ఆ తర్వాత రవి-ప్రియా, లహరి - జశ్వంత్, అనీ - విశ్వ ఇలా డాన్స్ పోటీ జరుగుతుంది. ఈ పోటీలో అమ్మాయిలు విజయం సాధిస్తారు. అనంతరం నాగార్జున నామినేషన్స్ లో ఉన్న నలుగురిలో నుంచి ఒకరిని సేవ్ చేసే ప్రక్రియ ప్రారంభిస్తారు. నామినేషన్స్ లో ఉన్న నటరాజ్, ఉమా దేవి, కాజల్, ప్రియా ముందుకు వచ్చి నిలబడతారు. బిగ్ బాస్ ప్లే చేసిన పాటలో ఎవరి పాట వస్తే వారు సేఫ్ అని నాగ్ అంటాడు.