బాక్సాఫీస్ దగ్గర రష్మిక మందన్న రచ్చ, 100 కోట్ల చేరువలో థామా సినిమా కలెక్షన్స్

Published : Oct 28, 2025, 11:30 AM IST

బాక్సాఫీస్ దగ్గర రచ్చ చేస్తోంది రష్మిక మందన్న.. తన ఖాాతాలో మరో భారీ బ్లాక్ బస్టర్ మూవీని జమచేసుకోబోతోంది. ఆయుష్మాన్ ఖురానతో కలిసి రష్మిక నటించిన థామా కలెక్షన్స్ లో దూసుకుపోతోంది. 

PREV
15
దూసుకుపోతోన్న నేషనల్ క్రష్

వరుస హిట్ సినిమాలతో దూసుకుపోతోన్న నేషనల్ క్రష్ రష్మిక మందన్నా.. తాజాాగా మరో బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకుంది. ఆయుష్మాన్ తో కలిసి జంటగా నటించిన బాలీవుడ్ మూవీ థామా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఇక 2023లో డ్రీమ్ గర్ల్ 2 తర్వాత ఆయుష్మాన్ నటించిన రొమాంటిక్ హారర్ కామెడీ సినిమా కావడంతో బాలీవుడ్ లో ఈసినిమా బాగా వర్కౌట్ అయ్యింది.  ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రష్మిక, యఆయుష్మాన్ తో పాటుగా నవాజుద్దీన్, పరేష్ రావల్  కూడా ప్రముఖ పాత్రల్లో నటించారు. 

25
థామా బాక్సాఫీస్ రిపోర్ట్

బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతోంది థామా. సోమవారం, అక్టోబర్ 27, 2025న థామా హిందీ ఆక్యుపెన్సీ 8.9% ఉంది. Sacnilk ప్రకారం, 7వ రోజు ఉదయం షోలలో 6.88%, మధ్యాహ్నం షోలలో 11.01% ఆక్యుపెన్సీ నమోదైంది. 

35
భారీ ఓపెనింగ్ సాధించిన సినిమా

రష్మికతో పాటు  ఆయుష్మాన్ ఖురానాకు కూడా ఈసినిమా అద్భుతమైన విజయాన్ని అందించింది. ఆయుష్మాన్  రెండేళ్ల విరామం తర్వాత థియేటర్లలోకి తిరిగి రావడంతో అతని అభిమానులు పండగ చేసుకుంటున్నారు.  ఈ హారర్ కామెడీ సినిమా దాదాపుగా 24 కోట్ల భారీ ఓపెనింగ్‌ను కూడా  సాధించింది.

45
మ్యాడాక్ హారర్ కామెడీ సిరీస్‌

మ్యాడాక్ హారర్ కామెడీ సిరీస్‌లో థామా కొత్త వెర్షన్. ఇది స్త్రీ, భేదియా, ముంజ్యా, స్త్రీ 2 లాంటి సినిమాల  సరసన చేరింది. ఆయుష్మాన్, రష్మికల మొదటి సినిమా  అయినా.. ఇందులో ఈ ఇద్దరు స్టార్స్  ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీకి మంచి మార్కులు పడ్డాయి.

55
100 కోట్లకు చేరువలో

"థామా" బాక్సాఫీస్ వద్ద "ఏక్ దీవానే కీ దీవానగీ"తో పోటీ పడుతోంది. 7వ రోజున థామా అన్ని భాషల్లో కలిపి సుమారు 1.73 కోట్లు సంపాదించింది. దీని మొత్తం కలెక్షన్  93.03 కోట్లకు చేరింది. ఈరోజు ఈసినిమా 100 కోట్ల క్లబ్ లో చేరే అవకాశం ఉంది. ఈక్రమంలో రష్మిక ఖాతాలో మరో భారీ బ్లాక్ బస్టర్ పడ్డట్టే అని ఫ్యాన్స్ తెగ సంబరపడుతున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories