మహేష్‌, రవితేజ సినిమాలకు గెస్ట్ గా ఉదయ్‌ కిరణ్‌.. ప్రభాస్‌, ఎన్టీఆర్‌లను మించి.. క్రేజ్‌ అంటే అది కదా!

First Published | Jun 27, 2021, 6:42 PM IST

`లవర్‌ బాయ్‌` ఇమేజ్‌తో హ్యాట్రిక్‌ హిట్స్ తో టాలీవుడ్‌లో క్రేజీ స్టార్ గా రాణించారు ఉదయ్‌ కిరణ్‌. సూపర్‌ స్టార్ మహేష్‌, మాస్‌ మహారాజా రవితేజ సినిమాలకు ప్రభాస్‌, ఎన్టీఆర్‌లతో కలిసి గెస్ట్ గా పాల్గొనడం అరుదైన విషయం. 

ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్‌ లేకుండా సొంతంగా ఎదిగి టాలీవుడ్‌ని కొన్నాళ్లు పాటు షేక్‌ చేసిన నటుడు ఉదయ్‌ కిరణ్‌. నిజం చెప్పాలంటే ప్రేమ కథల్లో ఉదయ్‌ కిరణ్‌ ఓ ట్రెండ్‌ సెట్టర్‌. ఉవ్వెత్తున ఎగిసే కెరటంలా లేసి, పడిపోయిన కనుమరుగై పోయిన ఉదయ్‌ కిరణ్‌ కెరీర్‌లో ఎన్నో విశేషాలున్నాయి.
వరుసగా ఆయన మూడు బ్లాక్‌బస్టర్స్ తో హ్యాట్రిక్‌ హిట్‌ కొడితే, ఆరు హిట్లతో రికార్డు సృష్టించారు. ఇది కేవలం మూడేళ్ల టైమ్ పీరియడ్‌లోనే కావడం విశేషం. `చిత్రం`, `నువ్వు నేను`, `మనసంతా నువ్వే`, `నీ స్నేహం`, `కలుసుకోవాలని`, `నీకు నేను నాకు నువ్వు` చిత్రాలతో తానేంటో నిరూపించుకుని టాలీవుడ్‌లో లవర్‌ బాయ్‌గా నిలిచారు. భారీ స్టార్ ఇమేజ్‌ని, క్రేజ్‌ని సొంతం చేసుకున్నాడు ఉదయ్‌ కిరణ్‌.

ఆ క్రేజ్‌ ఎంతగా అంటే స్టార్‌ హీరోలైన మహేష్‌బాబు, రవితేజ సినిమాల ఆడియో ఫంక్షన్లకి గెస్ట్ లుగా హాజరయ్యేంతగా. అవును ప్రభాస్‌, ఎన్టీఆర్‌లను మించిన క్రేజ్‌తో ఆయన గెస్ట్ గా హాజరు కావడం విశేషం.
మహేష్‌బాబు నటించిన `నాని` చిత్రం ఆడియో ఫంక్షన్‌లో ఉదయ్‌ కిరణ్‌ గెస్ట్ గా పాల్గొన్నాడు. ప్రభాస్‌, ప్రభుదేవా, సుమంత్‌ వంటి స్టార్స్ తో కలిసి ఆయన స్టేజ్‌ని పంచుకున్నాడు.
ప్రభాస్‌తో ఉదయ్‌ కిరణ్‌ ముచ్చట్లు.
అలాగే మరో సందర్భంలోనూ కూడా మహేష్‌తో వేదికని పంచుకున్నాడు ఉదయ్‌ కిరణ్‌. ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య చిరునవ్వులు అభిమానులను ఎంతగానే ఆకట్టుకున్నాయి.
అంతేకాదు మరో సందర్భంగా కోటా శ్రీనివాసరావు, ప్రభాస్‌లతో కలిసి స్టేజ్‌ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఉదయ్‌ కిరణ్‌ వేసిన పంచ్‌కి పగలబడి నవ్వారు ప్రభాస్‌.
మరోవైపు రవితేజ నటించిన `దొంగోడు` సినిమా ఆడియో ఫంక్షన్‌లోనూ పాల్గొన్నాడు ఉదయ్‌ కిరణ్‌. ఇందులో ఎన్టీఆర్‌తో కలిసి గెస్ట్ గా హాజరు కావడం విశేషం.
ఉదయ్‌ కిరణ్‌ 1980 జూన్ 26న జన్మించారు. శనివారం ఆయన 41వ జయంతి. ఈ సందర్బంగా అభిమానులు ఆయన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

Latest Videos

click me!