Gunturkaaram Collections: `గుంటూరు కారం` తొలి రోజు కలెక్షన్ల అంచనా.. ఇదే తక్కువ రికార్డా?

Published : Jan 12, 2024, 10:35 PM IST

మహేష్ బాబు హీరోగా నటించిన `గుంటూరు కారం` సినిమా నేడు విడుదలైంది. ఈ మూవీకి చాలా వరకు నెగటివ్‌ టాక్‌ వస్తోంది. అయితే తొలి రోజు ఓపెనింగ్స్ ఎంత ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది.

PREV
15
Gunturkaaram Collections: `గుంటూరు కారం` తొలి రోజు కలెక్షన్ల అంచనా.. ఇదే తక్కువ రికార్డా?

మహేష్‌బాబు ఈ సంక్రాంతి `గుంటూరు కారం` చిత్రంతో వచ్చాడు. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య విడుదలైంది. దీనికి చాలా వరకు నెగటివ్‌ టాక్‌ వస్తుంది. ఫ్యాన్స్ మూవీ అని చెబుతున్నారు. మహేష్‌బాబు మెప్పించినా, త్రివిక్రమ్‌ నిరాశ పరిచారనే కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇది సినిమా కలెక్షన్లపై ప్రభావం చూపిస్తుంది. 
 

25
Guntur Kaaram

అయితే ఇప్పుడు ఫస్ట్ డే `గుంటూరు కారం` ఎంత కలెక్ట్ చేయబోతుందనే లెక్కలు ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు అన్ని షోస్‌ పూర్తయ్యాయి. ఇక ఫస్ట్ డే కలెక్షన్ల లెక్కలు షురూ అయ్యాయి. అడ్వాన్స్ బుకింగ్‌లు, ఫస్ట్ డే ఓపెనింగ్స్ లెక్కలను ఆరా తీస్తున్నారు ట్రేడ్‌ పండితులు. ఈ నేపథ్యంలో తమ ప్రిడిక్షన్‌ చెబుతున్నారు. ఎంత ఉందబోతుందనే విషయాన్ని వెల్లడిస్తున్నారు. 
 

35
Guntur Kaaram Review

ఇక `గుంటూరు కారం` ఫస్ట్ డే ప్రిడిక్షన్‌ ప్రకారం ఈ మూవీ మహేష్‌ గత చిత్రాలను దాటబోదని అంటున్నారు. సంక్రాంతి కారణంగా భారీగానే రిలీజ్‌ అయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా తొలి రోజు ఇది రెండు వేలకుపైగా థియేటర్లలో పడింది. ఓవర్సీస్‌లో మాత్రం గట్టిగానే రాబోతుంది. అక్కడ పది కోట్లు ఈజీగా దాటుతుందని అంటున్నారు. నైజాంలోనూ 15 కోట్లకుపైగా కలెక్షన్లు వస్తాయని, ఏపీలో ఇరవై కోట్ల వరకు ఆశిస్తున్నారు. ఇతర మరో పది కోట్ల వరకు ఆశిస్తున్నారు. 
 

45
Guntur Kaaram Review

ఈ లెక్కన `గుంటూరు కారం` సినిమా ఫస్ట్ డే యాభై  నుంచి 55కోట్ల వరకు ఆశిస్తున్నారు. అయితే మార్నింగ్ నెగటివ్‌ టాక్‌ కారణంగా మధ్యాహ్నం, సాయంత్రానికి కొంత డ్రాప్‌ అయ్యిందనే టాక్‌ వినిపిస్తుంది. ఇది ఫస్ట్ డే కలెక్షన్లపై ప్రభావం చూపిస్తుంది. ఈ మూవీ మహేష్‌ గత చిత్రం `సర్కారు వారి పాట`ని దాటడం కష్టమే అంటున్నారు. అప్పుడు అది సోలోగా వచ్చింది. తొలి రోజు గట్టిగా చేసింది. సుమారు 70కోట్ల గ్రాస్‌ రాబట్టింది. 45కోట్ల షేర్‌ వచ్చింది. కానీ `గుంటూరు కారం` అంత చేయడం కష్టమంటున్నారు. మరి ఫైనల్‌ ఫిగర్స్ ఎంత ఉంటాయో చూడాలి. 

55

ఇక `గుంటూరు కారం`లో మహేష్‌కి జోడీగా శ్రీలీల నటించింది. ఆమె డాన్సులు ఆకట్టుకున్నాయి. కానీ మహేష్‌ బాబు ముందు ఆమె తేలిపోయింది. ఆయన వన్‌ మ్యాన్‌ షో చేశాడు. ఫ్యాన్స్ నచ్చే అంశాలున్నాయి. కానీ త్రివిక్రమ్‌ మాత్రం సినిమాకి న్యాయం చేయలేకపోయాడు. ఆయన్నుంచి ఇది మరో అజ్ఞాతవాసి అంటున్నారు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories