బాలయ్య కోసం రెమ్యునరేషన్ తగ్గించిన నయనతార, ఎన్ని కోట్లు తీసుకోనుందంటే ?

Published : Oct 28, 2025, 10:23 AM IST

ప్రస్తుతం ఉన్న సీనియర్ హీరోయిన్లలో నయనతార ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. సినిమాకు 10 కోట్లకు పైగా వసూలు చేస్తోన్న నయన్.. బాలయ్య కోసం పారితోషికం తగ్గించుకున్నారట. ఇంతకీ విషయం ఏంటంటే? 

PREV
15
40 దాటినా తగ్గని ఇమేజ్..

సాధారణంగా హీరోయిన్ల కెరీర్ చాలా తక్కువగా ఉంటుంది. 35 దాటితే సినిమాల నుంచి ఫెయిడ్ అవుట్ అవుతుంటారు హీరోయిన్లు. యంగ్ హీరోల పక్కన ఛాన్స్ లు రావు, సీనియర్ హీరోల సరసన నటించడమో.. లేక క్యారెక్టర్ రోల్స్ చేయడమే మొదలు పెడతారు. కానీ 40 ఏళ్లు దాటినా కూడా హీరోయిన్లు గా కొనసాగుతోన్నవారు కొంత మంది మాత్రమే ఉన్నారు. వారిలో సౌత్ నుంచి నయనతార ముందున్నారు. 40 ఏళ్ల వయస్సులో ఫిట్ నెస్, గ్లామర్ తగ్గకుండా జాగ్రత్త పడుతూ వస్తోంది లేడీ సూపర్ స్టార్. వరుస ఆఫర్లతో తన డిమాండ్ ను పెంచుకుంటూ వస్తోంది నయనతార.

25
నయనతార రెమ్యునరేషన్ ..

పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నా సరే.. నయనతార డిమాండ్ ఏమాత్రం తగ్గడంలేదు. సౌత్ లో స్టార్ సీనియర్ హీరోలకు ఓన్లీ ఆప్షన్ గా మారిపోయింది నయనతార. అంతే కాదు లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో కూడా వరుస సక్సెస్ లు చూస్తోంది. దాంతో ఆమెకు భారీగా డిమాండ్ ఏర్పడింది. నయనతార ఒక్క సినిమాకు 15 కోట్ల వరకూ డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అటు బాలీవుడ్ నుంచి కూడా నయన్ కు వరుసగా ఆఫర్లు వస్తుున్నాయి. కానీ లేడీ సూపర్ స్టార్ మాత్రం సౌత్ సినిమాలకే ఇంపార్టెన్స్ ఇస్తోంది. కాగా తెలుగులో నయన్ వరుసగా సినిమాలకు సైన్ చేస్తోంది.

35
బాలకృష్ణతో నాలుగోసారి నయన్

తెలుగులో ఇప్పటికే సీనియర్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది నయనతార. ఆమె టాలీవుడ్ లో చేసిన వాటిలో దాదాపు హిట్ సినిమాలే ఎక్కువగా ఉన్నాయి. ఈక్రమంలో నయనతార నట సింహం బాలయ్యతో ఎక్కువ సినిమాల్లో నటించింది. ఆయనతో వరుసగా సింహ, శ్రీరామరాజ్యం, జై సింహ సినిమాలలో నటించి మెప్పించింది బ్యూటీ. ఇక నాలుగో సారి బాలయ్యతో సినిమా చేయడానికి రెడీ అవుతోంది నయనతార. బాలకృష్ణకు వీరసింహారెడ్డి సినిమాతో హిట్ ఇచ్చిన దర్శకుడు మలినేని గోపీచంద్ తో మరో సినిమా చేయబోతున్నాడు. ఈసినిమాలో హీరోయిన్ గా నయనతార నటించబోతున్నట్టు తెలుస్తోంది.

45
చిరంజీవితో నటిస్తోన్న నయనతార

నయనతార ప్రస్తుతం తమిళంలో కొన్ని సినిమాలు చేస్తూనే.. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి జోడీగా మన శంకరవర ప్రసాదుగారు సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది. ఈక్రమంలో ఈసినిమా సెట్ లోనే మలినేని గోపీచంద్ బాలయ్యతో చేయబోయే సినిమా లైన్ ను ఆమెకు వినిపించారట. ఆ లైన్ నచ్చడంతో నయనతార సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. బాలకృష్ణతో నయనతారకు మంచి అనుబంధం ఉంది. ఆమే కావాలని కొన్నిసినిమాలకు అడిగి మరీ తీసుకున్నారు బాలయ్య. ముఖ్యంగా శ్రీమారాజ్యం సినిమాలో సీత పాత్రలో నయనతారను తీసుకోవాలని బాలకృష్ణ రికమెండ్ చేశారట.

55
రెమ్యునరేషన్ తగ్గించుకున్న లేడీ సూపర్ స్టార్ ?

నయనతారకు ప్రస్తుతం డిమాండ్ ఎక్కువగా ఉంది. ఆమె కోరిన రెమ్యునరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు రెడీగా ఉన్నారు. చిరంజీవితో నటిస్తున్న సినిమాకు కూడా నయనతార 10కోట్లకు పైనే రెమ్యునరేషన్ తీసుకున్నట్టుగా టాక్ ఉంది. అయితే బాలయ్యతో చేయబోయే సినిమాకు మాత్రం నయన్ రెమ్యునరేషన్ తగ్గించుకున్నట్టు సమాచారం. ఈసినిమా కోసం ఆమె 7 కోట్లు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. అయితే బాలయ్య, మలినేని గోపీచంద్ సినిమా ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ అవ్వలేదు. నయనతార హీరోయిన్ అని అధికారిక ప్రకటన రాలేదు. త్వరలో ఈ విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories