Ajith, Vidaamuyarchi, ram Charan, Game Changer
సంక్రాంతి సినిమాలు తెలుగు తో పాటు, తమిళంలో కూడా ప్రాధాన్యత కలిగి ఉంటాయి. ఈ సీజన్ లో ఇక్కడ సినిమాలు అక్కడ తమిళంలోనూ, అక్కడ సినిమాలు తెలుగులోనూ డబ్బింగ్ అవుతూంటాయి. ఆయా స్టార్ హీరోల క్రేజ్ ని బట్టి థియేటర్స్ ,పోటీ ఉండటం జరుగుతుంది. ప్రతీ సంక్రాంతిలాగే ఈ సారి కూడా స్టార్స్ సినిమాలు తమిళంలోనూ,తెలుగులోనూ పోటీ పడుతున్నాయి.
ఈ సంక్రాంతికి అన్ని సినిమాల కంటే ముందుగా గేమ్ ఛేంజర్(Game Changer)రిలీజ్ అవుతోంది. ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో సానుకూల అంశాలు చాలానే ఉన్నాయి. సినిమాకు మంచి పాజిటివ్ టాక్ వస్తే ఓపెనింగ్స్ నెక్ట్స్ లెవెల్ లో ఉంటాయని అందరూ ఫిక్సైపోయారు. అయితే తమిళంలో భారీ రిలీజ్ కు మాత్రం అజిత్ అడ్డం తగులుతున్నారు.
తెలుగులో ఎలాంటి సమస్యా లేదు కానీ తమిళంలో మాత్రం చరణ్(charan) సినిమా అజిత్(Ajith) సినిమాతో డైరెక్ట్ క్లాష్ అయ్యే ఛాన్సున్నట్లు తెలుస్తోంది. అజిత్ నటించిన విడాముయార్చి(Vidamuyarchi)ని కూడా జనవరి 10కే రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తమిళ వర్గాల సమాచారం. అదే జరిగితే గేమ్ ఛేంజర్ తమిళ వెర్షన్ కు స్క్రీన్ల్ పరంగా ఇబ్బందులు తప్పవు. కానీ ఇప్పుడు సీన్ మారే పరిస్దితి వస్తోంది.
అజిత్ నటించిన విడాముయార్చి చిత్రం సంక్రాంతికి రిలీజ్ అయ్యే అవకాశాలు తగ్గుతున్నాయని అక్కడ మీడియా అంటోంది. స్లోగా ప్రమోషనల్ యాక్టివిటీస్ జరుగుతూండటం ఈ న్యూస్ కు బలం చేకూరుస్తోంది. అయితే ఎంతవరకూ ఈ సిట్యువేషన్ గేమ్ ఛేంజర్ సినిమాకు ప్లస్ అవుతుందనేది వేచి చూడాల్సిన అంశం.
విడాముయార్చి చిత్రం ఇప్పటిదాకా సెన్సార్ పూర్తి కాలేదు. న్యూ ఇయిర్ కు విడుదల అవుతుందంటున్న విడాముయార్చి ట్రైలర్ సైతం పోస్ట్ ఫోన్ కావచ్చు అంటున్నారు. అదే జరిగితే ప్రమోషన్స్ పెద్దగా లేకుండా సినిమా రిలీజ్ చేయాల్సిన సిట్యువేషన్ క్రియేట్ అవుతుంది. ఇలాంటి సిట్యువేషన్ లో అజిత్ ఒప్పుకోరని విడాముయార్చి ని వాయిదా వేయమంటారని మీడియాలో వినపడుతోంది.
Richest Chief Minister in India
విడాముయార్చి రిలీజ్ అయితే మాత్రం తమిళనాడు, కేరళలో అజిత్ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఆయనకే ఎక్కువ స్క్రీన్స్ దక్కుతాయి. హైప్ పరంగా చరణ్ సినిమా కంటే అజిత్ సినిమా వెనుకబడినప్పటికీ ప్రమోషన్స్ తో హైప్ ను పెంచాలని లైకా సంస్థ చాలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. దీంతో ఇప్పుడు పండగ రేసులోకి రామ్ చరణ్(ram charan), బాలకృష్ణ(balakrishna), వెంకటేష్(Venkatesh) తో పాటూ అజిత్ కూడా ఉన్నాడని స్పష్టమవుతుంది. గేమ్ ఛేంజర్ తర్వాత రెండు రోజులకు డాకు మహారాజ్(Daku Maharaj), నాలుగు రోజులకు సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunnam) రిలీజవడం కూడా ఈ సినిమాకు సానుకూల అంశమే.