పిల్లల్ని కనడంపై ఉపాసన ఆసక్తికర వ్యాఖ్యలు.. హీరోయిన్లతో రాంచరణ్ రొమాన్స్ గురించి ఇలా, నేనూ మనిషినే..

First Published | Nov 12, 2021, 10:03 AM IST

టాలీవుడ్ లో స్టార్ హీరోల సతీమణులకు కూడా పాపులారిటీ ఉంది. అల్లు అర్జున్ సతీమణి స్నేహ, మహేష్ బాబు భార్య నమ్రత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. 

టాలీవుడ్ లో స్టార్ హీరోల సతీమణులకు కూడా పాపులారిటీ ఉంది. అల్లు అర్జున్ సతీమణి స్నేహ, మహేష్ బాబు భార్య నమ్రత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. అభిమానులతో అనేక విషయాలు షేర్ చేసుకుంటూ ఉంటారు. ఇక మెగా పవర్ స్టార్ రాంచరణ్ సతీమణి ఉపాసన సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటారు. 

Ram Charan కి సంబంధించిన విశేషాలతో పాటు.. తాను చేస్తున్న సేవా కార్యక్రమాలు, హెల్త్ టిప్స్ లాంటి వివరాలని ఉపాసన తన సోషల్ మీడియా ఖాతాలలో పోస్ట్ చేస్తూ ఉంటారు. రీసెంట్ గా Upasana ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇంటర్వ్యూలో అనేక విషయాలని పంచుకుంది. రాంచరణ్ నటించే చిత్రాల సెట్స్ కి తాను కూడా అప్పుడప్పుడూ వెళుతుంటానని ఉపాసన పేర్కొంది. రాంచరణ్ హీరోయిన్లతో రొమాన్స్ చేసేటప్పుడు ఎలా ఫీల్ అవుతారని ప్రశ్నించగా ఆమె ఆసక్తికర సమాధానం ఇచ్చింది.


చరణ్ రొమాంటిక్ సీన్స్ చేస్తున్నపుడు జలసీగా, అన్ కంఫర్టబుల్ గా ఫీల్ అవుతాను. 100 శాతం ఆ ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే నేను కూడా మనిషినే. ఒకవేళ నాకు అలాంటి ఫీలింగ్స్ లేకుంటే నాకు చరణ్ పై ప్రేమ లేనట్లే అని ఉపాసన తెలిపింది. సో ఆ ఫీలింగ్స్ ఉన్నందుకు నేను హ్యాపీగా ఉన్నా అని పేర్కొంది. ఈ విషయంలో చరణ్, అత్తమ్మ నాకు బాగా సపోర్ట్ చేస్తారు.  అది కేవలం సినిమా మాత్రమే అని రియలైజ్ అయ్యేలా చేస్తారు. 

ఇక చరణ్ తో నటించిన హీరోయిన్లు చాలా మంది నాకు బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉన్నారు. వాళ్ళు కూడా నేను కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యేలా చేస్తారు. చిత్ర పరిశ్రమ నుంచి నేను చాలా నేర్చుకున్నా అని ఉపాసన తెలిపారు. రాంచరణ్ నటించిన చిత్రాలలో రంగస్థలం చాలా ఇష్టం అని అన్నారు. అది చాలా గొప్ప చిత్రంగా ఉపాసన అభివర్ణించారు. 

ఇక మావయ్య చిరంజీవి గారి చిత్రాల్లో సైరా అద్భుతమైన మూవీ అని పేర్కొన్నారు. ఈ వయసులో ఆయన చేస్తున్న  ప్రయోగాలకు, ఎంచుకుంటున్న కథలకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే అని ఉపాసన తెలిపింది. చిరంజీవి ప్రస్తుతం పోటీ పడుతూ వరుస చిత్రాలతో దూసుకుపోతున్నారు. నిన్ననే మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ అనే చిత్రం కూడా ప్రారంభం అయింది. 

ఇదిలా ఉండగా రాంచరణ్, ఉపాసన 2012లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కానీ ఈ జంట ఇంకా ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకోలేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. పిల్లల్ని కనడంపై ఉపాసనకు అప్పుడప్పుడూ మీడియా నుంచి ప్రశ్నలు ఎదురవుతూ ఉంటాయి. తాజాగా ఇంటర్వ్యూలో కూడా ఉపాసనకు ఈ ప్రశ్న ఎదురైంది. పిల్లల్ని కనడంపై ఉపాసన ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అది పూర్తిగా నా వ్యక్తిగత విషయం. దీని గురించి సమాధానం చెప్పాలని నేను అనుకోవడం లేదు. నేను ఎలాంటి సమాధానం ఇచ్చినా అది సెన్సేషన్ అవుతుంది. అది నాకు ఇష్టం లేదు. సరైన సమయం వచ్చినప్పుడు నేనే సంతోషంగా ప్రకటిస్తాను అని ఉపాసన పేర్కొంది. 

Also Read: Anasuya: గౌనులో అనసూయ వయ్యారాలు.. సింపుల్ బట్ వెరీ హాట్

Latest Videos

click me!