తల్లి రోజా రమణి వల్లే తరుణ్‌ కెరీర్‌ డౌన్‌ అయ్యిందా? లవర్‌ బాయ్‌ రియాక్షన్‌ ఏంటో తెలుసా?

Published : Mar 05, 2025, 04:48 PM ISTUpdated : Mar 05, 2025, 06:01 PM IST

Tarun : లవర్‌ బాయ్‌ తరుణ్‌ హీరోగా కెరీర్‌ డౌన్‌ కావడానికి కారణం ఎవరు? ఆమె తల్లి ప్రమేయం ఏంటి? షాకిచ్చే రూమర్లకి తరుణ్‌ క్లారిటీ క్లారటీ ఏదే. 

PREV
16
తల్లి రోజా రమణి వల్లే తరుణ్‌ కెరీర్‌ డౌన్‌ అయ్యిందా? లవర్‌ బాయ్‌ రియాక్షన్‌ ఏంటో తెలుసా?
Tarun

Tarun: టాలీవుడ్‌లో లవర్‌ బాయ్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకున్న తరుణ్‌ ఇండస్ట్రీలో ఉవ్వెత్తున ఎగిసిపడ్డ కెరటంలా మారిపోయారు. ఇప్పుడు సినిమాలకే దూరంగా ఉన్నారు.

మరి తరుణ్‌ కెరీర్‌ డౌన్‌ కావడానికి కారణం ఎవరు? తన సొంత తల్లినే కారణమా? తరుణ్‌ పై అనేక రూమర్లు ఉన్న నేపథ్యంలో ఆయన తరుణ్‌ స్పందించారు. దీనిపై ఆయన క్లారిటీ ఇచ్చారు. 
 

26
Tarun

హీరో తరుణ్‌ లవర్‌ బాయ్‌ ఇమేజ్‌తో రాణించారు. వరుస విజయాలు అందుకుని స్టార్‌గా ఎదిగారు. కానీ ఆ తర్వాత సడెన్‌గా ఆయన డౌన్‌ అయ్యారు. బాలనటుడిగానే జాతీయ అవార్డు అందుకున్న తరుణ్‌ ఒకప్పటి హీరోయిన్‌ రోజా రమణి కొడుకు అనే విషయం తెలిసిందే.

ఆమె కారణంగానే బాలనటుడిగా పరిచయం మంచి పేరు తెచ్చుకుని, ఆ తర్వాత `నువ్వే కావాలి` సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు. తొలి చిత్రంతోనే విజయాన్ని అందుకున్నారు. 
 

36
Tarun

ఆ తర్వాత వరుస లవ్‌ స్టోరీస్‌ చేశారు. యూత్‌ని బాగా ఆకట్టుకున్నారు. `నువ్వే కావాలి`. `ప్రియమైన నీకు`, `చిరుజల్లు`, `నువ్వు లేక నేను లేను`, `నువ్వే నువ్వే`, `నిన్నే ఇష్టపడ్డాను`, `నీ మనసు నాకు తెలుసు` ఇలా వరుసగా ప్రేమ కథా చిత్రాలు చేసి విజయాలు అందుకుని లవర్‌ బాయ్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు.

చూడ్డానికి కూడా తరుణ్‌ లవర్‌ బాయ్‌లాగే ఉంటాడు. దీంతో లవ్‌ స్టోరీస్‌ తప్ప, ఆయనకు మరో జోనర్‌ సెట్‌ కాలేదు. లవ్‌ స్టోరీర్‌ రెగ్యూలర్‌ అయిపోయాయి. దీంతో ఆయనకు సక్సెస్‌ రాలేదు. వరుస పరాజయాల నేపథ్యంలో తరుణ్‌ సినిమాలే చేయడం మానేశారు. 
 

46
Tarun

మరి తరుణ్‌ కెరీర్‌ డౌన్‌ కావడానికి, ఆయన సినిమాలు మానేయడానికి కారణం ఏంటనేది ఆసక్తికరంగా మారింది. అంతా లవ్‌ ఫెయిల్యూర్‌ వల్లే అంటుంటారు. ఆర్తి అగర్వాల్‌తో ఆయన లవ్‌ స్టోరీ నడిపించిన విషయం తెలిసిందే. కానీ అది సెట్‌ కాలేదు. బ్రేకప్‌ చెప్పుకున్నారు.

దీంతో డిప్రెషన్‌లోకి వెళ్లిన తరుణ్‌ సరైన స్క్రిప్ట్స్ ఒప్పుకోలేకపోయాడని, వరుసగా పరాజయాలు వచ్చాయని, అందువల్లే ఆయన కెరీర్‌ డౌన్‌ అయ్యిందని అంటుంటారు. దీనికితోడు తన తల్లి రోజా రమణినే కారణం అని, ఆమెనే సినిమాలను ఎంపిక చేసేదని, ఆమె చెప్పిందే తరుణ్‌ చేసేవాడని, ప్రేమ విషయంలోనూ అడ్డుపడిందని అంటుంటారు. కారణం తల్లి అనే పుకార్లు ఉన్నాయి. 
 

56
roja ramani

ఈ నేపథ్యంలో దీనిపై తరుణ్‌ స్పందించారు. తాను ఫెయిల్యూర్‌ కావడానికి, సినిమాలు ఆడకపోవడానికి ఆమెకి సంబంధం లేదని తెలిపారు. అయితే స్క్రిప్ట్ ఇంట్లో కాజ్వల్‌గా డిస్కస్‌ చేస్తామని, కానీ ఫైనల్‌ కాల్‌ తనదే ఉంటుందని తెలిపారు. అమ్మనే సెలక్షన్‌ చేస్తుందనేది నిజం కాదని చెప్పారు. తనకు నచ్చితేనే ఓకే చేస్తున్నట్టు తెలిపారు.

గతంలో `సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఆ విషయం తెలిపారు. తాను ఎవరితోనూ ప్రేమలో పడలేదని, ఫ్రెండ్‌షిప్‌ ఉందని, కొందరితో అది ఎక్కువగా ఉంటుందని, కలిసి బయటకు వెళ్లామని, కలిసేవాళ్లమే తప్ప, అది ప్రేమ కాదని, పెళ్లి వరకు వెళ్లే ప్రేమ కాదని తెలిపారు తరుణ్‌. 
 

66
Tarun

తరుణ్‌ వెండితెరపై మెరిసి పదేళ్లకుపైగానే అవుతుంది. మధ్యలో ఓ చిన్న చిత్రంతో కనిపించాడు. కానీ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. ఇప్పుడు మళ్లీ రీఎంట్రీకి ప్లాన్‌ చేస్తున్నారట.

ఆ మధ్యలో ఓ యూట్యూబ్‌తో మాట్లాడుతూ ప్రస్తుతం సినిమాలకు సంబంధించిన వర్క్ జరుగుతుందని, త్వరలో రీఎంట్రీ ఇవ్వబోతున్నట్టు ఆ మధ్య తెలిపారు. రెండు సినిమాలు, ఓ వెబ్‌ సిరీస్‌కి సంబంధించిన వర్క్ జరుగుతుందన్నారు. మరి ఆయన రీఎంట్రీ ఎప్పుడు ఉంటుందనేది సస్పెన్స్ గా మారింది. 

read  more: రామ్‌ చరణ్‌లో అది చూసి కుళ్లుకున్న చిరంజీవి హీరోయిన్లు.. షూటింగ్‌ సెట్‌కి వెళితే ఏం చేశారో తెలుసా?

also read: సింగర్‌ కల్పన సూసైడ్‌ అటెంప్ట్ లో బిగ్‌ ట్విస్ట్.. అసలు నిజాలు బయటపెట్టిన సింగర్‌ కూతురు

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories