మెగాస్టార్ వారసత్వం తీసుకుని ఇండస్ట్రీకి వచ్చిన రామ్ చరణ్.. ఆతరువాత తన సొంత ట్యాలెంట్ తో ఎదిగి చూపించాడు. సినిమా కోసం ఎంతో కష్టపడ్డ ఆయన పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. చిరంజీవి వారసత్వం తీసుకోవడం చరణ్ కు భారమా.బాధ్యత? మెగా పవర్ స్టార్ కీలక కామెంట్స్?
టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా హీరోగా ఎదిగిన మెగా పవర్ స్టార్ రామ్చరణ్.. RRR సినిమాతో ఆస్కార్ నటుడిగా గుర్తింపు సాధించాడు. ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిన రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతూ.. ఎక్కవగా పనిచేయడానికి ఇష్టపడుతుంటాడు. రీసెంట్ గా ఆయన తన కెరీర్, సినిమాల గురించి ఓపెన్‌గా మాట్లాడారు. చాలామంది హీరోలు తమ కుటుంబ వారసత్వం ఒత్తిడిని సృష్టిస్తుందని చెప్పినా, రామ్ చరణ్ మాత్రం దాన్ని ఒక సౌలభ్యంగా చూస్తున్నారు. ఆస్కార్ స్థాయికి చేరినా కూడా తనను తాను అంత సీరియస్‌గా తీసుకోనని చెప్పారు.
25
చిరంజీవి వారసుడిగా..
రీసెంట్ గా ఒక కార్యక్రమంలో కనిపించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, 'టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కొడుకుగా పుట్టడం వల్ల కలిగిన ప్రయోజనాల గురించి ఓపెన్‌గా మాట్లాడారు. 'సినిమా కుటుంబం నుంచి రావడం ఒక అద్భుతమైన అవకాశం.ఇంట్లో చాలా అనుభవం ఉన్నవాళ్లు ఉన్నప్పుడు, మనం విషయాలను తొందరగా అర్థం చేసుకుంటాం. ఇలాంటి వాతావరణంలో పెరిగినవాళ్లు యాక్టింగ్ స్కూల్‌కి వెళ్లి కొత్త విషయాలు నేర్చుకునే వాళ్లకంటే వేగంగా నేర్చుకుంటారు' అని రామ్ చరణ్ చెప్పారు.
35
వారసత్వం భారమా..?
వారసత్వంగా ఇండస్ట్రీకి రావడంపై చరణ్ మాట్లాడుతూ.. 'వారసత్వం నాపై భారం అని నేనెప్పుడూ అనుకోలేదు. కానీ దాన్ని ఒక ప్రత్యేక అవకాశంగా చూశాను' 'ప్రారంభంలో నాకు కష్టం కాలేదు. కానీ ప్రేక్షకులు నన్ను నటుడిగా అంగీకరించడం కష్టంగా ఉండొచ్చు.ఎందుకంటే వాళ్ల అంచనాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ కాలక్రమేణా, మనం చేసే పని ద్వారా వాళ్ల అభిప్రాయాలు మారతాయని నేను నమ్ముతాను' అని చాలా నిజాయితీగా మాట్లాడాడు రామ్ చరణ్.
రామ్ చరణ్ మాట్లాడుతూ.. 'నన్ను నేను అంత సీరియస్‌గా తీసుకోను. నేను ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకే నా పని మీద దృష్టి పెడతాను. అది అయిపోయాక, నేను ఏం చేస్తున్నానో అది పూర్తిగా నా వ్యక్తిగతం.. హ్యాపీగా ఇంట్లోవాళ్లతో టైమ్ స్పెండ్ చేస్తుంటాను. దేని గురించి క్కువగా ఆలోచించను, తలకెక్కించుకోను.. ఈ అలవాటు నన్ను ఎప్పుడూ ప్రశాంతంగా ఉంచుతుంది' అని ఆయన స్పష్టం చేశారు.
55
రామ్ చరణ్ సినిమాలు..
రామ్ చరణ్ ప్రస్తుతం 'పెద్ది' షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా మార్చి 27, 2026న విడుదల కానుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఎలాగైనా ఈ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టాలని పట్టుదలతో ఉన్నాడు చరణ్. ఈమూవీ తరువాత సుకుమార్ తో మరో పాన్ ఇండియా సినిమా చేయబోతున్నాడు రామ్ చరణ్.