రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమా షూటింగ్‌లో హీరోయిన్ జాన్వీ కపూర్ కూడా పాల్గొంది. ఈ మూవీ సెట్‌ని ఉపాసన విజిట్ చేసి టీమ్‌ని సర్‌ప్రైజ్ చేసింది. దీంతోపాటు గిఫ్ట్ తో జాన్వీని ఆశ్చర్యపరిచింది. రామ్ చరణ్ తల్లి, ఉపాసన అత్తగారు సురేఖ.. జాన్వీ కోసం సెపరేట్‌గా గిఫ్ట్ పంపించడం విశేషం.
అదేంటో కాదు `అత్తమ్మ కిచెన్` కిట్. సురేఖ, ఉపాసన, అంజనాదేవిలు కలిసి `అత్తమ్మ కిచెన్` పేరుతో స్పెషల్ రిసిపీలు ప్రిపేర్ చేస్తున్న విషయం తెలిసిందే. వీటిని సేల్ చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో అమ్మకం కూడా జరుగుతుంది.