మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. ఇటీవల విడుదలైన టీజర్ తో రాంచరణ్ స్టేడియం బయటకి సిక్సర్ కొట్టారు అంటూ అంచనాలు పెరిగిపోయాయి. అంత అద్భుతంగా టీజర్ ఉంది. పాన్ ఇండియా స్థాయిలో పెద్ది చిత్రంపై ఫస్ట్ షాట్ టీజర్ అంచనాలు పెంచేసింది. సినీ ప్రముఖులు కూడా బుచ్చిబాబు టేకింగ్ పై, రాంచరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ పై ప్రశంసలు కురిపించారు.