జక్కన్నకి నో చెప్పడమే ఉదయ్‌ కిరణ్‌ కొంప ముంచిందా?.. లవర్‌ బాయ్‌ చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ అదే అంటూ రచ్చ?

Published : Jun 26, 2022, 08:41 PM IST

ఉదయ్‌ కిరణ్‌ కోట్లాది తెలుగు ఆడియెన్స్ హృదయాల్లో నిలిచిపోయిన స్టార్‌. తిరుగులేని ఫాలోయింగ్‌తో ఆకాశంలో తారలా ఎదిగిన ఆయన జీవితం విషాదంతంగా ముగియడానికి ఉదయ్‌ కిరణ్‌ చేసిన మిస్టేక్ ఇప్పుడు చర్చనీయాంశమవుతుంది. 

PREV
17
జక్కన్నకి నో చెప్పడమే ఉదయ్‌ కిరణ్‌ కొంప ముంచిందా?.. లవర్‌ బాయ్‌ చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ అదే అంటూ రచ్చ?

టాలీవుడ్‌ మోస్ట్ లవర్‌ బాయ్‌ ఇమేజ్‌ సొంతం చేసుకున్న హీరో ఉదయ్‌ కిరణ్‌(Uday Kiran). వరుసగా ఆయన రొమాంటిక్‌ లవ్‌ స్టోరీ సినిమాలు చేసి లవర్‌ బాయ్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు. దీంతో అమ్మాయిల ఫాలోయింగ్‌ని ఏర్పర్చుకున్నారు. ఉదయ్‌ కిరణ్‌కి ఆ టైమ్‌లో ఊహించని లేడీ ఫాలోయింగ్‌ ఏర్పడిందంటే అతిశయోక్తి కాదు. టాలీవుడ్‌లోనూ సర్వత్రా దీనిపై చర్చ జరిగింది. 

27

ప్రభాస్‌, పవన్‌, మహేష్‌, నితిన్‌లకు తొలుత ఫాలోయింగ్‌ ఏర్పడినట్టుగా ఉదయ్‌ కిరణ్‌కి ఆ రేంజ్‌ క్రేజ్‌ వచ్చింది. ఆ టైమ్‌లో ఎన్టీఆర్‌, బన్నీ లాంటి హీరోలను మించిన ఇమేజ్‌ ఆయన సొంతం కావడం విశేషం. ఇతర స్టార్‌ హీరోల సినిమాల ఈవెంట్లకి కూడా గెస్ట్ గా వెళ్లారు ఉదయ్‌ కిరణ్‌. కానీ ఆయన చేసిన పెద్ద మిస్టేక్‌ ఆయన్ని తదుపరి వెంటాడింది. ఆయన మనుగడనే ప్రశ్నార్థకంగా మార్చేసింది. 
 

37

సినిమాల ఎంపికలో ఉదయ్‌ కిరణ్‌ చేసిన పెద్ద మిస్టేక్స్ ఇప్పుడు చర్చనీయాంశమవుతుంది. వరుసగా లవ్‌ స్టోరీస్‌ చేయడమే ఆయన కెరీర్‌ని ముంచిందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఆ టైమ్‌లోనూ ఇదే చర్చ నడిచింది. ఆయన ఒకటి రెండు చిత్రాలు తప్పా అన్నీ లవ్‌ స్టోరీలే చేశారు. దీంతో ఉదయ్‌ కిరణ్‌ ఆడియెన్స్ కి లవర్‌ బాయ్‌గా చూసి బోర్‌ కొట్టేసిందనే అభిప్రాయం వ్యక్తమయ్యింది. 
 

47

ఉదయ్‌ కిరణ్‌ మాస్‌ సినిమాలు చేయకపోవడమే ఆయన కొంప ముంచిందంటున్నారు. ఇప్పటి వరకు స్టార్లుగా రాణిస్తున్న ఏ హీరో అయితే ఒకటి రెండు లవ్‌ స్టోరీలు చేసి, ఆ వెంటనే మాస్‌, యాక్షన్‌సినిమాలవైపు మొగ్గుచూపారు. లవ్‌ స్టోరీలకు ఫుల్‌స్టాప్‌ పెట్టేశారు. కానీ ఆ చిన్న లాజిక్‌ మిస్‌ అయిన ఉదయ్‌ కిరణ్‌.. వరుసగా ప్రేమ కథా చిత్రాలు చేసి ఆడియెన్స్ చేత బోర్‌ కొట్టించుకున్నారనే అభిప్రాయం క్రిటిక్స్ నుంచి వ్యక్తమవుతుంది. ఇటీవల యంగ్‌ హీరో త్రిగుణ్‌(అరుణ్‌ అదిత్‌) కూడా ఇదే విషయాన్ని చెప్పారు. ఉదయ్‌ కిరణ్‌, తరుణ్‌లు చేసిన తప్పు తాను చేయదలచుకోలేదని తెలిపారు. ఇదే ఇప్పుడు ఉదయ్‌ని అభిమానులను వెంటాడుతున్న బాధ. 
 

57

హీరోకి లాంగ్‌ రన్‌ ఉండాలంటే, చిత్ర పరిశ్రమలో స్టార్‌ ఇమేజ్‌ని నిలబెట్టుకోవాలంటే, సూపర్‌ స్టార్‌గా ఎదగాలంటే, పరిశ్రమలో మనుగడ సాధించాలంటే ఫ్యామిలీ చిత్రాలు, మాస్‌ సినిమాలు కూడా చేయాలనేది ఇప్పుడు రాణిస్తున్న అందరు స్టార్ల విషయంలో నిరూపితమైంది. ఆ విషయం తెలుసుకునే ముందస్తుగానే అందరు ఇప్పుడు సెటిల్‌ అయ్యారు. పాన్‌ ఇండియా హీరోగాలుగా రాస్తున్నారు. కానీ ఉదయ్‌ కిరణ్‌ ఆ విషయంలో పెద్ద మిస్టేక్‌ చేశారు. చివర్లో `జై శ్రీరామ్‌`తో ఆ ప్రయత్నం చేసినా, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. 

67

మరోవైపు ఉదయ్‌ కిరణ్‌.. దర్శక ధీరుడు రాజమౌళి సినిమాని కూడా రిజెక్ట్ చేసినట్టు వార్తలొచ్చిన విసయం తెలిసిందే. `సై` సినిమాని ఉదయ్‌తోనే చేయాలనుకున్నారట జక్కన్న. కానీ ఆయన నో చెప్పడంతో నితిన్‌తో చేశాడట. ఆ సినిమా నితిన్‌ని స్టార్‌ని చేసిన విషయం తెలిసిందే. ఆ ఛాన్స్ మిస్‌ చేసుకోవడమే ఆయన కొంప ముంచిందంటున్నారు. ఒకవేళ ఆ సినిమా చేసి ఉంటే ఇప్పుడు స్టార్లలో ఒకరిగా ఉండేవాడని అంటున్నారు. 

77

ఓ వైపు లవ్‌ స్టోరీ చిత్రాలు పరాజయాలు చెందడం, సినిమా అవకాశాలు తగ్గడం, మరోవైపు చిరంజీవి కూతురు సుస్మితతో ఎంగేజ్‌మెంట్‌ క్యాన్సిల్‌ కావడం వంటివన్నీ ఉదయ్‌ కిరణ్‌ కెరీర్‌ని ప్రభావితం చేశాయి. డిప్రెషన్‌లోకి వెళ్లిన ఆయన ఆత్మహత్యకి పాల్పడిన విషయం మనకు తెలిసిందే. నేడు(జూన్‌ 26) ఉదయ్‌ కిరణ్‌ సందర్భంగా ఆయన అభిమానులు నెటిజన్లు ఈ విషయాలను గుర్తు చేస్తూ వైరల్‌ చేస్తున్నారు. ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు.
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories