రామారావు, నాగేశ్వరరావు, అమితాబ్‌.. రవితేజని గట్టిగా ముంచిన ముగ్గురు లెజెండ్స్..

First Published | Aug 20, 2024, 8:16 PM IST

మాస్‌ మహారాజా రవితేజకి ముగ్గురు లెజెండ్స్ హ్యాండిచ్చాడు. అభిమానంతో ఆయన వారిపై ఎంతో నమ్మకం పెట్టుకోగా, ముగ్గురూ నట్టెట్ట ముంచేశారు. ఇది వైరల్‌గా మారింది. 

మాస్‌ మహారాజా రవితేజ సినిమాల పరంగా బ్యాడ్‌ టైమ్‌ నడుస్తుంది. ఆయన నటించిన సినిమాలు బ్యాక్‌ టూ బ్యాక్ బోల్తా కొడుతున్నాయి. ఇది రవితేజ సినిమాలపై ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఆయన మార్కెట్‌పై ఇంపాక్ట్ పడుతుంది. ఇటీవల వచ్చిన `మిస్టర్‌ బచ్చన్` కూడా ఫ్లాప్‌ అయిన విషయం తెలిసిందే. 
 

ఇదిలా ఉంటే రవితేజకి సంబంధించిన ఒక ఆసక్తికర విషయం ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. మాస్‌ మహారాజా రవితేజ నమ్ముకున్న ముగ్గురు లెజెండ్స్ ఆయన కొంప ముంచేశారు. రామారావు, నాగేశ్వరరావు, అమితాబ్‌ బచ్చన్‌లను నమ్ముకుని సినిమాలు చేసిన రవితేజకి ఈ ముగ్గురు ముంచేశారు. మరి ఆ కథేంటో చూస్తే.. 

Latest Videos


రవితేజ ఇటీవల రామారావు పేరుతో `రామారావుః ఆన్‌ డ్యూటీ` సినిమా చేశారు. ప్రభుత్వ ఉద్యోగిగా నటించిన చిత్రమిది. శరత్‌ మండవ దర్శకత్వం వహించిన ఈ మూవీ రెండేళ్ల క్రితం విడుదలైంది. కానీ ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో విఫలమయ్యింది. నిజానికి ఈ మూవీపై చాలా అంచనాలు పెట్టుకున్నారు రవితేజ. ప్రెస్‌ మీట్లలోనూ ఈ విషయాన్ని చెప్పారు. కానీ బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. అలా రామారావు.. రవితేజకి హ్యాండిచ్చాడు. 
 

ఆ తర్వాత నాగేశ్వరరావుని నమ్ముకున్నాడు రవితేజ. `టైగర్‌ నాగేశ్వరరావు` పేరుతో సినిమా చేశారు. స్టూవర్ట్ పురం గజదొంగ టైగర్‌ నాగేశ్వరరావు లైఫ్‌ ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని రూపొందించారు. వంశీ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం గతేడాది వచ్చింది. ఈ సినిమాపై అందరిలోనూ భారీ అంచనాలున్నాయి. రవితేజ మాత్రమే కాదు, ఇండస్ట్రీ కూడా ఇది అదిరిపోయే మూవీ అవుతుందని భావించారు. పాన్‌ ఇండియా రేంజ్‌లోనూ దీన్ని రూపొందించారు. కానీ సినిమా ఘోర పరాజయం చెందింది. లెంన్త్ సమస్య అన్నారు, ట్రిమ్‌ చేసినా ప్రయోజనం లేదు. అలా నాగేశ్వరరావు కూడా రవితేజని ముంచేశాడు. 
 

Mr Bachchan

ఇటీవల తన ఫేవరేట్‌, తాను అభిమానించే హీరో అమితాబ్‌ బచ్చన్‌ని నమ్ముకున్నాడు రవితేజ. బాలీవుడ్‌లో హిట్‌ అయిన `రైడ్‌` మూవీని `మిస్టర్ బచ్చన్‌` పేరుతో రీమేక్ చేశారు. హరీష్‌ శంకర్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది. ఆమె హైలైట్‌ అయ్యింది. కానీ సినిమా పోయింది. సినిమాని లేపేందుకు హరీష్‌ శంకర్‌ చాలా ప్రయత్నించాడు. కానీ ఎలాంటి ప్రయోజనం లేదు. రవితేజకి మరో డిజాస్టర్‌ పడింది.

ఇలా అమితాబ్‌ బచ్చన్‌ కూడా రవితేజని కాపాడలేకపోయారు. రామారావు, నాగేశ్వరరావు, అమితాబ్‌ బచ్చన్‌ ఈ ముగ్గురు లెజెండ్స్ ముంచేశారు. ఇదే కాదు చివరికి రావణాసుర చిత్రం కూడా బోల్తా కొట్టింది. ఏదైనా కంటెంట్‌ ముఖ్యం. రవితేజ మార్క ఎంటర్‌టైన్‌మెంట్‌ ముఖ్యం. దాన్ని విడిచి సాము చేస్తున్నాడు రవితేజ. తన బలాన్ని వదిలేసి ప్రయోగాలు చేస్తున్నాడు. ఆ విషయంలో ఆయన రియలైజ్‌ అయి మంచి సినిమాలతో వస్తాడని, హిట్‌ కొట్టాలని ఆశిద్దాం. 

click me!