బిగ్ బాస్ రివ్యూయర్ ఆది రెడ్డి ఒక నెల సంపాదన ఎంతో తెలుసా? వ్యాపారాలు, సాఫ్ట్వేర్ జాబ్స్ వేస్ట్!

Published : May 30, 2024, 10:27 AM IST

సోషల్ మీడియా అతిపెద్ద ఆదాయమార్గంగా అవతరించింది. బిగ్ బాస్ రివ్యూవర్ ఆదిరెడ్డి ఒక నెల సంపాదన తెలిస్తే మీ మైండ్ బ్లాక్ అవుతుంది. బడా వ్యాపారులు, సాఫ్ట్వేర్ ఉద్యోగుల సంపాదన ఆదిరెడ్డి ముందు దిగదుడుపే...   

PREV
18
బిగ్ బాస్ రివ్యూయర్ ఆది రెడ్డి ఒక నెల సంపాదన ఎంతో తెలుసా? వ్యాపారాలు, సాఫ్ట్వేర్ జాబ్స్ వేస్ట్!
Bigg Boss Adi Reddy

ఆదిరెడ్డి ఈ పేరు తెలియని బిగ్ బాస్ లవర్ ఉండరు. ఆదిరెడ్డి యూట్యూబ్ వేదికగా బిగ్ బాస్ రివ్యూలు చెబుతాడు. అతడి అనాలసిస్ కి లక్షల్లో ఫ్యాన్స్ ఉన్నారు. బిగ్ బాస్ తెలుగు లేటెస్ట్ సీజన్ మొదలైంది అంటే ఆదిరెడ్డి వరుస వీడియోలతో హోరెత్తిస్తారు.
 

28
Bigg Boss Adi Reddy

ఆదిరెడ్డిది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. బెంగుళూరులో హాస్టల్ లో ఉంటూ చిన్నా చితకా ఉద్యోగం చేసుకుంటుండేవాడు. బిగ్ బాస్ షో చూసి ఫ్రెండ్స్ తో ఆదిరెడ్డి మాట్లాడే తీరు చూసి వారు సలహా ఇచ్చారు. ఆదిరెడ్డి నువ్వు బిగ్ బాస్ రివ్యూలు చేయమన్నారు. అలా బిగ్ బాస్ ఎపిసోడ్స్ చూస్తూ రివ్యూలు చెప్పడం స్టార్ట్ చేశాడు. 

 

38
Adi Reddy

ఆదిరెడ్డి మాట తీరు. అతడు కంటెస్టెంట్స్ ని జడ్జి చేసే తీరు. ఎవరు జెన్యూన్ ప్లేయర్? ఎవరు ఫేక్ ప్లేయర్? అని అంచనా వేసే విధానం బిగ్ బాస్ లవర్స్ కి నచ్చింది. ఎలిమినేషన్స్ ని ఆదిరెడ్డి చాలా దగ్గరగా ప్రెడిక్ట్ చేస్తాడు. హోస్ట్ నాగార్జున జడ్జిమెంట్ లో గల తప్పొప్పులు విశ్లేషిస్తాడు . 

48
Adi Reddy

సీజన్ సీజన్ కి ఆదిరెడ్డికి అభిమానులు పెరుగుతూ వచ్చారు. ప్రస్తుతం ఆదిరెడ్డి యూట్యూబ్ ఛానల్ కి 6 లక్షలకు పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అలాగే ఇంస్టాగ్రామ్ లో 3 లక్షలకు పైగా ఆదిరెడ్డిని ఫాలో అవుతున్నాడు. సీజన్ మొదలైంది అంటే ఆదిరెడ్డికి పండగే. ప్రతి ప్రోమో, ఎపిసోడ్స్ రివ్యూలు ఇచ్చాడు. లైవ్ చూస్తూ ఇంట్రెస్టింగ్ పాయింట్స్ తో వీడియోలు చేస్తాడు. 

58

ఆదిరెడ్డి ఇంత కష్టపడడానికి కారణం.. సోషల్ మీడియా ద్వారా వచ్చే ఆదాయమే. సీజన్ 7లో పల్లవి ప్రశాంత్ కి మద్దతుగా ఆదిరెడ్డి తన రివ్యూలు ఇచ్చాడు. దాంతో కొందరు విమర్శలు చేశారు. డబ్బులు తీసుకుని ప్రశాంత్ కి అనుకూలంగా ఆదిరెడ్డి రివ్యూలు చెబుతున్నాడని కామెంట్స్ చేశాడు. ఈ విమర్శలకు చెక్ పెడుతూ ఆదిరెడ్డి తన యూట్యూబ్ ఇన్కమ్ రివీల్ చేశాడు. 

 

68
Adi Reddy

డబ్బులు తీసుకుని ఒకరికి అనుకూలంగా రివ్యూలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఈ నెలలో నా యూట్యూబ్ సంపాదన రూ. 39 లక్షలు అని ఆధారాలతో సహా చూపించాడు. బిగ్ బాస్ సీజన్ టైం లో ఆదిరెడ్డి నెలకు రూ. 30 నుండి 40 లక్షలు సంపాదిస్తాడని తెలుస్తుంది. సీజన్ ముగిసిన తర్వాత ఈ స్థాయిలో ఆదాయం ఉండదు. 

78
Bigg Boss Adi Reddy

కానీ ఆదిరెడ్డి క్రికెట్ రివ్యూలు, సోషల్ ఇష్యూస్, సినిమాల మీద కూడా స్పందిస్తూ వీడియోలు చేస్తాడు. వాటికి కూడా వ్యూస్ వస్తాయి. ఆదాయం వస్తుంది. ఇంస్టాగ్రామ్ ద్వారా మరికొంత ఆదాయం లభిస్తుంది. బిగ్ బాస్ సీజన్ నడుస్తున్నా లేకున్నా ఆదిరెడ్డి సోషల్ మీడియా ఆదాయం రెండు మూడు లక్షలకు తగ్గదు.

88
Adi Reddy


ఆదిరెడ్డి యూట్యూబర్ గా ఫేమస్ అయ్యాక స్థలం కొని విశాలవంతమైన ఇల్లు నిర్మించుకున్నాడు. విజయవాడలో ఒక సెలూన్ నడుపుతున్నాడు. బిగ్ బాస్ సీజన్ 6లో పాల్గొన్న ఆదిరెడ్డి ఫైనల్ కి వెళ్ళాడు. ఆ విధంగా కొన్ని లక్షలు ఆర్జించాడు. త్వరలో బిగ్ బాస్ తెలుగు 8 స్టార్ట్ కానుంది. అప్పుడే వీడియోలు స్టార్ట్ చేశాడు. 

Read more Photos on
click me!

Recommended Stories