ప్రభాస్ వివాదంలో అడ్డంగా బుక్ అయిన రాజమౌళి... బహుశా పాన్ ఇండియా డైరెక్టర్ అవుతాడని ఊహించి ఉండరు!

First Published | Aug 20, 2024, 8:22 PM IST


ప్రభాస్ ని జోకర్ అంటూ అర్షద్ వార్సి చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. టాలీవుడ్ హీరోలు అర్షద్ ని ఏకి పారేస్తున్నారు. అయితే ఈ వివాదంలో అనుకోకుండా రాజమౌళి బుక్ అయ్యాడు.. 
 

సందు దొరికితే ప్రభాస్ పరువు తీసేందుకు సిద్ధంగా ఉంటారు బాలీవుడ్ ప్రముఖులు. ప్రభాస్ మార్కెట్, స్టార్డం ని వారు జీర్ణించుకోలేరు. ఒకప్పుడు దేశాన్ని శాసించిన సల్మాన్, అమీర్, షారుఖ్ లను ప్రభాస్ ఎప్పుడో దాటేశాడు. బాహుబలి విజయం గాలివాటమే అనుకుంటే... సాహో, కల్కి 2829 AD చిత్రాలతో నార్త్ లో మరో రెండు విజయాలు నమోదు చేశాడు.

గతంలో ప్రభాస్ పై ది కాశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి అనుచిత కామెంట్స్ చేశాడు. ఆదిపురుష్ ఫెయిల్యూర్ నేపథ్యంలో ఎవరిని పడితే వారిని రాముడిగా ప్రేక్షకులు అంగీకరించరు అని ప్రభాస్ పై వివేక్ అగ్నిహోత్రి కౌంటర్ వేశాడు. ఇటీవల విడుదలైన కల్కి 2829 AD వరల్డ్ వైడ్ రూ. 1100 కోట్ల వసూళ్లు రాబట్టింది. హిందీ వెర్షన్ రూ. 227 కోట్లు వసూలు చేసింది. కాబట్టి కల్కి హిందీలో కూడా సాలిడ్ హిట్. ఇది బాలీవుడ్ ప్రముఖుల్లో కొందరికి నచ్చడం లేదు. నటుడు అర్షద్ వార్సి తాజాగా ప్రభాస్ ని ఉద్దేశిస్తూ అనుచిత కామెంట్స్ చేశాడు. ప్రభాస్ ని జోకర్ అన్నాడు.


arshad warsi prabhas


అర్షద్ వార్సి కల్కి చిత్రం పై స్పందిస్తూ... కల్కి చిత్రంలో ప్రభాస్ ని చూసి చాలా నిరాశ చెందాను. ప్రభాస్ జోకర్ వలె ఉన్నాడు. నేను కల్కి బదులు మ్యాడ్ మ్యాక్స్ మూవీ చూస్తాను, అని అన్నాడు. ప్రభాస్ లుక్, క్యారెక్టర్ ని ఎగతాళి చేసిన అర్షద్ వార్సి, కల్కి హాలీవుడ్ మూవీ మ్యాడ్ మ్యాక్స్ మూవీ కాపీ అనే అర్థంలో ఇండైరెక్ట్ కామెంట్స్ చేశాడు. 

Prabhas

ప్రభాస్-అర్షద్ వివాదంలో అనూహ్యంగా రాజమౌళి ఇరుక్కున్నాడు. ప్రభాస్ ని కించపరిచే కామెంట్స్ ని ఖండిస్తూ టాలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ప్రభాస్ ని విమర్శించే స్థాయి అర్షద్ కి లేదంటూ కౌంటర్స్ ఇస్తున్నారు. టాలీవుడ్ ప్రముఖుల స్పందనకు బాలీవుడ్ నుండి ప్రతి స్పందన రావడం విశేషం. వారు రాజమౌళి పాత వీడియో తెరపైకి తెచ్చారు.

rajamouli

ప్రభాస్ నటించిన బిల్లా ప్రమోషనల్ ఈవెంట్ కి గెస్ట్ గా హాజరైన రాజమౌళి... ధూమ్ సినిమా చూసి మనకు ఇంత క్వాలిటీ పిక్చర్స్ ఎందుకు రావడం లేదు. హృతిక్ రోషన్ వంటి హీరోలు మనకు లేరా... అనిపించేది. బిల్లా మూవీ సాంగ్స్, ట్రైలర్ చూశాక హృతిక్ రోషన్ సరిపోడు అనిపిస్తుంది. హాలీవుడ్ రేంజ్ మూవీ అందించిన మెహర్ రమేష్ కి కృతజ్ఞతలు అన్నాడు. హృతిక్ రోషన్ ని కించపరుస్తూ మాట్లాడిన రాజమౌళి సంగతేంటి? అర్షద్ చేసింది తప్పైతే రాజమౌళి చేసిందే తప్పే అని బాలీవుడ్ మీడియా ఓల్డ్ వీడియో వైరల్ చేస్తుంది. 

ఇండియా వైడ్ ఫేమ్ ఉన్న రాజమౌళి గతంలో అనాలోచితంగా చేసిన కామెంట్స్ ఆయన ఇమేజ్ డ్యామేజ్ చేశాయి. బహుశా బాలీవుడ్ తో మనకు సంబంధం ఏమిటని అలాంటి కామెంట్స్ రాజమౌళి చేసి ఉండొచ్చు. కానీ ఆయన పాన్ ఇండియా డైరెక్టర్. నార్త్ మార్కెట్ కూడా రాజమౌళి చిత్రాలకు అవసరం. హృతిక్ రోషన్ ని అవమానించినందుకు రాజమౌళి సినిమాలను నార్త్ వాళ్ళు అవైడ్ చేస్తే నష్టం తప్పదు.. 

Latest Videos

click me!