Kurup review: కురుప్ ట్విట్టర్ రివ్యూ

First Published Nov 12, 2021, 9:16 AM IST

మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ (Dulquer salmaan) కెరీర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కింది కురుప్ . పాన్ ఇండియా మూవీగా తెలుగు, మలయాళ, హిందీ, కన్నడ, తమిళ్ భాషాల్లో ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా నేడు విడుదల కావడం జరిగింది. 

దర్శకుడు శ్రీనాథ్ రాజేంద్రన్ కేరళ రాష్ట్రానికి చెందిన ఒకప్పటి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ సుకుమారన్ కురుప్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారు. సామాన్యుడైన సుకుమారన్ కురుప్... డాన్ కురుప్ గా ఎలా ఎదిగాడు. క్రిమినల్ గా అతడు మారడానికి గల కారణాలు ఏమిటీ? అనే విషయాలను ప్రస్తావిస్తూ పీరియాడిక్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కింది. 
 

ఇప్పటికే ఓవర్ సీస్ లో కురుప్ (Kurup) ప్రీమియర్ షోలు పడ్డాయి. యూఎస్, కెనడా, యూరప్ దేశాల్లో భారీగా విడుదలైన ఇండియన్ సినిమాగా కురుప్ నిలిచింది. ఇక కేరళలో రికార్డు ప్రీ బుకింగ్స్ ఈ చిత్రం నమోదు చేసింది. ఒక్క కేరళలోనే 2000 పైగా థియేటర్స్ లో కురుప్ విడుదల కావడం విశేషం. 
 

దుల్కర్ సల్మాన్ డాన్ కురుప్ రోల్ చేయగా,  ఇంద్రజిత్ సుకుమారన్, శోబితా ధూళిపాళ, షైన్ టామ్ చాకో, సన్నీ వేన్, విజయరాఘవన్, భరత్, సైజు కురుప్, హరీష్ కనరన్, గోపకుమార్, సురభి లక్ష్మి ఇతర కీలక రోల్స్ లో నటించారు. మరి కురుప్ సినిమా చూసిన నెటిజెన్స్ సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయం వెల్లడిస్తున్నారు. వాళ్ళ అభిప్రాయంలో కురుప్ మూవీ ఎలా ఉందో చూద్దాం 


ఆకట్టుకునే క్రైమ్ సన్నివేశాలు, డ్రామా ఉన్నప్పటికీ కథనం చాలా స్లోగా సాగుతుందని మెజారిటీ నెటిజెన్స్ అభిప్రాయం వెల్లడిస్తున్నారు. అయితే సెకండ్ హాఫ్ తో పాటు చివరి ముప్పై నిముషాలు సినిమా రేసీగా సాగిందని, ప్రేక్షకులకు మంచి అనుభూతి కలిగినట్లు చెబుతున్నారు. 


మంచి నటుడిగా పేరున్న దుల్కర్ సల్మాన్ డాన్ పాత్ర  మూవీలో బెస్ట్ పార్ట్ అంటున్నారు. 80ల నాటి క్రిమినల్ గా మేనరిజం, హీరోయిజం తో పాటు ఎమోషనల్ సన్నివేశాల్లో దుల్కర్ నటన బాగుందన్న మాట వినిపిస్తుంది. దుల్కర్ సల్మాన్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఈ మూవీలో చూడవచ్చనేది ట్విట్టర్ పీపుల్ అభిప్రాయం. 

ఒకటి రెండు ట్విస్ట్స్ తో పాటు మాస్ సన్నివేశాలు అలరిస్తాయని, అయితే అంచనాలకు అందేలా ఉన్న కథనం ఒకింత నిరాశ పరిచే అంశం అంటున్నారు. అయితే దర్శకుడు నెరేషన్ కి పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్, హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల తో పాటు ప్రధాన నటుల పెర్ఫార్మన్స్ ఆకట్టుకునే అంశాలు.

మొత్తంగా కురుప్ చిత్రంపై నెటిజెన్స్ పాజిటివ్ గా స్పందిస్తున్నారు. కురుప్ చూడగదగ్గ చిత్రమే అన్న అభిప్రాయం వెల్లడిస్తున్నారు. తెలుగులో కూడా భారీగా విడుదలైన కురుప్ మీ దగ్గర్లోని థియేటర్స్ లో సిద్ధంగా ఉంది. వీకెండ్ ఒకప్పటి కేరళ డాన్ కథ చూసి తెలుసుకోండి .  

Also read Pushpaka vimanam movie review:పుష్పక విమానం ప్రీమియర్ రివ్యూ... సుందరం భార్య లేచిపోయింది, జనాల ఫీలింగ్ ఏంటంటే!

Also read Raja Vikramarka review: కార్తికేయ `రాజా విక్రమార్క` యూఎస్‌ ప్రీమియర్ షో రివ్యూ

దర్శకుడు శ్రీనాథ్ రాజేంద్రన్ కేరళ రాష్ట్రానికి చెందిన ఒకప్పటి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ సుకుమారన్ కురుప్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారు. సామాన్యుడైన సుకుమారన్ కురుప్... డాన్ కురుప్ గా ఎలా ఎదిగాడు. క్రిమినల్ గా అతడు మారడానికి గల కారణాలు ఏమిటీ? అనే విషయాలను ప్రస్తావిస్తూ పీరియాడిక్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కింది. 
 

click me!