Guppedantha Manasu
Guppedantha Manasu 11th march Episode:శైలేంద్ర, రాజీవ్ ఇద్దరూ కలిసి వసు, మనుల పరువు తీయాలని అనుకున్నారు. కానీ వాళ్ల ప్లాన్ ని మను తిప్పి కొట్టాడు. రాజీవ్ తన చేతులతో కొత్త ప్రేమ జంట పోస్టర్లు అంటించడాన్ని మను స్వయంగా వీడియో తీస్తాడు. ఆ వీడియోని శైలేంద్ర, రాజీవ్ లకు చూపిస్తాడు.
Guppedantha Manasu
అది చూసి శైలేంద్ర కోపంతో రగిలిపోతాడు. నువ్వు అసలు మనిషివేనా... అంత కష్టపడి పోస్టర్లు అంటిస్తూ ఉంటే.. నువ్వు చూసి సంతోషిస్తావా అని అరుస్తాడు. దానికి మను నవ్వుతాడు. మా సంగతి మీకు తెలీదు అని శైలేంద్ర వార్నింగ్ ఇస్తాడు. అయితే.. తనకు తెలుసు అని మను అంటాడు. నాకు నువ్వు ఎంత నీచుడివో తెలుసు... వాడెంత దుర్మార్గుడో కూడా తెలుసు.. కానీ.. మీరిద్దరూ తోడు దొంగలు అనే విషయం మాత్రం ఇప్పుడే తెలిసింది అని అంటాడు. దానికి రాజీవ్.. అసలు నువ్వు ఎందుకు వసు విషయంలో దూరిపోతున్నావ్ అని అడుగుతాడు. నా పోస్టర్లు వేసి.. నేను దూరుతున్నాను అంటావేంటి అని మను రివర్స్ లో అడుగుతాడు. ఆ తర్వాత.. అసలు నీకు వసుధార ఏమౌతుంది అని ప్రశ్నిస్తాడు. చాలాసార్లు చెప్పాను కదా.. నా భార్య చెల్లెలు మరదలు అని రాజీవ్ బదులిస్తాడు.
Guppedantha Manasu
ఎవరి సపోర్ట్ లేకుండా వసుధార మేడమ్ చాలా ఉన్నత స్థాయికి ఎదిగారు ఆమెకు సపోర్ట్ గా ఉండాల్సిందిపోయి ఇలా చేస్తావా..? తల్లి చనిపోయింది, అక్క దూరమైంది... అలాంటి తనకు అండగా ఉండాల్సిందిపోయి ఇంత నీచంగా ప్రవర్తిసావా అని తిడతాడు. ఆ పోస్టర్లు నేను మార్చకుండా ఉంటే ఏమయ్యేది అని అడుగుతాడు. దానికి రాజీవ్ .. ఏముంది.. నిన్ను నాలుగు పీకి, నిన్ను దూరం పెట్టేది, అప్పుడు నేను నా వసుకి దగ్గరయ్యేవాడిని అని చెబుతాడు.
Guppedantha Manasu
నన్ను దూరం పెట్టడం కాదు.. ఎంత అవమానంగా భావించేది.. ఇంకోసారి ఇలాంటి పనులు చేస్తూ ఊరుకోను అని మను సీరియస్ గా స్ట్రాంగ్ ఇస్తాడు. కానీ.. రాజీవ్ మాత్రం చేస్తాను అని అంటాడు. అంతేకాదు. వసుకి దూరంగా ఉండమని, నవ్వుకుంటూ తిరగొద్దని చెబుతాడు. అయితే.. మను మాత్రం.. తాను అలానే ఉంటాను అని.. ఇద్దరికీ సీరియస్ వార్నింగ్ ఇస్తాడు. అయితే శైలేంద్ర.. ఎక్కువ మాట్లాడితే నువ్వు కాలేజీకి సహాయం చేయలేదని చెబుతాను అని అంటాడు. దానికి మను చెప్పు.. అసలు అప్పే లేదని నేను కూడా చెబుతాను.. చెబితే నిజాలు మొత్తం చెప్పాలని అంటాడు. తర్వాత వాళ్లిద్దరికీ వసు విషయంలో సీరియస్ గా వార్నింగ్ ఇస్తాడు. ఇంకోసారి తెగిస్తే.. తల తెంపేస్తాను అని వార్నింగ్ ఇచ్చి మను వెళ్లిపోతాడు.
Guppedantha Manasu
ఇక ఇంట్లో వసుధారతో అనుపమ, మహేంద్ర మాట్లాడుతూ ఉంటారు. మను చేసినదాంట్లో తప్పేముందని? నువ్వు ఎందుకు అంత సీరియస్ గా రియాక్ట్ అవుతున్నావ్ అని మహేంద్ర అడుగుతాడు. కానీ వసు ఏమీ మాట్లాడదు. నవ్వు ఫస్ట్ నుంచి మనుని తప్పుగా అర్థం చేసుకున్నావ్ అని అంటాడు. మొదట అనిపించిందని, కానీ ఇప్పుడు కాదని, మను మంచి మనసు తనకు అర్థమైందని వసు కూడా ఒప్పుకుంటుంది. ఇప్పుడు కూడా మను మంచివాడనే నువ్వు నమ్ముతున్నావ్ కదా అని అడుగుతాడు. అవును అని వసుధార బదులిస్తుంది. మనుని కన్న తల్లిదండ్రులు చాలా గొప్పవాళ్లు.. అందుకే వాళ్లకు అంత మంచి కొడుకు పుట్టాడు అని చెబుతూ ఉంటాడు. ఆ సమయంలో అనుపమ ఎక్స్ ప్రెషన్స్ మారిపోతూ ఉంటాయి. మహేంద్ర మాత్రం కంటిన్యూ చేస్తూనే ఉంటాడు. మను విషయంలో ఎందుకో నీకు తెలీకుండానే ఎక్కువగా రియాక్ట్ అవుతున్నావ్ అని మహేంద్ర అంటాడు. మను ఎలాంటివాడో.. వసుకి తెలుసు అని.. మనం చెప్పాల్సిన అవసరం లేదని అనుపమ అంటుంది. ఈ టాపిక్ ఇక్కడితో ఆపేయమని వసుధార అంటుంది.
Guppedantha Manasu
దానికి మహేంద్ర ఒప్పుకోడు. అసలు నీ ప్రాబ్లం ఏంటమ్మా.? చెఫ్పు నీ బర్త్ డే ఎందుకు చేయకూడదో చెప్పు అని అడుగుతాడు. దానికి వసు.. రిషి సర్ లేడు కదా మామయ్య , రిషి సర్ లేకుండా నేను ఏ సెలబ్రేషన్ చేసుకోను అని వసుధార అంటుంది. అంటే.. రిషి లేడు అని నువ్వు కూడా నమ్ముతున్నావా అని మహేంద్ర అడుగుతాడు. దానికి వసు షాకౌతుంది. ఇంకోసారి అలా అనొద్దు మామయ్య అని అంటుంది. దానికి మహేంద్ర.. రిషి ఉన్నాడని నేను కూడా నమ్ముతున్నాను.. నువ్వు సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవడంలో ఏ తప్పు లేదని మహేంద్ర అంటాడు.
Guppedantha Manasu
కానీ వసు మాత్రం.. సర్ వచ్చే వరకు తన జీవితంలో ఎలాంటి సెలబ్రేషన్స్ వద్దని, తనకు ఇంకేమీ చెప్పొద్దని, ఇంక తానేమీ వినదలుచుకోలదేని చెబుతుంది. ఎందుకు ప్రతిసారీ రిషి సర్ పేరు చెప్పి తనను బ్లాక్ మెయిల్ చేయాలని చూస్తున్నారు అని, తాను ఎవరి మాట వినను అని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మహేంద్ర ఏదో అనబోతుంటే.. వదిలేయమని.. తనకు ఇష్టం లేదు కదా అని అనపమ కూడా అంటుంది.