కబెడుతున్నట్లు వివరించారు. చరణ్ సెక్యూర్డ్‌గా ఉండే వ్యక్తి అని చెప్పుకొచ్చారు ఉపాసన.
44
ram charan upasana konidela
ప్రతి ఒక్కరి దాంపత్య జీవితంలో ఒడిదొడుకులు సహజమేనని ఉపాసన అంటున్నారు. ఆ సమయంలో ఒకరి ఒకరు తొడుగా ఉండాలని అలా చేస్తే ఎలాంటి సమస్యనైన పరిష్కరించుకోవచ్చని ఆమె చెప్పుకొచ్చారు. సమస్య వచ్చినప్పుడు ఇద్దరూ కూర్చుని చర్చించుకుని దాన్ని పరిష్కరించోకోవాలని చెబుతున్నారు. ఇదే తమ దాంపత్య జీవితం ఇంత సంతోషంగా ఉండటానికి కారణమని అంటున్నారు. ఇలా చేస్తే ప్రతిఒక్కరి జీవితం ఆనందమయమేనని తెలిపారు. ఎంత డబ్బున్నా, అసలు డబ్బు లేకున్నా.. అర్థం చేసుకోలేని మనుషులు లేకపోతే ఆ జీవితం నిరుపయోగమే... కాబట్టి.. ముఖ్యంగా భార్యాభర్తలు ఒకరికొకరు సమయం కేటాయించుకుని ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకుంటే జీవితం సుఖమయం అవుతుంది.