అల్లు అర్జున్‌కి రిమాండ్‌.. బన్నీపై ఏఏ కేసులున్నాయి? నేరం రుజువైతే ఎన్నేళ్లు జైలు శిక్ష!

Published : Dec 13, 2024, 04:32 PM IST

సంధ్య థియేటర్‌ వద్ద తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్‌ని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయన్ని రిమాండ్‌కి తరలించాలని నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.   

PREV
15
అల్లు అర్జున్‌కి రిమాండ్‌.. బన్నీపై ఏఏ కేసులున్నాయి? నేరం రుజువైతే ఎన్నేళ్లు జైలు శిక్ష!

అల్లు అర్జున్‌ సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ రోజు(శుక్రవారం) ఉదయం ఆయన్ని చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. అల్లు అర్జున్‌ని తమ కస్టడీకి తరలించాలని కోరుతూ పోలీసులు పిటీషన్‌ వేశారు. నాంపల్లి కోర్ట్ దీనిపై విచారణచేపట్టింది. బన్నీని రిమాండ్‌కి తరలించాలని కోరుతూ తీర్పునిచ్చింది. ఈ క్రమంలో14 రోజులపాటు అల్లు అర్జున్‌ జైల్లో ఉండబోతున్నారు. ఆయన్ని పోలీసులు విచారించనున్నారు. ప్రస్తుతం ఆయన్ని చంచల్‌గూడ జైలుకి తరలించే అవకాశం ఉంది. 
 

25

ఇదిలా ఉంటే హైకోర్ట్ లో అల్లు అర్జున్‌ క్వాష్‌ పిటీషన్‌ వేశారు. తనను అరెస్ట్ చేయాలని పోలీసులు పిటీషన వేసిన నేపథ్యంలో ఈ కేసులు కొట్టేయాలని కోరుతూ బన్నీ తరఫున న్యాయవాది హైకోర్ట్ లో క్వాష్‌ పిటీషన్‌ వేశారు. దీనిపై హైకోర్ట్ లో విచారణ జరుగుతుంది. దీనికి సంబంధించిన తీర్పు రానుంది.

35

ఈ క్రమంలో నాంపల్లి కోర్టు బన్నీని పోలీసుల రిమాండ్‌కి తరలించాలని ఆదేశాలు జారీ చేయడం సంచలనంగా మారింది. దీంతో ఈ కేసు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద హాట్‌ టాపిక్‌ అవుతుంది. ఈ కేసులో అల్లు అర్జున్‌ ఏ 11 నిందితుడిగా పోలీసులు కేసు నమోదు చేశారట. ఇప్పటికే ఏ 1 నుంచి ఉన్న సంధ్య థియేటర్ హోనర్‌ని, మేనేజర్‌ని, అల్లు అర్జున్‌ని వ్యక్తిగత సిబ్బందిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

45

ఇక బన్నీపై నమోదు చేసిన కేసులు ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతున్నాయి. అల్లు అర్జున్‌పై చిక్కడపల్లి పోలీసులు బీఎన్ఎస్‌ 118(1), బీఎన్‌ఎస్‌ 105 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. బీఎన్‌ఎస్‌ 105 అనేది తన ప్రమేయం లేకుండా, ఉద్దేశ్య పూర్వకంగా కాకుండా నేరంలో భాగం కావడం అనేది తెలియజేస్తుందని, అలాగే బీఎన్‌ఎస్‌ 118(1) అనేది ఉద్దేశ్య పూర్వకంగానే ఆయుధంతో దాడి చేయడమనేది తెలియజేస్తుందట.

55
allu arjun arrest

బీఎన్‌ఎస్‌ 118(1) ప్రకారం నేరం రుజువైతే 3ఏళ్ల నుంచి పదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని, లేదంటే యావజ్జీవ కారాగార శిక్షకు కూడా అవకావం ఉందని తెలుస్తుంది. మరోవైపు బీఎన్‌ఎస్‌ 105 ప్రకారం ఐదేళ్ల నుంచి పదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని న్యాయనిపుణులు తెలియజేస్తున్నారు.  ఇది మెగా ఫ్యామిలీని, మెగా, అల్లు అభిమానులను కలవరానికి గురి చేస్తుంది. అంతేకాదు ఈ కేసు బన్నీ భవితవ్యంపై అనుమానాలు రేకెత్తిస్తుంది.  

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories