చిరంజీవిని ఉదయ్‌ కిరణ్‌ గాడ్‌ ఫాదర్‌లా భావించేవాడు, కానీ.. తొక్కేశాడనే వార్తలపై అక్క శ్రీదేవి కామెంట్స్ వైరల్

First Published Mar 25, 2024, 8:29 PM IST

ఉదయ్‌ కిరణ్‌ కెరీర్‌ డౌన్ కావడానికి చిరంజీవినే కారణమనే ఆరోపణలు, వార్తలు వినిపించాయి. తాజాగా దీనిపై ఉదయ్‌ కిరణ్‌ అక్కడ స్పందించింది.  
 

తెలుగు తెర లవర్‌ బాయ్‌ ఉదయ్‌ కిరణ్‌ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆయన మరణించి పదేళ్లు దాటింది. అయినా ఏదో సందర్బంలో ఉదయ్‌ కిరణ్ కి సంబంధించిన వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఆయనపై చర్చ జరుగుతూనే ఉంది. కెరీర్‌కి సంబంధించిన విషయాలను, సినిమాలు, ఆయన మరణానికి కారణాలు అంటూ చాలా మంది ప్రముఖులు మాట్లాడుతున్నారు. రకరకాల కామెంట్లు చేస్తున్నారు. 

Survey:వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని భావిస్తున్నారు. మీ అభిప్రాయం తెలపండి?
 

ఉదయ్‌ కిరణ్‌ని చిరంజీవి తొక్కేశాడనే ఆరోపణలు చాలా వరకు వినిపించాయి. ఇప్పటికీ వినిపిస్తున్నాయి. తన కూతురుతో పెళ్లి క్యాన్సిల్‌ చేసుకోవడం వల్లే ఇదంతా చేశాడని, కక్షకట్టి ఆఫర్లు రాకుండా చేశాడనే ప్రచారం జరిగింది. మెగాస్టార్‌పై అనేక ఆరోపణలు వచ్చాయి. అయితే తాజాగా వీటిపై ఉదయ్‌ కిరణ్‌ అక్క శ్రీదేవి స్పందించారు. ఆమె లేటెస్ట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో దీనిపై స్పందించింది. 
 

చిరంజీవి తొక్కేశారని, ఆఫర్లు లేక ఉదయ్‌ కిరణ్‌ డిప్రెషన్‌లోకి వెళ్లారనే ఆరోపణలు విన్నప్పుడు మీ రియాక్షన్‌ ఏంటని అడిగినప్పుడు ఆమె స్పందిస్తూ, జరిగిందేదో జరిగిపోయింది. దానికి ఎవరినీ బ్లేమ్‌ చేయదలుచుకోవడం లేదని, దానికి కారణం ఎవరని చెప్పలేమని ఆమె తెలిపింది. కానీ చిరంజీవి గురించి చెబుతూ, ఆయన ఉదయ్‌కి చాలా సపోర్ట్ చేశారని, ఎల్లప్పుడు బ్యాక్‌ సపోర్ట్ గా, ఆయన చేయగలిగింది చేశాడని చెప్పింది. 
 

ఈ సందర్భంగా ఓ షాకింగ్‌, ఇంట్రెస్టింగ్‌ విషయాలను షేర్‌ చేసుకుంది ఉదయ్‌ కిరణ్‌ అక్క శ్రీదేవి. ఉదయ్‌ కిరణ్‌.. చిరంజీవిని గాడ్‌ ఫాదర్‌లా చూసేవాడని తెలిపింది. చాలా సందర్భాల్లో తన సినిమాల గురించి చిరంజీవితో చర్చించేవాడని, ఏదైనా స్టోరీ వింటే ఇలా ఉందని చిరంజీవితో చెప్పేవాడని, ఆయన్నుంచి సలహాలు, సూచనలు తీసుకునేవాడని చెప్పింది. ఎప్పుడూ ఆయన్ని ఓ గాడ్‌ ఫాదర్‌లానే భావించేవాడని చెప్పింది. 
 

ఇక `ఇంద్ర` సినిమా ఎక్స్ పీరియెన్స్ ని కూడా ఈ సందర్భంగా షేర్‌ చేసుకుంది. `ఇంద్ర` సినిమా ఈవెంట్‌ జరుగుతుంది. తాము చిరంజీవికి పెద్ద అభిమానులమని, ఎలాగైనా చిరంజీవిని చూడాలని `ఇంద్ర` ఈవెంట్‌కి వెళ్లారట. పాస్‌లు లేకపోయినా ప్రెస్‌ పాస్‌లపై వెళ్లినట్టు చెప్పింది. వెళ్లి లోపల కూర్చున్నాక ఉదయ్‌.. అక్క చిరంజీవిని టచ్‌ చేయాలనుందని అడిగాడు. దీంతో సెక్యూరిటీ బతిమాలుకుని ముందుకు వెళ్లాం, తీరా అక్కడికి వెళ్లాక అల్లు అరవింద్‌ ఆపేశారు. ఆయనతో చాలా సేపు బతిమాలుకున్నారు. ఉదయ్‌ కూడా రిక్వెస్ట్ చేశాడు. చివరికి చిరంజీవిని కలిపించారు. ఆయన ఉదయ్‌కి షేక్‌ హ్యాండ్‌ ఇచ్చాడు. 
 

చిరంజీవి చేతులు పట్టుకున్న ఉదయ్‌ ఆ విషయం చెబుతూ చిరంజీవి అంకుల్‌ చేతులు చాలా చల్లగా ఉన్నాయి అక్క, భలే అనిపించాయని, ఆ చేతిని కడుక్కోను అని అలానే ఉంచుకుంటానని చెప్పి మురిసిపోయేవాడట. అలాంటి వ్యక్తి ఆ తర్వాత ఏకంగా చిరంజీవి పక్కనే సీట్లో కూర్చునే స్థాయికి ఎదిగడం నాకు చాలా గర్వంగా అనిపిస్తుందని తెలిపింది. అంతేకాదు ఓ సారి చిరంజీవి సినిమా షూటింగ్‌, తన సినిమా షూటింగ్‌ ఒకే చోట పక్క పక్కనే జరుగుతున్నాయట. అప్పుడు ఇంటికొచ్చి ఆ మూమెంట్‌ని షేర్‌ చేసుకున్నాడని, ఎంతో హ్యాపీగా ఫీలయ్యేవాడని తెలిపింది. 
 

అయితే ఉదయ్‌ కిరణ్‌ చాలా ఎమోషనల్‌ పర్సన్‌ అని, సెన్సిటివ్‌, ఏదైనా బాధ వస్తే, ఏదైనా హర్ట్ అయ్యే సంఘటన చోటు చేసుకుంటే ఫీలైపోతాడని, ఏడ్చేస్తాడని, కానీ ఎప్పుడూ వెనక్కి తగ్గడని చెప్పింది. అయితే తాను సూసైడ్‌ చేసుకునే రోజు కూడా మార్నింగ్‌ ఫోన్‌లో మాట్లాడినట్టు తెలిపింది. చాలా కూల్‌గా మాట్లాడాట. మళ్లీ కమ్‌ బ్యాక్‌ అవుతాను, కొడతాను అని చెప్పాడట. దాదాపు పదిహేను నిమిషాల పాటు మాట్లాడినట్టు తెలిపింది. కానీ అంతలోనే ఇలా జరిగిపోయిందని ఆమె ఎమోషనల్‌ అయ్యింది. 

ఉదయ్‌ కిరణ్‌.. `చిత్రం` సినిమాతో హీరోగా టాలీవుడ్‌కి పరిచయం అయ్యాడు. తొలి చిత్రంతోనే అందరిని ఆకట్టుకున్నాడు. పెద్ద హిట్‌ అందుకున్నారు. `నువ్వు నేను`, `మనసంతా నువ్వే`లతో హ్యాట్రిక్‌ హిట్‌ అందుకున్నారు. `కలుసుకోవాలని`, `హోలి`, `నీ స్నేహం`, `నీకు నేను నాకు నువ్వు`, `జోడీ నెం1`, `ఔనన్నా కాదన్నా` చిత్రాలతో అలరించారు. ఆ తర్వాత కెరీర్‌ డౌన్‌ అయ్యింది. చివరగా ఆయన `జైశ్రీరామ్‌` చిత్రంలో నటించాడు. ఇది ఆడలేదు. `చిత్రం చెప్పిన కథ`లో నటించాడు. కానీ ఇది రిలీజ్‌ కాలేదు. 
 

ఉదయ్‌ కిరణ్‌.. 2012లో విశితని వివాహం చేసుకున్నాడు. అప్పటికే ఉదయ్‌ కిరణ్‌ కెరీర్‌ డౌన్‌లో ఉంది. ఆ తర్వాత ఒత్తిడి మరింత పెరిగిందట. అయితే అంతకు ముందు మధ్యలోనే చిరంజీవి కూతురు సుస్మితతో పెళ్లి చేయాలనుకున్నారు. కానీ ఉదయ్‌ కిరణ్‌ నో చెప్పినట్టు సమాచారం. 
 

click me!