టాలీవుడ్ లో తొలి మూడు చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలు అందుకున్న హీరోలు కొద్దిమంది మాత్రమే ఉన్నారు. అల్లు అర్జున్, ఉదయ్ కిరణ్ తో పాటు మరికొందరికి మాత్రమే ఆ ఘనత సాధ్యం అయింది.
టాలీవుడ్ లో అప్పుడప్పుడూ కొందరు హీరోలు హ్యాట్రిక్ విజయాలు సాధించారని అంటుంటారు. హ్యాట్రిక్ విజయాలు కెరీర్ కి మంచి జోష్ ఇస్తాయి అని చెప్పడంలో సందేహం అవసరం లేదు. ఆ హ్యాట్రిక్ హిట్స్ తొలి సినిమా నుంచే దక్కితే ఆ కిక్కు మరింత ఎక్కువగా ఉంటుంది. టాలీవుడ్ లో తొలి మూడు చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలు అందుకున్న హీరోలు కొద్దిమంది మాత్రమే ఉన్నారు. అల్లు అర్జున్, ఉదయ్ కిరణ్ తో పాటు మరికొందరికి మాత్రమే ఆ ఘనత సాధ్యం అయింది.
27
అల్లు అర్జున్ : గంగోత్రి చిత్రంలో అల్లు అర్జున్ హీరోగా ఎంట్రీ ఇచ్చారు. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కిన గంగోత్రి మ్యూజికల్ సూపర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఆర్య ట్రెండ్ సెట్ చేసింది. ఆ తర్వాత వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన గంగోత్రి చిత్రం మాస్ హిట్ గా నిలిచింది. ఇలా అల్లు అర్జున్ తొలి మూడు చిత్రాలతో సూపర్ హిట్స్ కొట్టి కెరీర్ ని ఘనంగా ప్రారంభించాడు.
37
రాజ్ తరుణ్ : ఉయ్యాలా జంపాల చిత్రంతో సింపుల్ గా హీరో అయిన రాజ్ తరుణ్ కూడా హ్యాట్రిక్ హిట్స్ కొట్టాడు. ఉయ్యాలా జంపాల, సినిమా చూపిస్త మావ, కుమారి 21 ఎఫ్ చిత్రాలతో రాజ్ తరుణ్ హ్యాట్రిక్ విజయాలు అందుకున్నాడు.
47
ఉదయ్ కిరణ్ : టాలీవుడ్ విషాదాలలో ఉదయ్ కిరణ్ జీవితం కూడా ఒకటి. ఉదయ్ కిరణ్ ఎంత ఘనంగా కెరీర్ ని ప్రారంభించారో అంతే విషాదంగా ముగించారు. చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే చిత్రాలు యూత్ ఫుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. తొలి మూడు చిత్రాలు హ్యాట్రిక్ హిట్స్ కావడంతో ఇండస్ట్రీలో ఉదయ్ కిరణ్ పేరు మారుమోగింది. కానీ ఆ తర్వాత ఉదయ్ కిరణ్ కెరీర్ అంతకంతకూ దిగజారుతూ వచ్చింది.
57
అడివి శేష్ : అడివి శేష్ క్షణం చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అంతకు ముందు చాలా చిత్రాల్లో నెగిటివ్ రోల్స్, క్యారెక్టర్ రోల్స్ చేశాడు. క్షణం, అమీ తుమీ, గూఢచారి చిత్రాలు అడివిశేష్ కి హ్యాట్రిక్ హిట్స్ గా నిలిచాయి.
67
నాని : నేచురల్ స్టార్ నానిని కూడా తొలి మూడు చిత్రాలతో హ్యాట్రిక్ కొట్టిన హీరోల లిస్ట్ లో వేయొచ్చు. అష్టాచమ్మా హిట్ గా నిలిచింది. ఆ తర్వాత రైడ్ మూవీ పర్వాలేదనిపించింది. మళ్ళీ స్నేహితుడా చిత్రం హిట్ అయింది.
77
నవీన్ పోలిశెట్టి : నవీన్ పోలిశెట్టి హీరో కాకముందు కొన్ని చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించాడు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ చిత్రంతో నవీన్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అక్కడి నుంచి మొదలైన నవీన్ పోలిశెట్టి జైత్ర యాత్ర జాతిరత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రంతో కూడా కొనసాగింది.