జర్నలిస్ట్ తో ఉదయ్‌ కిరణ్‌ లవ్‌ బ్రేకప్‌.. ఆమె కోసం పిచ్చోడైపోయిన లవర్‌ బాయ్‌.. ఫస్ట్ లవ్‌ స్టోరీ!

Published : Apr 08, 2024, 12:47 PM IST

ఉదయ్‌ కిరణ్‌ లవ్‌ స్టోరీకి సంబంధించి ఇప్పటి వరకు వినిపించిన స్టోరీస్‌ వేరు. ఇప్పుడు అసలు కథ బయటకు వచ్చింది. ఆయన ఫస్ట్ లవ్‌ స్టోరీని అక్క శ్రీదేవి బయటపెట్టింది.   

PREV
17
జర్నలిస్ట్ తో  ఉదయ్‌ కిరణ్‌ లవ్‌ బ్రేకప్‌.. ఆమె కోసం పిచ్చోడైపోయిన లవర్‌ బాయ్‌.. ఫస్ట్ లవ్‌ స్టోరీ!

ఒకప్పటి లవర్‌ బాయ్‌ ఉదయ్‌ కిరణ్‌ ఉప్పెనలా అంతెత్తుకు ఎగిసి అంతలోనే పడిపోయి, అనతి కాలంలోనే మనకు దూరమైపోయాడు. తెలుగు ఆడియెన్స్ హార్ట్ బ్రేక్‌ చేసి వెళ్లిపోయాడు. ఆ హార్ట్ బ్రేక్‌ మనకే కాదు, ఆయనకు కూడా ఉంది. అది ప్రేమలోనే హార్ట్ బ్రేక్‌ ఉండటం గమనార్హం. బయటకు తెలిసిన లవ్‌ స్టోరీలు వేరు, తెలియని ప్రేమ కథ వేరు. ఆ విషయాన్ని ఉదయ్‌ కిరణ్‌ అక్క శ్రీదేవి తెలిపారు. 
 

27

ఉదయ్‌ కిరణ్‌.. కెరీర్‌ పీక్‌లో ఉన్నప్పుడు తన కూతురు సుస్మితని ఇచ్చి పెళ్లి చేసేందుకు మెగాస్టార్‌ చిరంజీవి సిద్దమయ్యారు. ఏకంగా ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నారు. కానీ అంతలోనే క్యాన్సిల్‌ చేసుకున్నారు. దీనికి చాలా కారణాలు వైరల్‌ అవుతున్నాయి. అంతకు ముందు హీరోయిన్‌ అనితతోనూ ఉదయ్‌ కిరణ్‌ ప్రేమలో ఉన్నారనే ప్రచారం జరిగింది. కానీ ఉదయ్‌ కిరణ్‌ అక్క శ్రీదేవి ఓ షాకింగ్‌ లవ్‌ స్టోరీ చెప్పింది. 
 

37

ఇవన్నీ జరగడానికి ముందే ఉదయ్‌ కిరణ్‌ ఓ అమ్మాయిని ప్రేమించాడట. తాను స్టార్‌గా ఎదుగుతున్న సమయంలో ఓ లేడీ జర్నలిస్ట్ తో ప్రేమలో పడ్డాడట ఉదయ్‌ కిరణ్‌. ఆయన్ని ఇంటర్వ్యూ చేసిన అనంతరం ఇద్దరి మధ్య పరిచయం పెరిగిందని, అది ఘాటు ప్రేమ వరకు వెళ్లిందని తెలిపింది అక్క శ్రీదేవి. అయితే ఇద్దరి మధ్య మనస్పర్థాలు వచ్చాయని, ఆ తర్వాత ఆ ఆమె ఉదయ్‌ కిరణ్‌ని వదిలేసిందట. ఆమె బ్రేకప్‌ చెప్పడంతో బాగా కుంగిపోయాడట ఉదయ్‌ కిరణ్‌. 

47

ఆ లేడీ జర్నలిస్ట్ ని ఉదయ్‌ కిరణ్‌ చాలా సిన్సియర్‌గా ప్రేమించాడట. కానీ ఆమె హ్యాండివ్వడంతో తట్టుకోలేకపోయాడట, చాలా రోజులు ఆమె వెంటపడ్డాడట. ప్రేమ కోసం ఎంతో తపించాడట. కానీ ఆమె అంగీకరించలేదు. నో చెప్పేసింది. దీంతో చాలా రోజులు పిచ్చోడైపోయాడట ఉదయ్‌ కిరణ్‌. అది వ్యక్తిగతంగా ఆయన కెరీర్‌ డౌన్‌ అయిపోయిందని, కొన్నాళ్లపాటు ఆ బాధలోనే ఉండిపోయాడని తెలిపింది. 
 

57

ఆ సమయంలోనే ఈ విషయాన్ని చిరంజీవికి చెప్పాడట ఉదయ్‌ కిరణ్. ఉదయ్‌ అంటే తన అభిమానాన్ని చూపించారు చిరంజీవి. ఆదరించాడు. దీంతో ఇద్దరి మధ్య మంచి చనువు ఏర్పడింది.ఆ చనువుతోనే అన్ని విషయాలు చిరంజీవితో చెప్పుకునేవాడట. అలా చాలా సార్లు మెగాస్టార్‌ ముందు ఏడ్చినట్టు తెలిపింది ఉదయ్‌ కిరణ్‌ అక్క శ్రీదేవి. ఈ క్రమంలో అతన్ని ఆ బాధ నుంచి తప్పించేందుకు చిరంజీవి ఎంతో ఓదార్చాడట. కెరీర్‌పై ఫోకస్‌ పెట్టాలని, మంచి కెరీర్‌ ఉందని, ఇన్‌స్పైరింగ్‌ వర్డ్స్ చెప్పారట. 
 

67

ఆ సమయంలోనే చిరంజీవి ఇలా తన కూతురు సుస్మిత పెళ్లి మ్యాటర్‌ తెలిపారట. ఉదయ్‌ కూడా కన్విన్స్ అయి పెళ్లికి ఒప్పుకున్నారట. వీరికి ఎంగేజ్‌మెంట్‌ కూడా జరిగింది. కానీ ఆ తర్వాత క్యాన్సిల్‌ చేసుకున్నారు. దీనికి కారణాలు చాలా వినిపిస్తాయి. ఉదయ్‌ కిరణ్‌ నో చెప్పడం వల్ల చిరంజీవికి కోపం వచ్చిందని, దీంతో అవకాశాలు రాకుండా చేశాడనే ప్రచారం ఉంది.నిజమేంటనేది తెలియాల్సి ఉంది. 
 

77

ఆ తర్వాత ఉదయ్‌ కిరణ్‌.. సాఫ్ట్ వేర్‌ అమ్మాయిని 2012లో మ్యారేజ్‌ చేసుకున్నారు. రెండేళ్లకే ఆయన ఆత్మహత్య  చేసుకున్న విషయం తెలిసిందే. అవకాశాలు తగ్గిపోవడం, ఆర్థిక ఇబ్బందులు, సక్సెస్‌ లేకపోవడం వంటి కారణాలతో ఆయన ఆత్మహత్య చేసుకున్నారని అంటున్నారు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories