
హాలీవుడ్ సంచలన దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ రూపొందించిన సంచలన మూవీ `ఓపెన్ హైమర్` తాజాగా 96వ ఆస్కార్ అవార్డు వేడుకలో సంచలనం సృష్టించింది. ఏకంగా ఏడు అవార్డులను సొంతం చేసుకుంది. 13 విభాగాల్లో ఇది ఆస్కార్‌కి నామినేట్ అయ్యింది. 7 విభాగాల్లో ఆస్కార్ గెలుచుకుంది. `బెస్ట్ పిక్చర్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ యాక్టర్, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్, బెస్ట్ సినిమాటోగ్రఫీ, బెస్ట్ ఎడిటింగ్, బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగాల్లో `ఓపెన్ హైమర్` సినిమా అకాడమీ అవార్డులను సొంతం చేసుకుంది.
`ఓపెన్ హైమర్` ఆస్కార్‌లో సంచలనం సృష్టించిన సందర్భంగా ఈ మూవీకి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు, అరుదైన విషయాలు, తెలియని విషయాలపై ఓ లుక్కేద్దాం. క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహించిన `ఓపెన్ హైమర్` అమెరికన్ ఆటం బాంబ్ పితామహుడు(ఫాదర్ ఆఫ్ ఆటం బాంబ్) జే రాబర్ట్ ఓపెన్‌హైమర్ జీవితం ఆధారంగా ఎపిక్ బయోలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు. జే రాబర్ట్ రెండో ప్రపంచ యుద్ధ సమయంలో `ది మ్యాన్ హట్టన్` పేరుతో ఆటం బాంబ్ తయారీ ప్రాజెక్ట్ ని చేపట్టారు. అంతేకాదు ఆ ఆటం బాంబ్‌ని జపాన్‌పై ప్రయోగించిన విషయం తెలిసిందే.
ఇందులో జే రాబర్ట్ పాత్రలో సిలిన్ మర్ఫీ మెయిన్ లీడ్‌గా నటించారు. ఆయన పాత్రలో జీవించారు. అయితే మొదట ఈ అవకాశం తనకు వచ్చినప్పుడు ముర్ఫీ భయపడ్డాడట. అంతటి లెజెండ్ రోల్‌కి తాను న్యాయం చేస్తానా అనే టెన్షన్ పడినట్టు ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. చాలా ఛాలెంజింగ్‌గా తీసుకుని ఈ పాత్రని చేశాడట. దాని ఫలితమే ఆయన నటనకు విశేష ప్రశంసలు దక్కాయి. అంతేకాదు ఇప్పుడు ఏకంగా ఆస్కార్ కూడా వరించింది. అయితే షూటింగ్ సమయంలో ఆయన ఇతర ఆర్టిస్ట్ లతో కలిసి గ్రూపు రాజకీయాలు చేశారు. అది వివాదంగా మారింది.
గతేడాది జులై 21న ఇది ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. వంద మిలియన్ డాలర్లతో రూపొంది, సుమారు వెయ్యి మిలియన్ డాలర్లు వసూళు చేసింది. అంటే మన కరెన్సీ ప్రకారం ఇది 7700కోట్లు వసూలు చేసింది. అయితే సినిమాపై ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు ఉండగా దాన్ని రీచ్ కాలేకపోయింది. దీనికి `బార్బీ` మూవీ విడుదలై సంచలన విజయం సాధించింది. `ఓపెన్ హైమర్`ని దెబ్బకొట్టింది.
ఇదిలా ఉంటే హలీవుడ్ సినిమాలు రెండు గంటలకు మించి ఉండవు. మహా అయితే 2.15-2.30గంటలు ఉంటాయి. అది కూడా చాలా అరుదుగా. కానీ `ఓపెన్ హైమర్` ఏకంగా మూడు గంటల నిడివి ఉంది. ఇది అత్యధిక నిడివి ఉన్న హాలీవుడ్ సినిమాగా నిలిచింది. ఈ నిడివి కూడా సినిమాపై నెగటివ్ టాక్ కి కారణమైందనే వార్తలు వచ్చాయి.
ఈ మూవీకి హై రెజల్యూషన్ కెమెరాని వాడారు. ఐమాక్స్ 65ఎంఎం, పానవిజన్ 65ఎంఎం కెమెరాలను ఉపయోగించి షూట్‌చేశారు. ఇది ప్రపంచంలోనే అత్యంత అప్‌డేటెడ్ వర్షన్ కెమెరాలు కావడం విశేషం. మరోవైపు కొన్ని సీన్లని బ్లాక్ అండ్ వైట్లో షూట్ చేశారు. దానికి ప్రత్యేక కారణాలున్నాయట. సెక్యూరిటీ రీజన్స్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అలా ఇది ఫస్ట్ బ్లాక్‌అండ్ వైట్ ఐమాక్స్ ఫిల్మ్ గా నిలిచింది.
ఇక ఈ సినిమాలో మరో సంచలన ప్రయోగం చేశారు. నూక్లియర్ బాంబ్ టెస్ట్ చేసే సీన్లని ఏకంగా ఒరిజినల్‌గా క్రియేట్ చేసి చేయడం విశేషం. చాలా వరకు సీజీఐలో చేస్తారు. కానీ సహజత్వం కోసం ఏకంగా బాంబ్‌నే పేల్చారు. ఆ సమయంలోనే దాన్ని కాప్చర్ చేశారు. ఇలా తక్కువ సీజీ వర్క్ తో సినిమాని కంప్లీట్ చేశారు.