నేను వన్‌ టైమ్ వండర్‌ని కాకూడదు.. ఉదయ్‌ కిరణ్‌ హీరో అవ్వడం వెనుక కథ ఇదే.. రేర్‌ ఇంటర్వ్యూ వైరల్‌

First Published Apr 11, 2024, 1:48 PM IST

ఉదయ్‌ కిరణ్‌ రేర్‌ ఇంటర్వ్యూ ఇప్పుడు ట్రెండ్‌ అవుతుంది. ఇందులో ఆయన తన ఆడిషన్‌ కష్టాలు,  తొలి సినిమా ఎంట్రీ, ఫేమ్‌, డౌన్‌ఫాల్‌, మ్యారేజ్‌ లైఫ్‌ గురించి పంచుకున్నారు. 
 

ఒకప్పటి టాలీవుడ్‌ లవర్‌ బాయ్‌ ఉదయ్ కిరణ్‌.. తెలుగు చిత్ర పరిశ్రమని ఓ ఊపు ఊపేశాడు. బ్యాక్‌ టూ బ్యాక్‌ మూడు, నాలుగు హిట్ సినిమాలతో సునామీలా దూసుకొచ్చాడు. లవర్‌ బాయ్‌గా యూత్‌లో విశేషమైన క్రేజ్‌ని సొంతం చేసుకున్నాడు. అమ్మాయిల డ్రీమ్‌ హీరోగా మారిపోయాడు. కానీ ఆ తర్వాత ఆయనకు వరుస పరాజయాలు వెంటాడటంతో కెరీర్‌ పరంగా డౌన్‌ అయ్యాడు. 
 

ఉదయ్‌ కిరణ్‌.. కెరీర్‌కి సంబంధించిన ప్రతిదీ ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అప్పట్లో పెద్దగా మీడియా లేకపోవడంతో ఆసక్తికర విషయాలు బయటకు వచ్చేవి కావు. ఆయన పర్సనల్‌ విషయాలు కూడా పెద్దగా తెలిసేవి కావు. ఏదైనా ప్రింట్‌ ఇంటర్వ్యూలు, వీడియో ఇంటర్వ్యూలే ఉండేవి. అవి కూడా తక్కువ. అలాంటి ఓ రేర్‌ ఇంటర్వ్యూ ఇప్పుడు యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతుంది. 
 

ఇందులో ఉదయ్‌ కిరణ్‌ తన హీరోగా ఎంట్రీ ఎలా జరిగింది, సక్సెస్‌ని ఎలా తీసుకున్నాడు, ఫ్యాన్స్ ఫాలోయింగ్‌, పెళ్లి, డౌన్‌ ఫాల్‌ వంటి అంశాలను వెల్లడించాడు. అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఇందులో హీరోగా మారడం గురించి చెబుతూ, తాను చిన్నప్పుడే హీరోగా అవ్వాలని డిసైడ్‌ అయ్యాడట. హీరో తప్ప మరో ఆలోచన తనకు లేదని చెప్పాడు ఉదయ్‌ కిరణ్. 

రామోజీ రావు నిర్మించిన `చిత్రం` సినిమా కోసం ఆడిషన్‌ జరుగుతుంది. అందుకోసం ప్రకటన చూసి ఆడిషన్‌కి వెళ్లాడట. అప్పటి వరకు తనకు దర్శకుడు తేజ ఎవరో తెలియదని తెలిపాడు. ఆయన కెమెరామెన్‌గా బాలీవుడ్‌లో బిజీగా ఉన్నాడు. `చిత్రం` సినిమాతోనే దర్శకుడిగా మారాడు. అయితే తాను ఆడిషన్‌కి వెళ్లినప్పుడు ఏకంగా 600 మంది కుర్రాళ్లు వచ్చారట. ఆర్పీపట్నాయక్‌ వంటి ఇద్దరు ముగ్గురు ప్రైమరీగా ఆడిషన్‌ చేశారట. ఇక్కడే చాలా మందిని ఫిల్టర్‌ చేశారట. 
 

అంత మందిలో తనని ఎంపిక చేశారని తెలిపాడు ఉదయ్‌ కిరణ్‌. ఊరికే డాన్స్ చేయమని అన్నారని, అలా మైఖేల్‌ జాక్సన్‌ డాన్స్ చేస్తే ఫిదా అయ్యారని తెలిపారు. అయితే తాను ఎక్కడా యాక్టింగ్‌, డాన్స్ నేర్చుకోలేదని, అంతా సొంతంగానే ప్రాక్టీస్‌ చేసేవాడిని అని తెలిపారు ఉదయ్‌ కిరణ్‌. అదే సినిమాలకు ఉపయోగపడిందన్నారు ఉదయ్‌ కిరణ్‌. 
 

`చిత్రం` సినిమా పెద్ద విజయం సాధించాక, నెక్ట్స్ ఎలాంటి సినిమా చేయాలనేది చాలా ఆలోచించాడట. వన్‌ మూవీ వండర్‌లా ఉండిపోకూడదని, చాలా జాగ్రత్తగా సెకండ్‌ మూవీ చేసినట్టు తెలిపారు ఉదయ్‌. రెండో సినిమాగా ఆయన `నువ్వు నేను` చేశాడు. మరో హిట్‌ కొట్టాడు. ఆ తర్వాత `మనసంతా నువ్వే`తో హ్యాట్రిక్‌ హిట్‌ అందుకున్నాడు. తిరుగులేని స్టార్‌ అయిపోయాడు. 
 

మరోవైపు పరాజయాల్లో ఫాలోయింగ్‌ తగ్గడంపై స్పందిస్తూ, అది కామనే అని తెలిపారు. ఫ్యాన్స్ ఎవరూ ప్లాన్‌ చేసుకుంటే వచ్చింది కాదు, సక్సెస్‌ లేనప్పుడు ఆ క్రేజ్‌ తగ్గిపోవడం కామనే. చాలా గ్యాప్‌ రావడంతో ఫ్యాన్స్ ఫాలోయింగ్‌ తగ్గిందన్నారు. `జై శ్రీరామ్‌` మూవీ రిలీజ్‌ టైమ్‌లో ఆయన ఈ ఇంటర్వ్యూ ఇచ్చారు. `V6 తీన్మార్‌`తో ఆయన ముచ్చటించాడు. ఈ మూవీతో తాను కమ్‌ బ్యాక్‌ అవుతాననే ఆశాభావం వ్యక్తం చేశాడు ఉదయ్‌ కిరణ్‌.
 

ఇక మ్యారేజ్‌ లైఫ్‌ గురించి చెబుతూ, చాలా హ్యాపీగా ఉందన్నారు. చాలా రిలాక్స్ అవుతున్నట్టు తెలిపాడు. గతంలో తన సినిమా అంటే టెన్షన్‌తో ఉండేవాడిని అని, ఇప్పుడు చిల్‌ అవుతున్నట్టు తెలిపాడు. అందుకు కారణం తన భార్యనే అని, ఆమె చాలా సపోర్ట్ చేస్తుందని, బ్యాక్‌ బోన్‌లా ఉంటుందన్నారు. ఇప్పుడు సినిమా రిలీజ్‌ అంటే ఎలాంటి టెన్షన్‌ లేదని, సినిమాపై నమ్మకం కూడా ఓ కారణమన్నారు. ప్రస్తుతం ఉదయ్‌ కిరణ్‌ ఈ రేర్‌ ఇంటర్వ్యూ ట్రెండ్‌ అవుతుంది. 
 

`జై శ్రీరామ్‌` ఉదయ్‌ కిరణ్‌ చేసిన చివరి సినిమా. ఈ మూవీ కూడా పెద్దగా ఆడలేదు. దీంతోనే ఆయన డిప్రెషన్‌లోకి వెళ్లినట్టు తెలుస్తుంది. ఆ తర్వాత `చిత్రం చెప్పిన కథ` అనే సినిమాని రిలీజ్‌ చేశాడు. కానీ అది రిలీజ్‌ కాలేదు. ఆర్థిక ఇబ్బందులు, పరాజయాలు వంటి ఇబ్బందులతో డిప్రెషన్‌లోకి వెళ్లిన ఉదయ్‌ కిరణ్‌ ఆత్మహత్యకు పాల్పడినట్టు సమాచారం. ఆయన 2014లో జనవరి 5న సూసైడ్‌ చేసుకున్న విషయం తెలిసిందే. 
 

click me!