TVK పార్టీ జెండాను ఆవిష్కరించిన విజయ్ దళపతి... రంగు ఏంటి ..? చిహ్నం ఏంటో తెలుసా?

First Published | Aug 22, 2024, 9:54 AM IST

తమిళగ వెట్రి కజగం పార్టీ జెండాను నటుడు విజయ్ ఆవిష్కరించి, ప్రత్యేక గీతాన్ని కూడా విడుదల చేశారు.

థళపతి విజయ్

తమిళగ వెట్రి కజగం పార్టీ అధ్యక్షుడు విజయ్ ఈరోజు ఆ పార్టీ జెండాను ఆవిష్కరించారు. దేశమంతటా మన జెండా ఎగురుతుంది, తమిళనాడు ఇకముందు గొప్పగా ఉంటుందని ప్రకటనలో పేర్కొన్న విజయ్, జెండాను ఆవిష్కరించారు.  ఈ సందర్భంగా ఆయన పార్టీ ప్రత్యేక గీతాన్ని కూడా ఆవిష్కరించారు. తమన్  సంగీతం అందించిన  ఈ పాటకు సాహిత్యం రచయిత వివేక్ అందించారు.

TVK పార్టీ

చెన్నై పనయూర్‌లోని తమిళగ వెట్రి కజగం కార్యాలయంలో ఈ జెండా ఆవిష్కరణ వేడుక జరిగింది. దీనికి తమిళనాడు అంతటా నుండి 250 మందికి పైగా కీలక నాయకులను ఆహ్వానించారు. అక్కడికి వచ్చిన నాయకులకు ఉదయం అల్పాహారంతో పాటు  మధ్యాహ్న భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నటుడు విజయ్ తల్లిదండ్రులు ఎస్.ఎ.చంద్రశేఖర్ మరియు శోభ కూడా పాల్గొన్నారు.


TVK జెండా ఆవిష్కరణ

నటుడు విజయ్ పార్టీ కార్యక్రమంలో ఆయన తల్లిదండ్రులు పాల్గొనడం ఇదే తొలిసారి. అయితే విజయ్ భార్య సంగీత ఈ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. తెల్ల చొక్కా ధరించి ఈ జెండా ఆవిష్కరణ వేడుకకు హాజరయ్యారు నటుడు విజయ్. వేదికకు వచ్చిన వెంటనే మొదటగా తన తల్లిదండ్రులను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు నటుడు విజయ్.

TVK జెండా

విజయ్ ఆవిష్కరించిన తమిళగ వెట్రి కజగం జెండాలో ఎరుపు ,  పసుపు రంగులు ఉన్నాయి. అంతేకాకుండా అందులో రెండు ఏనుగులు, మధ్యలో వాగై పువ్వు కూడా ఉన్నాయి. జెండా ఆవిష్కరణ అనంతరం తమిళగ వెట్రి కజగం పార్టీ  జెండాను ఎగురవేశారు థళపతి విజయ్. ఆ సమయంలో నాయకులు దళపతి అంటూ నినాదాలు చేశారు.

Latest Videos

click me!