రామ్‌ చరణ్‌ చేతికి అకీరా నందన్‌ హీరోగా ఎంట్రీ బాధ్యతలు, `ఓజీ`లో గెస్ట్ రోల్‌.. రేణు దేశాయ్‌ క్రేజీ రియాక్షన్‌

Published : Apr 09, 2025, 05:21 PM ISTUpdated : Apr 09, 2025, 05:26 PM IST

Renu  Desai : పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ తనయుడు అకీరా నందన్‌ హీరోగా ఎంట్రీకి సంబంధించిన వార్తలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. `ఓజీ` సినిమా ద్వారా పరిచయం కాబోతున్నారనే టాక్‌ వినిపించింది. మరోవైపు హీరోగా పరిచయం చేయడానికి దర్శక, నిర్మాతలు క్యూ కడుతున్నారనే వార్తలు వచ్చాయి. మరో రెండేళ్లలో అకీరా హీరోగా పరిచయం కాబోతున్నారనే రూమర్స్ వచ్చాయి. అంతేకాదు ఇప్పుడు మరో క్రేజీ న్యూస్‌ బయటకు వచ్చింది. అకీరా ఎంట్రీ బాధ్యతలు అన్నయ్య రామ్‌ చరణ్‌ తీసుకున్నాడనే టాక్‌ నడుస్తుంది. దీనిపై అమ్మ రేణు దేశాయ్‌ స్పందించింది. ఆమె ఏం చెప్పిందనేది చూస్తే..   

PREV
15
రామ్‌ చరణ్‌ చేతికి అకీరా నందన్‌ హీరోగా ఎంట్రీ బాధ్యతలు, `ఓజీ`లో గెస్ట్ రోల్‌.. రేణు దేశాయ్‌ క్రేజీ రియాక్షన్‌
akira nandan, ram charan, renu desai

Renu  Desai : టాలీవుడ్‌లో స్టార్‌ వారసులు హీరోలుగా రావడం కామన్‌గా జరుగుతూనే ఉంది. ఎన్టీఆర్‌ వారసులుగా బాలకృష్ణ, కృష్ణ వారసులుగా మహేష్‌ బాబు, కృష్ణంరాజు వారసులుగా ప్రభాస్‌ ఎంట్రీ ఇచ్చారు. చిరు వారసుడిగా రామ్‌ చరణ్‌ హీరోగా రాణిస్తున్నారు.

ఇప్పుడు మూడో తరం వారసుల ఎంట్రీకి సమయం వచ్చింది. ఇప్పుడు పవన్‌ కళ్యాణ్‌ వారసుడుకి సంబంధించిన వార్తలు వస్తున్నాయి. పవన్‌ కొడుకు అకీరా నందన్‌ హీరోగా ఎప్పుడు పరిచయం అవుతారనేది మెగా ఫ్యాన్స్ లో క్యూరియాసిటీ నెలకొంది.  

25

ఈ నేపథ్యంలో ఇటీవల అకీరా నందన్‌కి సంబంధించిన క్రేజీ వార్తలు వినిపించాయి. పవన్‌ కళ్యాణ్‌ నటిస్తున్న `ఓజీ` చిత్రంలో అకీరా నందన్‌ ఎంట్రీ ఇస్తారని, ఇందులో చిన్న గెస్ట్ రోల్‌ చేస్తున్నారని, చిన్నప్పుడు పవన్‌గా అకీరా కనిపిస్తాడనే చర్చ నడిచింది. దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు. 
 

35
renu desai

మరోవైపు రామ్‌ చరణ్‌.. అకీరా బాధ్యతలు తీసుకున్నాడని, హీరోగా తనే పరిచయం చేస్తాడనే కొత్త వాదన వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో దీనిపై తాజాగా అకీరా మదర్‌ రేణు దేశాయ్‌ స్పందించారు. ఆమె ఈ రూమర్స్ ని ఖండించారు.

ఇలాంటి రూమర్స్ గతంలోనూ విన్నాను అని, అప్పుడు కూడా చెప్పాను, మళ్లీ చెబుతున్నాను, అకీరా ఇప్పుడు ఏ సినిమా చేయడం లేదని తెలిపారు. `ఓజీ`లో నటిస్తున్నారనేది పూర్తిగా ఫేక్‌ అని చెప్పారు. 
 

45
renu desai

ఇక అకీరా నందన్‌ ని హీరోగా పరిచయం చేసే బాధ్యతలు చరణ్‌ తీసుకున్నాడనే వార్తలను కూడా ఆమె ఖండించారు. చరణ్‌ లాంటి అన్నయ్య అకీరాకి ఉన్నందుకు ఆనందంగా ఉందని, కానీ అకీరాని చరణ్‌ హీరోగా పరిచయం చేస్తాడనేది నిజం కాదని, అవి కేవలం పుకార్లు మాత్రమే, వాటిని ఎవరూ నమ్మొద్దు అని తెలిపారు. 
 

55
renu desai

అకీరా నందన్‌ తనకు సినిమాల్లోకి రావాలని ఉందని అడిగితే బహిరంగంగా నేనే ప్రకటిస్తానని, ఆ విషయంలో ఆనందపడే మొదటి వ్యక్తిని నేనే అని చెప్పారు రేణు దేశాయ్‌. ఇప్పుడు ఇద్దరూ అకీరా, ఆధ్య స్టడీస్‌పై ఫోకస్‌ పెట్టారని, వారికి మరో ఆలోచన లేదని తెలిపారు.

వాళ్లు భవిష్యత్‌లో ఏమవుతారనేది వారి ఇష్టమని, ఆ విషయంలో తన ఒత్తిడి ఏం లేదన్నారు రేణు దేశాయ్‌. మొత్తంగా అకీరా నందన్‌ సినిమా ఎంట్రీకి సంబంధించిన ఆమె మరోసారి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. యూట్యూబర్‌ నిఖిల్‌ విజయేంద్రన్‌ సింహకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రేణు దేశాయ్‌ ఈ విషయాలను వెల్లడించారు. 

read  more: అకీరానందన్‌ పుట్టిన రోజే మార్క్ శంకర్‌కి ప్రమాదం.. కొడుకు పరిస్థితిని తలుచుకొని పవన్‌ కళ్యాణ్‌ ఎమోషనల్‌

also read: కొడుకు మార్క్ శంకర్‌ ఆరోగ్యంపై స్పందించిన పవన్‌.. ఇప్పుడు ఎలా ఉందంటే? అన్న చిరుతో కలిసి సింగపూర్‌ ప్రయాణం
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories