అతిలోక సుందరి రేర్‌ వీడియో వైరల్.. చెల్లి మహేశ్వరికి మతిపోగొట్టిన శ్రీదేవి.. ఇది మామూలు కామెడీ కాదు..

Published : Apr 08, 2024, 11:59 AM IST

అతిలోక సుందరి శ్రీదేవి రేర్‌ వీడియో ఒకటి ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది. ఇందులో చెల్లి మహేశ్వరితో కలిసి ఆమె చేసిన పని రచ్చ రచ్చ అవుతుంది.   

PREV
18
అతిలోక సుందరి రేర్‌ వీడియో వైరల్.. చెల్లి మహేశ్వరికి మతిపోగొట్టిన శ్రీదేవి.. ఇది మామూలు కామెడీ కాదు..

 అతిలోక సుందరి శ్రీదేవి ఎన్నో అద్బుతమైన పాత్రలతో మనల్ని అలరిస్తూనే ఉంది. అతిలోక సుందరిగా మెప్పిస్తుంది. అద్భుతమైన నటన, అందం కలబోతలా ఆమె కళ్లల్లో మెదులుంది. తన పాత్రలతో మన మధ్యే ఉన్నట్టుగా ఉంటుంది. శ్రీదేవి మరణించి ఆరేళ్లు అవుతున్నా, ఆమె మనతోనే ఉన్నట్టు అనిపిస్తుంది ఆమె సినిమాలు చూస్తుంటే.  

28

అయితే శ్రీదేవి విలక్షణ నటి. గ్లామర్‌ పాత్రలే కాదు, యాక్షన్‌ మూవీస్‌ కూడా చేసింది. కొన్ని నెగటివ్‌ షేడ్‌ ఉన్న పాత్రల్లోనూ మెరిసింది. అదే సమయంలో కామెడీ చేయడంలోనూ దిట్ట. ఆమె ఇన్నోసెంట్‌ లుక్‌ మతిపోయేలా ఉంటుంది. ఆమె కామెడీ చేస్తే నవ్వులే నవ్వులు అని చెప్పొచ్చు. తాజాగా అలాంటి ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. 
 

38

శ్రీదేవి కనిపించిన ఓ రేర్‌ వీడియో ఇప్పుడు యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతుంది. ఇందులో తన చెల్లి, హీరోయిన్‌ మహేశ్వరితో కలిసి ఓ వీడియో చేసింది. మహేశ్వరీ ఓ టీవీ సీరియల్‌లో నటిస్తుంది. ఆ టీవీ సీరియల్‌ గురించి శ్రీదేవి వీడియో బైట్‌ ఇస్తుంది. దాన్ని చూడాలని, అది ఎలాంటి సీరియలో చెప్పే ప్రయత్నం చేస్తుంది. 

48

అయితే ముందు మహేశ్వరికి శ్రీదేవికి అన్ని వివరాలు చెప్పి కెమెరా ముందు కూర్చున్నారు. ప్రారంభం నుంచి  అన్నీ తప్పులు తప్పులే చెబుతుంది శ్రీదేవి. పక్కన ఉన్న మహేశ్వరి సరి చేస్తూనే ఉంది. ఏం చెప్పినా, రాంగ్‌గానే వాడుతుంది. ఒకటి చెప్పబోయి మరోటి చెబుతుంది. దీంతో పక్కన చెల్లికి చిరాకు అనిపిస్తుంది. అక్క అలా కాదు అక్క అంటూ సరిచేస్తూనే ఉన్నా అవే మిస్టేక్స్. దీంతో ఈ వీడియో మొత్తం కామెడీగా మారింది. 
 

58

మొత్తానికి కామెడీ సీరియల్‌లో మహేశ్వరీ నటిస్తుందని చెప్పింది. దాని పేరు `మై నేమ్‌ ఈజ్‌ మంగమ్మ` కావడం విశేషం. ఇది దాదాపు 11ఏళ్ల క్రితం నాటి వీడియో. ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఫ్యాన్స్ దీన్ని తెగ చూస్తున్నారు. అందుకే ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఓవరాల్‌గా ఈ అరుదైన వీడియోలో శ్రీదేవి కామెడీ నెక్ట్స్ లెవల్‌ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 
 

68

శ్రీదేవి ఎన్నో తెలుగు సినిమాల్లో నటించి మెప్పించింది. ఎన్టీఆర్‌ నుంచి చిరంజీవి వరకు నటించింది. వెంకటేష్‌, నాగార్జునలతో కూడా సినిమాలు చేసింది. ఎక్కువగా ఎన్టీఆర్‌, కృష్ణతో సినిమాలు చేయడం విశేషం. ఆమె 2018లో దుబాయ్‌లోని ఓ హోటల్‌ లో కాలు జారి టబ్‌లో పడి కన్నుమూసిన విషయం తెలిసిందే. 
 

78

శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ హిందీలో హీరోయిన్‌గా అలరిస్తుంది. తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె ఎన్టీఆర్‌తో `దేవర` చిత్రంలో నటిస్తుంది. రామ్‌ చరణ్‌తో బుచ్చిబాబు సినిమాలో నటించబోతుంది. 

88

శ్రీదేవి కజిన్‌ సిస్టర్ అయిన మహేశ్వరి `గులాబీ` చిత్రంతో తెలుగులో గుర్తింపు తెచ్చుకుంది. `దెయ్యం`, `మృగం`, `పెళ్లి`, `మా బాలాజీ`, `నీ కోసం`, `మా అన్నయ్య`, `తిరుమల తిరుపతి వెంకటేశా` చిత్రాల్లో నటించి మెప్పించింది.  2000 నుంచి ఆమె సినిమాలకు దూరమయ్యింది. ఇటీవల మళ్లీ రీఎంట్రీ ప్లాన్‌ చేస్తుంది. అందులో భాగంగా `శ్రీదేవీ డ్రామా కంపెనీ`, `స్టార్ట్ మ్యూజిక్‌`, జబర్దస్త్ వంటి షోస్‌లో మెరిసింది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories