ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సంచలనంగా మారిన సినిమాల్లో కాంతార చాప్టర్ 1 ఒకటి. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈసినిమా 1000 కోట్లు కలెక్ట్ చేయకముందే ఓటీటీలోకి రాబోతోంది. ఈసినిమాను అక్టోబర్ 31 నుంచి ప్రైమ్ వీడియోలో తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు.
25
రిషబ్ శెట్టి నటిస్తూ డైరెక్ట్ చేసిన సినిమా
రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ.. డైరెక్ట్ చేసిన ఈసినిమాలో రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య, జయరామ్ ముఖ్య పాత్రలు పోషించారు. హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ సినిమా థియేటర్లలో భారీ విజయం సాధించింది.
35
ప్రైమ్ వీడియో పోస్ట్
కన్నడ సంస్కృతితో కూడిన కథతో ఈ సినిమా తెరకెక్కింది. ఇటువంటి కథలకు మంచి ఆదరణ ఉంటుందని, ప్రేక్షకులను అవి ఆకట్టుకుంటాయని 'కాంతార' నిరూపించింది. ఇక ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ పై అమెజాన్ ప్రైమ్ ప్రకటన రిలీజ్ చేసింది. అక్టోబర్ 31 నుంచి ఈ సినిమాను ప్రపంచ ప్రేక్షకులతో పంచుకోవడానికి ఉత్సాహంగా ఉన్నామని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
కాంతార సినిమాకు ప్రీక్వెల్ గా ఈసినిమా రూపొందింది. కదంబ రాజవంశం కాలం నాటి కథ ఇది. పవిత్ర అడవులను కాపాడే పంజుర్లి దైవం పురాణగాథ మూలాలను.. ఈ సినిమా లో చూపించారు. కాంతార మొదటి భాగంలో రిషబ్ శెట్టి తండ్రి పాత్ర చుట్టు.. ఈ సినిమా నడుస్తుంది. ఇందులో దైవిక శక్తులు ఎలా మేల్కొంటాయి, అవి మేల్కొనడానికి కారణాలు వెల్లడించారు.
55
భూతకోల సంప్రదాయం
కర్ణాటక తీరప్రాంత భూతకోల సంప్రదాయాన్ని ఈ సినిమా అద్భుతంగా చూపించింది. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం సినిమాకు ప్రాణం పోసిందని చెప్పాలి. ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన కాంతార చాప్టర్ 1 సినిమా అద్భుతమైన రెస్పాన్స్ ను సాధించింది. అయితే కేజీఎఫ్ తరువాత 1000 కోట్ల కలెక్షన్లు సాధించిన సినిమాగా కాంతార చాప్టర్ 1 నిలుస్తుందని అనుకున్నారు. కానీ ఈ సినిమా 800 కోట్ల వరకూ మాత్రమే కలెక్ట్ చేసింది. కన్నడ బాషలో ఓటీటీ రిలీజ్ డేట్ ఇంకా ఇవ్వలేదు. మరి ఈసినిమా కలెక్షన్స్ పై మరేదైనా ప్లాన్ చేస్తున్నారా లేదా అనేది తెలియాల్సి ఉంది.