కోపం, బూతులే ఉమాదేవి కొంప ముంచాయా?.. షణ్ముఖ్‌పై అదే కామెంట్‌.. ముఖం వాడిపోయిందిగా!

Published : Sep 20, 2021, 09:09 AM IST

బిగ్‌బాస్‌5 రెండు వారాలు ముగిశాయి. రెండో వారంలో ఫైర్‌ బ్రాండ్‌ ఉమాదేవి ఎలిమినేట్‌ అయ్యారు. `ఫైర్‌ బ్రాండ్‌` ట్యాగే ఆమె కొంప ముంచింది. మరోవైపు వెళ్తూ వెళ్తూ ఉమాదేవి ఆసక్తికర కామెంట్లు చేసింది. సాఫ్ట్ గా చెబుతూ, గట్టిగా ఏసుకుంది.   

PREV
17
కోపం, బూతులే ఉమాదేవి కొంప ముంచాయా?.. షణ్ముఖ్‌పై అదే కామెంట్‌.. ముఖం వాడిపోయిందిగా!

బిగ్‌బాస్‌5 సీజన్‌ ప్రారంభం నుంచే రంజుగా సాగుతుంది. ఆశించిన స్థాయిలో టీఆర్‌పీ రావడం లేదనే కామెంట్లు వినిపించినా హౌజ్‌లో మాత్రం ఇంటి సభ్యులు రెచ్చిపోయి గేమ్‌ ఆడుతున్నారు. అదే సమయంలో వైలెన్స్, బూతులు తిట్టుకోవడం ఎక్కువైంది. శృతి మించింది. అందుకే విమర్శలపాలవుతుంది. శనివారం ఎపిసోడ్‌లో నాగార్జున అందరికి క్లాస్‌ పీకడంతో సభ్యులంతా కాస్త కామ్‌ అయ్యారు. అంతకు ముందు బూతులతో రెచ్చిపోయిన ఉమాదేవి సైతం రియలైజ్‌ అయ్యింది. కానీ ప్రయోజనం లేకుండా పోయింది. 

27

ఆదివారం జరిగిన రెండో ఎలిమినేషన్‌లో ఉమాదేవిని ఇంటికి పంపించేశాడు ఆడియెన్స్. ఆమె హౌజ్‌కి కరెక్ట్ కాదని షణ్ముఖ్‌తోపాటుసిరి, అనీ మాస్టర్, విశ్వ నామినేషన్‌ చేసిన విషయం తెలిసిందే. వీరి అభిప్రాయానే ఆడియెన్స్ కూడా స్పష్టం చేశారు. దీంతో ఉమాదేవి హౌజ్‌ నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది. వెళ్తూ వెళ్తూ ఎనిమిది మంది హౌజ్‌మేట్స్ పై ఉమాదేవి పలు హాట్‌ కామెంట్లు చేశారు. 

37

సిరి గురించి చెబుతూ, `నీకు అనిపించింది చెప్పేస్తావ్‌ కానీ, కానీ ఎదుటివాళ్లు ఎలా తీసుకుంటారు? అనేది పట్టించుకోవంటూ సిరి ఫొటో ఉన్న కుండ పగలగొట్టింది. అంతేకాకుండా షణ్ముఖ్‌ ఆట సిరి ఆడుతుందని ఆరోపించింది. ఇకనైనా నీ ఆట నువ్వు ఆడమని తెలిపింది. సిరి కోసం ఆడొద్దని సిరి, షణ్ముఖ్‌ల మధ్య ఉన్న రహస్య బంధాన్ని మరోసారి బయటపెట్టేసింది. దీంతో షణ్ముఖ్‌ ముఖం వాడిపోయినంత పనైంది. లహరి.. ఈ ప్లాట్‌ఫామ్‌ మీద చాలా వీక్‌ అని, పక్కవాళ్లు సపోర్ట్‌ చేస్తేనే ఆడుతుందే తప్ప సొంతంగా ఆడట్లేదని చెప్పింది. సేఫ్‌గా ఆడుతున్నారని తన ఆట తాను ఆడాలని తెలిపింది. 

47

యాంకర్‌ రవి గురించి చెబుతూ అందరినీ దగ్గరకు తీసుకుంటున్నావు, కానీ ఈ క్రమంలో వేరేవాళ్లకు దూరమైపోతున్నావని తెలిపింది. లోబోను హౌస్‌లో ఎంతోమంది కించపరుస్తున్నారంటూ ఎమోషనల్‌ అయింది. ఎంతోమంది స్వీట్‌ హార్ట్‌ అని అంటారు, కానీ లోపలి నుంచి అనరు. ఇకనైనా నీ బుర్రతో గేమ్‌ ఆడంటూ సలహా ఇచ్చింది. యానీ మాస్టర్‌తో ఎటువంటి గొడవా లేదని, కానీ ఆమెకు కోపం ఎక్కువని పేర్కొంది. ఇక్కడ మనకు ఎవ్వరూ ఏం కాదు! అమ్మ, అక్క, చెల్లి అని మాత్రం చూడకండి అని యానీ మాస్టర్‌కు సూచించింది. తర్వాత నటరాజ్‌ మాస్టర్‌ను బాగా ఆడాలని, ఇలాగే ఆడితే వేరే లెవల్‌లో ఉంటారంటూ అతడి కుండ పగలగొట్టింది. 

57

అయితే ఈ సందర్భంగా ఉమాదేవి ఎలిమినేట్‌ కావడానికి కారణాలు చూస్తూ, ఆమె కోపం, ఆమె వాడే పదాలు, బూతులే ఆమె కొంప ముంచాయనే టాక్‌ సోషల్‌ మీడియా నుంచి వినిపిస్తుంది. టాస్క్‌ల్లో, నామినేషన్‌లోనూ ఆమె వాడకూడని బూతు పదాలు వాడింది. ఇంటిసభ్యులే ఆమె పదజాలానికి షాక్‌ అయ్యారు. తనకు సంబంధించి ఏ విషయం చెప్పాలన్నా మరీ గట్టిగా అరుస్తూ చెప్పడం, బూతు పదాలు వాడటం అందరిని ఇబ్బంది పెట్టింది. ఇలాంటి పదాల కారణంగానే బిగ్‌బాస్‌5పై విమర్శలొచ్చాయి. ఇలా ఫ్యామిలీ ఓట్లని దూరమైంది ఉమాదేవి.
 

67

మరోవైపు బిగ్‌బాస్‌ హౌస్‌లో హింసకు తావు లేదన్న నిబంధనను తుంగలో తొక్కింది. కెప్టెన్సీ టాస్కులో ప్రియాంక సింగ్‌ను కిందకు తోసేసింది. ఆమె తోసిన విధానం అందరికి హర్టింగ్‌గా అనిపించింది. అంతేకాకుండా ఉమాదేవి కొట్టిందంటూ పలువురు లేడీ కంటెస్టెంట్లు కూడా ఆమెపై ఆరోపణలు చేయడం పెద్ద మైనస్‌గా మారింది. దీనికి ఆమె వెంటనే వివరణ ఇవ్వలేకపోయింది. 

77

అయితే శనివారం ఎపిసోడ్‌లో ఇవన్నీ కరెక్ట్ చేసుకుంటానని, తాను చేసిన తప్పులకు ఏకంగా గుంజీలు కూడా తీసింది ఉమాదేవి. కానీ జరగాల్సిన నష్టం అప్పుడే జరిగిపోయింది. ఆమెకి ఓట్లు తక్కువ పోల్‌ అయ్యాయి. దీంతో ఎలిమినేట్‌ కాకతప్పలేదు. వెళ్లే టప్పుడు మరీ ఫైర్‌ అవుతూ కాకుండా సాఫ్ట్ కార్నర్‌లో ఇంటిసభ్యుల గురించి చెప్పి అందరి హృదయాలను గెలుచుకుంది ఉమాదేవి. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories