కోడి మొత్తం తిన్నదని పెళ్లికి ముందే లావణ్యని వదిలించుకోవాలనుకున్న పూరీ జగన్నాథ్‌.. షాకింగ్‌ విషయం వెల్లడి

Published : Mar 25, 2024, 06:18 PM ISTUpdated : Mar 26, 2024, 09:23 AM IST

దర్శకుడు పూరీ జగన్నాథ్‌, ఆయన భార్య లావణ్య ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. మ్యారేజ్‌ వెనకాల క్రేజీ లవ్‌ స్టోరీ, ఫన్నీ విషయాలను పంచుకున్నాడు పూరీ.   

PREV
19
కోడి మొత్తం తిన్నదని పెళ్లికి ముందే లావణ్యని వదిలించుకోవాలనుకున్న పూరీ జగన్నాథ్‌.. షాకింగ్‌ విషయం వెల్లడి

డేరింగ్‌ అండ్‌ డాషింగ్ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌.. లావణ్యని పెళ్లి చేసుకున్నాడు. మ్యారేజ్‌ జరిగి 28ఏళ్లు అవుతుంది. వీరికి ఇద్దరు పిల్లలు కుమారుడు, కూతురు ఉన్నారు. కొడుకు ఆకాశ్ పూరీ హీరోగా రాణిస్తున్నాడు. హీరోగా నిలబడేందుకు స్ట్రగుల్‌ అవుతున్నాడు. కూతురుని పూర్తిగా సినిమాలకు దూరంగా ఉంచాడు పూరీ జగన్నాథ్‌.

Survey:వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని భావిస్తున్నారు. మీ అభిప్రాయం తెలపండి?
 

29

పూరీ జగన్నాథ్‌, లావణ్యల మధ్య విభేదాలున్నట్టుగా అప్పట్లో వార్తలొచ్చాయి. విడిపోతున్నారు వార్తలు కూడా గుప్పుమన్నాయి. కొన్ని వివాదాలు వచ్చాయి. కానీ అవేవీ నిలవలేదు. వీరు కలిసే ఉన్నారు. ఫ్యామిలీ పరంగా అంతా బాగానే ఉందని టాక్‌. అయితే లావణ్యని పూరీ లవ్‌ మ్యారేజ్‌ చేసుకున్నారు. వీరి పెళ్లి సినిమాటిక్‌గా జరగడం విశేషం. నటి హేమ వీరి పెళ్లికి సపోర్ట్ చేసినట్టు గతంలో పలు ఇంటర్వ్యూలో తెలిపింది. 
 

39

ఇదిలా ఉంటే దర్శకుడు పూరీ జగన్నాథ్‌ తమ ప్రేమ విషయంలో కొత్త కోణం, ఇప్పటి వరకు బయటకు రాని విషయాన్ని వెల్లడించాడు. అంతేకాదు మరో షాకింగ్‌ విషయాన్ని చెప్పాడు. పెళ్లికి ముందే ఆమెని వదిలించుకోవాలనుకున్నాడట. అయితే అందుకు చెప్పిన కారణం మాత్రం చాలా ఫన్నీగా, క్రేజీగా ఉండటం విశేషం. `ఓపెన్‌ హార్ట్ విత్‌ ఆర్కే` టాక్‌ షోలో ఈ విషయాలు చెప్పాడు పూరీ. 
 

49

పూరీ జగన్నాథ్‌.. దర్శకుడి అవ్వాలనుకునే రోజుల్లో కొన్ని సినిమాలకు ఘోస్ట్ డైరెక్టర్‌గా పని చేస్తుండేవాడట. అలా ఓ సినిమా షూటింగ్‌ జరుగుతున్నప్పుడు లావణ్య ఆ సినిమా షూటింగ్‌ చూడ్డానికి వచ్చిందట. సడెన్‌గా ఆమెవైపు పూరీ చూపు మళ్లింది. ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. అలానే ఓ గంట సేపు చూస్తూనే ఉన్నాడట. ఎందుకో ఆ టైమ్‌లో తన భార్యగా ఆమె బాగా సెట్‌ అవుతుందనిపించిందట. అంతే వెళ్లి తన విజిటింగ్ కార్డ్ ఇచ్చి, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా, ఇష్టమైతే, ఫోన్‌ చేయి, లేదంటే చేయకు అని చెప్పాడట. 
 

59

ఆమె వారం రోజుల తర్వాత ఫోన్‌ చేసి ఎంత మందికి ఇలాంటి కార్డ్ ఇచ్చావు, ఎప్పుడూ ఇదే పనా అంటూ ఆరా తీసే ప్రోగ్రామ్‌ పెట్టుకుందట. మొత్తంగా కనెక్ట్ అయ్యిందట. కలిసి తిరగడం స్టార్ట్ చేశారు. ఆ సమయంలో పూరీ స్ట్రగులింగ్‌లో ఉన్నాడు. దర్శకుడు కాలేదు. డబ్బులు ఉండేవి కాదు, లావణ్య వస్తుందంటే ఫ్రెండ్స్ వద్ద అప్పు చేయాల్సి వచ్చేదట. అలా ఓ రోజు హోటల్‌కి లంచ్‌కి వెళ్లారట. 

69

హోటల్ కి వెళ్దామంటే డబ్బులు లేవు. మళ్లీ ఫ్రెండ్స్ వద్ద అడుక్కుని వెళ్లాడట. అందులో ఆమె తందూరి కోడి ఆర్డర్‌ చేసిందట. దీంతో తను షాక్‌ అయ్యాడట. ఆ కోడి మొత్తం తినగలమా అని, కానీ తను తినడం స్టార్ట్ చేసింది, పూరీ మాత్రం తిన్నట్టుగా యాక్ట్ చేస్తున్నాడట. తీరా చూస్తే కోడి మొత్తం తినేసిందట. దీంతో పూరీకి భయం పట్టుకుంది. వామ్మో ఇప్పుడే ఇంత తింటుంది, పెళ్లైయ్యాక నా పరిస్థితి ఏంటి? అని ఆలోచించాడట. 
 

79

అనేక ఆలోచనలో, తన స్ట్రగులింగ్‌ టైమ్‌ ఇవన్నీ ఆలోచించుకుని ఆమెని వదిలించుకోవాలనుకున్నాడట. దీంతో ఆమెకి చెప్పేశాడట. ఇక నో మీటింగ్స్, ఓన్లీ పెళ్లి చేసుకుందామంటే కలుద్దామని, లేదంటే లేదన్నాడట. ఆ తర్వాత వాళ్ల పెద్దలను, వీళ్ల పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారట. అయితే మ్యారేజ్‌ కూడా విచిత్రంగా జరిగిందట. అమ్మాయి వాళ్ల పేరెంట్స్ ఓకే అన్నారు, పూరీ ఫ్యామిలీ ఓకే అని చెప్పింది. కానీ ఈ ఇద్దరు లేచిపోయి పెళ్లి చేసుకున్నారట. దొంగచాటున సడెన్‌గా మ్యారేజ్‌ చేసుకున్నారు. 
 

89

పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయి ఫ్రెండ్స్ కి చెబితే, తలా ఒకరు ఒక్కో ఐటెమ్‌ తెచ్చారని, ఒకరు తాళి, మరొకరు బట్టలు, మరికొందరి పెళ్లి కావాల్సిన అన్ని తీసుకొచ్చారట. ఓ టెంపుల్‌లో పెళ్లి చేసుకుని కూల్‌ డ్రింక్‌ తాగి ఇక పెళ్లి అయిపోయిందని ఇంటికి ఫోన్‌ చేసి చెప్పారట. అలా చేసుకోవడానికి కారణం చెబుతూ, తనకే డబ్బులు లేవు, గ్రాండ్‌గా చేసుకునే పరిస్థితి లేదు. పైగా వాళ్లకి ఎందుకు అనవసరమైన ఖర్చు అని చెప్పి ఈ నిర్ణయం తీసుకున్నారట. భార్య లావణ్య అంటే తనకు గౌరవమని, తాను ఏమి లేని రోజుల్లోనే తనని నమ్మి చేసుకుందని, మరేఅమ్మాయి అలా చేయదు, అందుకే ఆమె అంటే ఇష్టమని తెలిపాడు పూరీ. గతంలో ఆయన చేసిన ఇంటర్వ్యూ ఇప్పుడు వైరల్‌ గా మారడం విశేషం. 
 

99

ఇక పవన్‌ కళ్యాణ్‌ `బద్రి` చిత్రంతో దర్శకుడిగా మారాడు పూరీ జగన్నాథ్‌. తొలి చిత్రంతో బ్లాక్‌ బస్టర్ అందుకున్నాడు. ఇక దర్శకుడిగా తిరుగులేదు. `ఇడియట్‌`,`అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి`, `శివమణి`, `పోకిరి`, `దేశముదురు`, `చిరుత`, `బిజినెస్‌ మ్యాన్‌`, `టెంపర్‌`, `ఇస్మార్ట్ శంకర్‌`, `లైగర్‌` చిత్రాలు చేశాడు. ఇప్పుడు `డబుల్‌ ఇస్మార్ట్` తో రాబోతున్నాడు. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories