THIS Bollywood superstar was offered Rs 3.5 crore per episode for Bigg Boss in telugu
Bigg Boss: అప్పటి దాకా అందరూ మర్చిపోయిన వాళ్లు కూడా బిగ్ బాస్ వల్ల వెలుగులోకి వచ్చారు. అర్జెంట్ గా డబ్బు, కీర్తి కావాలంటే బిగ్ బాస్ కి ఎంపిక కాబడాలి అనేది బాలీవుడ్ చెప్పే మాట. చాలా మందికి తక్షణ శక్తిలా, తక్షణ కీర్తిని పొందడానికి బిగ్ బాస్ ఒక వేదికగా ఉపయోగపడింది.
షో లో పాల్గొన్ని కొంతమంది కంటెస్టెంట్లు ఈ షోకి ధన్యవాదాలు చెప్పుకుని, తమ జీవితాలను విజయ కథలుగా మార్చుకోగలిగారు.
తమ కెరీర్‌ను పునరుద్ధరించాలని కోరుకునే పలువురు సెలబ్రిటీలకు ఈ షో వేదికగా నిలిచింది. ఇది పోటీదారుల నిజమైన వ్యక్తిత్వాలను చూపిస్తున్నందువల్ల ఇది వివాదాస్పద ప్రదర్శనలలో ఒకటిగా నిలచింది. ఎక్కువగా, టెలివిజన్ నటులు మరియు ప్రభావశీలులు షోలో పాల్గొంటారు. అయితే బిగ్ బాస్‌లో భాగమయ్యే ఆఫర్ వచ్చినా రిజెక్ట్ చేసిన బాలీవుడ్ సూపర్ స్టార్ ఎవరో తెలుసా?
Bigboss 17
ఈ నటుడు ఒకప్పుడు బాలీవుడ్‌లో బిగ్గెస్ట్ సూపర్ స్టార్.ఆయన దాదాపు 180 చిత్రాలలో కనిపించాడు. ప్రతి సెలబ్రిటీ కోరుకునే గొప్ప స్టార్‌డమ్‌ను ఆస్వాదించాడు. ఆయనికి బిగ్ బాస్ ఆఫర్ వచ్చిందని మరియు అతను దానిలో భాగం కావాలని కూడా కోరుకున్నాడు.
కానీ తిరస్కరించారు. ఆయన మరెవరో కాదు రాజేష్ ఖన్నా. అవును, బాలీవుడ్ తొలి సూపర్ స్టార్! ఆయన గర్ల్ ప్రెండ్ అనితా అద్వానీ ఈ పెద్ద బహిర్గతం చేశారు. బాలీవుడ్ పత్రికతో జరిగిన ఒక ఇంటర్వ్యూలో, అనిత... రాజేష్ ఖన్నాకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చిందని చెప్పుకొచ్చింది.
telugu bigboss
ఆమె మాట్లాడుతూ... "రాజేష్ ఖన్నాకి పెద్ద మొత్తంలో చెల్లిస్తాను అన్నారు. ఎపిసోడ్ కు మూడున్నర కోట్లు ఆఫర్ చేసారు. బిగ్ బాస్ టీమ్ వాళ్లు ఆయన్ని ఒప్పించటానికి ఢిల్లీకి వెళ్ళారు,.అతను చెయ్యాలా వద్దా అని ఆలోచించాడు. ఆయన ఒక రాత్రి, "నేను బిగ్ బాస్‌కి వెళితే, నేను మంచి వ్యక్తిని అవుతాను" అని చెప్పాడు.
నేను, "ఏమిటి?" అని షాకింగ్ గా అన్నాను, మీరు ఎలా సెట్ అవుతారు బిగ్ బాస్ కి ? షోలో కంటెస్టెంట్లు గిన్నెలు కడుక్కోవాల్సి ఉంటుందని, సరైన ఆహారం కూడా ఇవ్వడం లేదని తెలిసింది అంది.
దీనికి, "రెఫ్యూజీ హై క్యా?" అని బదులిచ్చారు. బిగ్ బాస్ కోసం రాజేష్ ఖన్నాకు ఒక్కో ఎపిసోడ్‌కు రూ. 3.5 కోట్లు ఆఫర్ చేసినట్లు చెప్తున్నారు. కానీ, ఈ నటుడు లాభదాయకమైన ఆఫర్‌ను వదులుకున్నాడు!',"