అనవసర వివాదంలోకి “సరిపోదా శనివారం”,నానిపై దుష్ప్రచారం ?

 నాని అంటే గిట్టని కొందరు సినిమాపై నెగిటివిటి స్ప్రెడ్ చేయటానికి ఇలాంటి మార్గాన్ని ఎంచుకుంటున్నట్లు ఆయన అభిమానులు చెప్తున్నారు. 

Nani


సోషల్ మీడియా వచ్చాక ప్రతీ చిన్న విషయాన్ని బూతద్దంలోంచి చూస్తూ పెద్దది చేస్తున్నారు. తమదైన యాంగిల్ ని ముడిపెట్టి వివాదం రాజేస్తున్నారు. తన పనేంటో తాను చేసుకుపోయే నాని సినిమా పైనా ఇప్పుడు వివాదం మొదలెట్టడానికి సోషల్ మీడియాలో కొన్ని పోస్ట్ లు పడుతున్నాయి. నాచుర‌ల్ స్టార్ నాని హీరోగా వ‌స్తున్న నూత‌న చిత్రం ‘సరిపోదా శనివారం’. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి విడుద‌ల చేసిన లుక్స్‌, గ్లిమ్స్‌, టీజ‌ర్‌లు చిత్రం అంచ‌నాల‌ను రెండింత‌లు పెంచాయి. ఈ క్ర‌మంలో సినిమా విడుద‌ల ద‌గ్గ‌ర ప‌డుతున్న సంద‌ర్భంగా రీసెంట్ గా సినిమా ట్రైల‌ర్‌ను  రిలీజ్ చేశారు. ఆ ట్రైలర్ లో కొన్ని స్కీన్ షాట్స్ ని చూపెడుతూ మైనార్టీల మెప్పుపొందటానికి నాని ప్రయత్నిస్తున్నాడంటున్నారు. 

r Nani


సోషల్ మీడియాలో ఈ విషయమై చర్చ మొదలెట్టేసారు. నాని సరిపోదా శనివారం చిత్రం మరో V అవుతుందంటూ, మైనార్టీలు సమాజంలో అణగతొక్కేస్తూంటే ,నాని వాళ్లకు సపోర్ట్ గా నిలబడటం చూపెట్టడం ఎంతవరకూ సబబు అంటన్నారు. ఇలాంటి సీన్స్ ఎప్పటికి సినిమాల్లోంచి  పోతాయి. ఇదొకరకమైన ప్రాపగాండ. డైరక్ట్ గా చెప్పకుండా ఫలానా మతాలు వాళ్లను మిగతా సొసైటి అణగతొక్కేస్తోందని చూపెట్టడం పద్దతి కాదు అంటున్నారు.  



అలాగే గతంలో శ్యామ్ సింగరాయ్ సినిమాలోనూ హిందూ సనాతన ధర్మం వలన దేవదాశి వ్యవస్ద పుట్టింది అన్నట్లు, దానిపై పోరాటం చెయ్యాలన్నట్లు సినిమాలో  చూపారు అని మరొకరు కామెంటారు. ఇంకొకరు..నాని ఇలాంటివి చాలా కాలాలంగా చేస్తున్నాడు. భలే భలే మొగాడివోయ్ నుంచి నిన్న మొన్నటి అంటే సుందరానికి, శ్యామ్ సింగరాయ్, వి, ఇలా ప్రతీ సినిమాలోనూ హిందువులు ఈ సొసైటికి సమస్యలు తెచ్చిపెట్టేవారుగా చూపెడుతున్నాడని విమర్శలు మొదలెట్టారు.  


అయితే కథలో భాగంగా అలాంటి సీన్స్ రావచ్చు ఏమో కానీ నాని ఇంటెన్షల్ గా అలాంటి చేయరనేది అందరికీ తెలిసిందే. అయితే నాని అంటే గిట్టని కొందరు సినిమాపై నెగిటివిటి స్ప్రెడ్ చేయటానికి ఇలాంటి మార్గాన్ని ఎంచుకుంటున్నట్లు ఆయన అభిమానులు చెప్తున్నారు. ఏదైమైనా ప్రాపగాండా సినిమాలు వేరు. నాని చేసే సినిమా ఎంటర్టైన్ చేసేవి తప్పించి మరొకటి కాదు. లేకపోతే అతనికి ఇంత ఫాలోయింగ్ ఉండేది కాదు అనేది నిజం. 

Actor Nani starrer Jersey film re release update out


మరి కొందరైతే ఓవరాల్ గా మాస్ హీరో అయిపోవాలన్న తాపత్రయంలో నాని చేసిన సినిమా లేదా.. తన క్లాస్ మూవీ ' అంటే సుందరానికి'ని ఫ్లాప్ చేశారనే ఆక్రోశంలో వివేక్ ఆత్రేయ చేసిన సినిమాలా ఈ ట్రైలర్ చూస్తే కనిపిస్తోందని విమర్శలు మొదలెట్టారు. పోలీస్ స్టేషన్ ల సిఐ చేసే ఆకృత్యాలు.. అతనితో హీరో తలపడే సందర్భం.. అన్నీ కేవలం మాస్ ను మెప్పించాలనే తాపత్రయంలో కనిపిస్తున్నాయి తప్ప నేచురల్ గా కనిపించడం లేదు. పైగా ఇప్పటి వరకూ ఈ మూవీ నుంచి వచ్చిన అప్డేట్స్ తో కంపేర్ చేస్తే ట్రైలర్ పూర్తి భిన్నంగా.. ఆ కంటెంట్ కు ఈ ట్రైలర్ కు సంబంధం లేదు అన్నట్టుగా కనిపిస్తోంది అని అంటున్నారు. అయితే సినిమా చూడకుండా కేవలం ట్రైలర్ చూసి విమర్శలు చేయటం మాత్రం దారుణమైన విషయం. 

Again Sreekanth Odela to direct actor Nani

ఎస్ జెసూర్య, అభిరామి, ఆదితి బాలన్, పి సాయి కుమార్, మురళీ శర్మ, అజయ్, సుప్రీత్, అజయ్ ఘోష్, శుభలేక సుధాకర్ నటించారు. ఆగస్టు 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. తెలుగులో సరిపోదా శనివారంగా రాబోతుండగా.. మిగిలిన భాషల్లో డబ్ కాబోతుంది. అలాగే సూర్యస్ సాటర్ డే పేరుతో రాబోతోన్నట్లు తెలుస్తుంది. హిందీ, మలయాళం, కన్నడ, మలయాళ భాషల్లో డబ్ కానుంది. జేక్స్ బెజోయ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ.. ప్రీ ప్రొడక్షన్ వర్క్‌లో బిజీగా ఉంది. 

Latest Videos

click me!