Guppedantha Manasu
Guppedantha Manasu 11th march Episode: కాలేజీలో వసుధార పరువు పోతుందని, ఎండీ పదవికి రాజీనామా చేసి వెళ్లిపోతుందని శైలేంద్ర చాలా ఆశలు పెట్టుకున్నాడు. కానీ.. ఆయన ఆశలన్నీ నిరాశలుగా మిగిలిపోయాయి. మను వచ్చి ప్లాన్ మొత్తం రివర్స్ చేసేశాడు. వీళ్లు అంటించిన పోస్టర్లతో వసుధార బర్త్ డే పోస్టర్లతో నింపేశాడు. అది శైలేంద్ర ఊహించలేదు. వసుధార పరువు పోతుందని అనుకుంటాడు. ఆ విషయాలన్నీ ధరణి తన నోటితో తన తల్లికి చెప్పాలని ఆమెను కూడా కాలేజీకి తీసకువెళతాడు. కానీ.. సీన్ రివర్స్ అవ్వడంతో.. కాలేజీ నుంచి ఇంటికి వచ్చిన శైలేంద్ర ఫ్రస్టేట్ అవుతూ ఉంటాడు.
Guppedantha Manasu
ధరణి మాత్రం ఫుల్ సంతోషంగా ఉంటుంది. ఎందుకు అంత సంతోషపడుతున్నావ్ అని శైలేంద్ర అడిగితే.. మీరు కాలేజీలో చేసిన మంచి పని చూసి చాలా సంతోషంగా ఉందని అంటుంది. వెంటనే.. ఈ విషయాలన్నీ అత్తయ్యగారికి చెప్పాలని దేవయాణిని పిలుస్తుంది. దేవయాణి వచ్చి ఏమైంది అని అడిగితే.. నిన్నటి నుంచి ఆయన సర్ ప్రైజ్ ఉందని, కాలేజీకి రావాలని నాతో అన్నారు కదా.. కానీ ఆయన ఏదైనా కుట్ర చేస్తున్నారేమో అని నేను అనకున్నాను అని చెబుతుంది. కానీ.. నిజంగానే ఆయన చాలా మంచి పని చేశారు. ఏంటా పని అని దేవయాణి అడిగితే.. రేపు వసుధార బర్త్ డే అని.. కాలేజీ మొత్తం పోస్టర్లు అంటించారు అని చెబుతుంది. ఆ మాటకు దేవయాణి షాకౌతుంది. నిజమా.. ఏది వాడ్ని చెప్పమను అని అంటుంది.
Guppedantha Manasu
దానికి ధరణి.. ఆయన ముందే చెప్పారు కదా.. అక్కడ జరిగిందీ, చూసిందీ మొత్తం నేనే పూసగుచ్చినట్లు చెప్పాలని ఆయన అన్నారు కదా అని గుర్తు చేస్తుంది. ఎంత మంచివారండీ మీరు.. నాకే వసుధార బర్త్ డే గుర్తులేదు. కానీ మీరు గుర్తుంచుకున్నారు... బర్త్ డేకి ముందు రేజే అడ్వాన్స్ విషెస్ చెప్పారంటే మీరు ఎంత మంచివారు అని తెగ పొగిడేస్తూ ఉంటుంది. శైలేంద్ర మాత్రం.. లోపల ఇంకా ఫ్రస్టేట్ అవుతూ ఉంటాడు. పుండుపై కారు చల్లినట్లు ఉంది అని అనుకుంటూ ఉంటాడు. ధరణి.. మాత్రం సినిమా లెవల్లో డైలాగులు చెప్పి, కాఫీ తెస్తాను అని లోపలికి వెళ్తుంది.
Guppedantha Manasu
ఇక, ధరణి వెళ్లడం దేవయాణి మొదలుపెడుతుంది. నిజంగానే మారిపోయావా? బర్త్ డే పోస్టర్లు వేశావా? అందుకే నన్ను కాలేజీకి రావద్దు అన్నావా అని అడుగుతుంది. దానికి శైలేంద్ర తన ఫ్రస్టేషన్ మొత్తం బయటపెడతాడు. వసుధార నాశనం కోరుకునే నేను ఎందుకు అలా చేస్తాను..? నేను ఒకటి అనుకుంటే మరోటి జరిగింది.. నా ప్లాన్ మొత్తం రివర్స్ అయ్యింది.. కావాలనే తన ప్లాన్ రివర్స్ అయ్యిందని.. వెటకారంగా ధరని మాట్లాడుతోందని శైలేంద్ర చెబుతాడు. అసలు ఏం జరిగిందని దేవయాణి అడుగుతుంది.
దీంతో,... రాజీవ్ తో కలిసి తాను వేసిన ప్లాన్ మొత్తం వివరిస్తాడు. అయితే.. దానిని మను తిప్పి కొట్టిన విషయం కూడా చెబుతుంది. మను ఎందుకు ప్రతిసారీ మధ్యలో వస్తున్నాడు అని దేవయాణి అడుగుతుంది. అదే తనకు అర్థం కావడం లేదని.. ప్రతిసారీ.. అడ్డు వచ్చి.. నా ప్లాన్స్ అన్నీ తిప్పి కొడుతున్నాడని, ఫ్రస్టేషన్ తట్టుకోలేకపోతున్నాను అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
Guppedantha Manasu
ఇక.. మహేంద్రతో.. మను ఫోన్ లో మాట్లాడుతూ ఉంటాడు. గ్రాండ్ గా వసుధార పుట్టినరోజు సెలబ్రేట్ చేయమని, అందుకు ఏర్పాట్లు చేయమని మహేంద్ర చెబతాడు. వసుధార ఏమంటుందో అని మను సంశయం వ్యక్తం చేస్తే.. అవన్నీ తాను చూసుకుంటానని.. వసుని సంతోషపెట్టడమే మన లక్ష్యం అని, తన ఫుల్ సపోర్ట్ నీకే అని.. సెలబ్రేషన్స్ చూసి వసుధార షాకైపోవాలని చెబుతాడు. దానికి మను సరే అంటాడు.
ఇక, అనుపమ వచ్చి తప్పు చేస్తున్నావని.. వసుకి ఇష్టం లేకుండా ఈ సెలబ్రేషన్స్ అవసరమా అని అడుగుతుంది. కానీ... మహేంద్ర అసరమే అని, వసుని మనమే ఒప్పించాలని అంటాడు. వసు ఒప్పుకోదని అనుపమ అంటే... చాలా రోజులుగా వసుధార కంట్లో కన్నీళ్లు తప్ప మరేమీ లేవని.. తన ముఖంలో నవ్వు చూడాలని అందుకే ఇలా చేస్తున్నాను అని మహేంద్ర అంటాడు. అయితే.. వసుధార మాత్రం ప్రళయం సృష్టిస్తుందని, మనుని అవమానిస్తుందని.. అందరి ముందు తిడుతుందని అనుపమ అంటుంది. వసుధార ఒప్పుకోకుండా చేయడం తప్పమని, ఆపేయమని అనుపమ అంటున్నా కూడా.. మహేంద్ర ఒప్పుకోడు. తన కోడలి పుట్టినరోజు ఘనంగా జరిపించాల్సిందే అని అంటాడు. అనుపమ మహేంద్ర మనసు మార్చాలని ప్రయత్నిస్తుంది కానీ.. మహేంద్ర ఒప్పుకోడు. బర్త్ డే సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్ గా జరుగుతాయి అని అనేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
Guppedantha Manasu
ఇక వసుధార.. రిషి ఫోటో పట్టుకొని తన బాధ చెప్పుకుంటూ ఉంటుంది. మామయ్య కూడా తాను చేసింది తప్పు అంటున్నారని.. నాకు నచ్చకపోతే నచ్చలేదు అని చెప్పడం కూడా తప్పేనా అని బాధపడుతుంది. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది. రిషి లేకుండా బర్త్ డే చేసుకోను అని వసు అంటోంది. మను, మహేంద్ర మాత్రం సెలబ్రేషన్స్ చేస్తున్నారు.. వసు ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.