అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) నటించిన మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్ట్ తండేల్ (Thandel)రిలీజ్ కు రంగం సిద్దమైంది. ఫిబ్రవరి 7న రిలీజ్ అయ్యే ఈ చిత్రం ప్రమోషన్స్ తో టీమ్ హోరెత్తిస్తోంది. చందూ మొండేటి డైరెక్ట్ చేస్తున్న ఈ రొమాంటిక్ డ్రామా పై మంచి అంచనాలే ఉన్నాయి.
సముద్రం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన తండేల్‌లో సాయిపల్లవి (Sai Pallavi) ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. ఈ చిత్రం తెలుగులో రెండు రాష్ట్రాల్లోనూ గీతా ఆర్ట్స్ కొన్ని ఏరియాల్లో స్వయంగా రిలీజ్ చేస్తూ, మరికొన్ని ఏరియాల్లో క్రేజీగా బిజినెస్ చేసారని తెలుస్తోంది. ఈ నేపధ్యంలో తెలుగు రెండు రాష్ట్రాల్లో ఈ చిత్రం టార్గెట్ ఎంత , ఎన్ని కోట్లు వస్తే సినిమా రికవరీ అయ్యినట్లు అనే విషయం ట్రేడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
23
Naga Cahitanya starrer Thandel film
మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు తండేలు చిత్రం ఆంధ్రా, తెలంగాణా రెండు రాష్ట్రాల్లోనూ కలిపి 40 కోట్లు వస్తే సేఫ్ గా బయిటపడినట్లు అని చెప్తున్నారు. చైతన్య గత చిత్రం కష్టడీ డిజాస్టర్ అయినా ఈ ఎమోషనల్ డ్రామాపై మంచి అంచనా లే ఉన్నాయి. అంతకు ముందు చైతు చేసిన ఎమోషనల్ డ్రామా మజిలి భాక్సాఫీస్ దగ్గర 34 కోట్లు దాకా కలెక్ట్ చేసింది. దాంతో ఈ సారి 40 కోట్లు వస్తే తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ వచ్చినట్లు అవుతుందని లెక్కలు వేస్తున్నారు. ఓపినింగ్స్, ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ పైనే ఈ సినిమా సక్సెస్ ఆధారపడి ఉంటుందనేది నిజం.
33
2018లో గుజరాత్ జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా వస్తోంది తండేల్. గీతాఆర్ట్స్‌పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. తండేల్ నాగచైతన్య-చందూ మొండేటి కాంబోలో రాబోతున్న మూడో సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.
సాయిపల్లవి నటన, డ్యాన్సులు యూనిక్ గా అలరిస్తాయని అభిమానులు భావిస్తున్నారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో GA2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 100 పర్సంట్ లవ్ తర్వాత బన్నివాసు- చైతన్య- దేవీశ్రీ కాంబినేషన్ చిత్రమిది. తండేల్ ఒక అందమైన ప్రేమకథా చిత్రమని, ఇందులో యాక్షన్ అంశాలకు కొదవేమీ ఉండదని చెబుతున్నారు.