`పుష్ప 2` ఐటెమ్‌ సాంగ్‌లో ఇద్దరు భామలు.. సమంత క్రేజ్‌ని మ్యాచ్‌ చేసేందుకు ఇద్దరు హీరోయిన్లని దించుతున్నారుగా!

Published : Jan 12, 2024, 11:55 PM ISTUpdated : Jan 12, 2024, 11:56 PM IST

ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్‌ ప్రస్తుతం `పుష్ప 2`లో నటిస్తున్నారు. అయితే ఇందులో చాలా స్పెషల్స్ యాడ్ చేస్తున్నారట. ఇద్దరు హాట్‌ బ్యూటీలను రంగంలోకి దించుతున్నారట. 

PREV
16
`పుష్ప 2` ఐటెమ్‌ సాంగ్‌లో ఇద్దరు భామలు.. సమంత క్రేజ్‌ని మ్యాచ్‌ చేసేందుకు ఇద్దరు హీరోయిన్లని దించుతున్నారుగా!

ఇండియన్‌ ఆడియెన్స్ వెయిట్‌ చేస్తున్న మూవీస్‌లో `పుష్ప2` ఒకటి. పుష్పరాజ్‌ రూలింగ్ ఎలా ఉంటుందో చూడాలని అంతా వెయిట్‌ చేస్తున్నారు. ఈ మూవీ ఇండిపెండెంట్‌ డేకి రాబోతుంది. ఈ సినిమాకి సంబంధించి పలు ఆసక్తికర అప్ డేట్‌లు చక్కర్లు కొడుతున్నాయి. ఒకటి ఐటెమ్‌సాంగ్‌కి సంబంధించిన విషయం, రెండు రిలీజ్‌ డేట్‌. 
 

26

అల్లు అర్జున్‌ పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగిన మూవీ `పుష్ప`. సుకుమార్‌ రూపొందించిన ఈ చిత్రం మొదటి డివైడ్‌ టాక్‌ తెచ్చుకున్నా, ఆ తర్వాత పుంజుకుంది. కలెక్షన్ల దుమ్ములేపింది. 350కోట్లు వసూలు చేసింది. నార్త్ లో ఊహించిన కలెక్షన్లని సాధించింది. సినిమాలో పాటలు పెద్ద హిట్‌ కావడం, యాక్షన్‌సీన్లు అదరగొట్టడం, మదర్‌సెంటిమెంట్‌, హీరోయిన్‌తో రొమాన్స్ ఇవన్నీ బాగా కుదిరాయి. సినిమాని పెద్ద రేంజ్‌ కి తీసుకెళ్లాయి.
 

36

దీనికితోడు సమంతతో చేసిన ఐటెమ్‌ సాంగ్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. `ఊ అంటావా మావ.. ` అంటూ ఊపేసింది. సమంత డాన్సులకు, ఆ లిరిక్‌కి బాగా సెట్‌ అయ్యింది. ఈ పాట మాస్‌ ఆడియెన్స్ చేత డాన్సులు చేయించింది. అయితే ఆ పాట అంత పాపులర్ కావడం,సినిమా సక్సెస్‌లో భాగం కావడంతో రెండో పార్ట్ లో ఐటెమ్‌ సాంగ్‌ ఎలా ఉంటే బాగుంటుందనే డైలామా యూనిట్‌లో కలిగింది.
 

46

అయితే `పుష్ప 2`లో ఐటెమ్‌ సాంగ్‌ కోసం చాలా మంది హీరోయిన్ల పేర్లు వినిపించాయి. కానీ ఫైనల్‌గా ప్రముఖంగా ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. ఇద్దరు ప్రభాస్‌ హీరోయిన్లతో ఈ స్పెషల్‌ సాంగ్‌లు ప్లాన్‌ చేశారట. ఇందులో `ఆదిపురుష` బ్యూటీ కృతి సనన్‌, `కల్కి` బ్యూటీ దిశా పటానీలతో ఈ సాంగ్‌ని అనుకుంటున్నారట. మొదటి భాగంలో సమంతకి మంచి పేరు తెచ్చింది ఆ పాట. అంతేకాదు ఇండియా ఊపేసింది. ఇప్పుడు ఈ ఇద్దరితో డబుల్‌ డోస్‌ అందాన్ని ఆడియెన్స్ కి పంచాలనుకుంటున్నారట. దీనికి సంబంధించి వారితో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. మరి ఇది వర్కౌట్‌ అవుతుందా? లేదా అనేది చూడాలి. 
 

56

ఇదిలా ఉంటే సినిమా రిలీజ్‌ డేట్‌పై రకరకాల వదంతులు వినిపిస్తున్నాయి. షూటింగ్‌ కంప్లీట్‌ కాలేదని, అనుకున్న టైమ్‌ కాదని, దీంతో సినిమా వాయిదా పడుతుందనే రూమర్స్ వినిపించాయి. దీంతో దీనిపై టీమ్‌ కూడా రియాక్ట్ అయ్యింది. రిలీజ్‌ డేట్‌లో మార్పు లేదని తెలిపింది. స్వాతంత్య్ర దినోత్సవానికి రాబోతున్నట్టు తెలిపారు.

66

సుకుమార్‌ బర్త్ డే సందర్భంగా క్లారిటీ ఇచ్చారు. ఇక ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న `పుష్ప2`లో అల్లు అర్జున్‌కి జోడీగా రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుంది. ఫహద్‌ ఫాజిల్‌ నెగటివ్‌ రోల్ చేస్తున్నాడు. సినిమాపై భారీ అంచనాలున్నాయి. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories