రాజమౌళి సినిమా రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్లు.. హీరోకి తీవ్ర అవమానం, కానీ మూవీ బ్లాక్ బస్టర్ హిట్

Published : Jan 22, 2026, 06:49 PM IST

రాజమౌళి సినిమాలని సాధారణంగా హీరోయిన్లు రిజెక్ట్ చేయరు. కానీ ఇద్దరు స్టార్ హీరోయిన్లు మాత్రం జన్నక్క సినిమాని రిజెక్ట్ చేశారు. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి. 

PREV
15
రాజమౌళి సినిమా

దర్శక ధీరుడు రాజమౌళి సినిమా సినిమా అంటే ఎంత అగ్ర నటీమణులు అయినా నటించడానికి ఉత్సాహం చూపిస్తారు. వెంటనే సినిమాలో నటించేందుకు అంగీకరిస్తారు. ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న వారణాసి చిత్రంలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. రాజమౌళి సినిమా అంటే ఎంత హీరోయిన్లు అయినా నటించటానికి ఆసక్తి చూపుతారు అని చెప్పడానికి ఇదే నిదర్శనం. 

25
రాజమౌళి సినిమా

రిజెక్ట్ చేసిన హీరోయిన్లు  కానీ రాజమౌళి సినిమాని కూడా రిజెక్ట్ చేసిన హీరోయిన్లు ఉన్నారు. ఇది వినడానికి షాకింగ్ అనిపించవచ్చు. కానీ ఇదే నిజం. ఇద్దరు హీరోయిన్లు రాజమౌళి సినిమాలో నటించడానికి అంగీకరించలేదు. కారణం హీరోనే అని చెప్పాలి. 

35
రాజమౌళి కి నో చెప్పడానికి కారణం

ఆ హీరోనే  రాజమౌళి సినిమాని రిజెక్ట్ చేసిన హీరోయిన్లు ఎవరో కాదు.. అనుష్క శెట్టి, త్రిష. మర్యాద రామన్న మూవీ కోసం రాజమౌళి ముందుగా వారిని సంప్రదించారు. కానీ ఆ సినిమాలో నటించింది స్టార్ హీరో కాదు. కమెడియన్ నుంచి హీరోగా మారిన సునీల్. కమెడియన్ నటించే సినిమా కావడంతో అనుష్క, త్రిష ఇద్దరూ నటించడానికి అంగీకరించలేదు. 

45
సునీల్ కి అవమానం 

వాళ్లిద్దరూ రిజెక్ట్ చేయడంతో రాజమౌళి సలోనిని సంప్రదించి ఆమెని ఫైనల్ చేశారు. కానీ తాను ఒక కమెడియన్ ని అని చెప్పి ఆ హీరోయిన్లు రిజెక్ట్ చేయడంతో తాను అవమానంగా భావించి ఫీల్ అయినట్లు సునీల్ తెలిపారు. 

55
స్టార్ హీరో చెప్పిన మాటలతో రియలైజ్

అయిన సునీల్  కానీ ఒక స్టార్ హీరో చెప్పిన మాటల వల్ల రియలైజ్ అయినట్లు సునీల్ తెలిపారు. ఆ హీరో ఎవరో కాదు కింగ్ నాగార్జున. ఓ హీరోయిన్ నాగార్జున సినిమాలో నటించడానికి అంగీకరించలేదట. ఈ విషయాన్ని నాగార్జున గారు తనకి చెప్పినట్లు సునీల్ తెలిపారు. ఆ హీరోయిన్ నన్ను రిజెక్ట్ చేసింది. నేను వయసులో పెద్ద వాడిని కదా. నాతో నటిస్తే యంగ్ హీరోలతో నటించే ఛాన్స్ రాదు అని అలా చేసింది. మనం కూడా యంగ్ హీరోయిన్లతోనే నటించాలని అనుకుంటాం కదా. అదే విధంగా ఆమె నిర్ణయం కూడా సరైనదే అని నాగార్జున తెలిపారు. ఆయన చెప్పిన మాటలతో నేను కూడా రియలైజ్ అయ్యాను అని సునీల్ తెలిపారు. 

Read more Photos on
click me!

Recommended Stories