
కార్తీక దీపం 2 సోమవారం ఎపిసోడ్ లో అన్ని కూరగాయలు వేసి సాంబార్ చెయ్ దీప అని చెప్తుంది సుమిత్ర. నువ్వు తిన్నావా అని అడిగి.. దీప తిన్నా అని చెబితే.. అబద్దాలు చెప్పి చెప్పి నీ జీవితమే అబద్దమైపోయింది. ఈ రోజు నా కూతురు గెలిచి వస్తుంది. నేను ప్రేమగా భోజనం చేస్తున్నప్పుడు నువ్వు కళ్లు తిరిగి పడిపోతే మాకు ఇబ్బందిగా ఉంటుంది. నా కూతురి జీవితంలోకి ఏ ఆనందం వచ్చినా నువ్వు తట్టుకోలేవు అంటుంది సుమిత్ర. ప్లీజ్ దీప నన్ను ఈ ఒక్క పూట అయినా నా కూతురితో కలిసి కడుపు నిండా తిననివ్వమని అంటుంది. ఆ మాటలు విన్న దీప బాధతో లోలోపల కుమిలిపోతుంది. మీ సంతోషానికి నేను అడ్డురానమ్మ అని చెప్పి వెళ్లిపోతుంది.
కిచెన్ లోకి వెళ్తున్న దీపను మమ్మల్ని పట్టించుకోవా? అని అడుగుతుంది పారిజాతం. ఉండమ్మా వస్తాను అంటూ వెళ్లిపోతుంది దీప. తిరిగి బంగాళదుంపలు తీసుకొని వస్తే.. కారంగా ఏదైనా పెట్టమని అడుగుతుంది. దీనికంటే బయట గడ్డి తినడం నయమని చెబుతుంది. అందుకు దీప గడ్డితో జ్యూస్ చేస్తాను తాగు అని చెప్తుంది. పారు బాగా ఫ్రస్టేస్ అవుతుంది. పైసా ఆదాయం లేకుండా మీరెలా బతుకుతున్నారని దీపను అడుగుతుంది. మా బావ ఉన్నాడనే ధైర్యంతో అని దీప కౌంటర్ ఇస్తుంది. నువ్వు ఏమైనా అడగాలి అనుకుంటే మా బావను అడుగు అని చెప్పి వెళ్లిపోతుంది.
మరోపక్క నువ్వు ఇక్కడే ఉండు కార్తీక్.. నేను డ్రైవ్ చేయగలను అంటాడు దశరథ. నా టెన్షన్ అంతా జ్యోత్స్న గురించే. పైగా ఆ వైరవ్ ఇక్కడే ఉన్నాడు. కార్తీక్ నువ్వు ఇక్కడే ఉండు అని దశరథ, శివన్నారాయణ వెళ్లిపోతారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు రైడ్ చేయడం వెనుక వైరవ్, జ్యోత్న్స హస్తం ఏమైనా ఉందా అని అనుకుంటూ లోపలికి వెళ్తాడు కార్తీక్. దూరం నుంచి వేలంపాటను గమనిస్తూ ఉంటాడు. అప్పటికే రూ.10 కోట్లు వేలం పాడుతుంది జ్యో. వైరవ్ 11 కోట్లు పాడుతాడు. జ్యోత్స్న రూ.12 కోట్లు అంటుంది. ఇదేంటీ రూ.10 కోట్ల విలువ చేసే ప్రాపర్టీని ఎందుకు ఇంత పాడుతున్నారని అనుకుంటాడు కార్తీక్. మరోపక్క జ్యోత్స్న, వైరవ్ పోటాపోటీ వేలం పాడుతుంటారు.
దశరథ కూతురి చేతిలో ఓడిపోవడం నాకు చావుతో సమానం అంటాడు వైరవ్. కానీ వారినే చావుదెబ్బ కొడుతానని తన అసిస్టెంట్ తో చెబుతాడు. వేలంపాట రూ.20 కోట్లు దాటించి.. కంపెనీని నష్టానికి కొనేలా జ్యోత్స్నను రెచ్చకొడుతానని చెబుతాడు. వైరవ్ ప్లాన్ ఏంటో కార్తీక్ కి అర్థమవుతుంది. వైరవ్ రూ.20 కోట్లకు వేలం పాడుతాడు. నా పాట దాటి పాడే సత్తా ఎవరికీ లేదు అని జ్యోత్స్నను రెచ్చగొడతాడు వైరవ్.
జ్యోత్న్సను ఎలాగైనా ఆపాలని ఫోన్ పట్టుకుని బయటకు వెళ్తాడు కార్తీక్. జ్యో నా పాట అనేసరికి ఫోన్ వస్తుంది. ఫోన్ మాట్లాడి.. నువ్వే గెలిచావని వైరవ్ కి చెప్పి.. అక్కడి నుంచి వెళ్లిపోతుంది. వైరా అడ్డంగా బుక్కయిపోతాడు. బయటకు వచ్చిన జ్యోత్స్న నువ్వు ఇక్కడున్నావ్ ఏంటీ? అని కార్తీక్ ను అడుగుతుంది. కంపెనీని కాపాడటానికి అంటాడు కార్తీక్. అంటే ఫోన్ కాల్ చేయించింది నువ్వేనా అంటుంది జ్యోత్స్న. అవును అంటాడు కార్తీక్.
మరోవైపు కాఫీ ఇవ్వమని అడగాలా వద్దా అని కన్ఫ్యూజన్ లో ఉంటాడు కాశీ. కావేరి శ్రీధర్ కి తెచ్చిన కాఫీని స్వప్నకు ఇచ్చి మీ ఆయనకు ఇచ్చిరా అని చెప్తాడు శ్రీధర్. థ్యాంక్స్ దిల్లు నేనే అడగాలి అనుకుంటున్నా.. ఈలోపు నువ్వే తెచ్చావు అంటాడు కాశీ. అడగకుండానే కాశీకి కాఫీ ఇవ్వాలని స్వప్నతో చెబుతాడు శ్రీధర్. ఇప్పుడు నీ భర్తకు జాబ్ లేదు. దాన్ని అల్లుడు మనసులో పెట్టుకొని బాధపడతాడు. ఇలాంటి టైమ్ లో భార్యగా నువ్వు సపోర్ట్ చేయాలి. ధైర్యం చెప్పాలి. అతని అలవాట్లను మర్చిపోవద్దు అని చెబుతాడు శ్రీధర్.
నా గెలుపును ఓర్చుకోలేని వాళ్లు నా చుట్టూనే ఉన్నారని ముందే చెప్పా కదా తాత అంటూ కార్తీక్, దీపలను చూపిస్తూ.. కోపంతో ఊగిపోతుంది జ్యోత్స్న. ఇంకో రూ.కోటి పాడి ఉంటే ఆ రెస్టారెంట్ నాదయ్యేది? నువ్వు ఆ వైరవ్ కు ఎంతకు అమ్ముడుపోయావ్ బావ అని కార్తీక్ ను ప్రశ్నిస్తుంది? ఇదంతా వైరవ్ ట్రాప్ అని కార్తీక్ చెప్పబోతుంటే జ్యోత్స్న వినదు. శివన్నారాయణ కూడా కార్తీక్ పైనే అరుస్తాడు. వేలం పాటలో రెస్టారెంట్ దక్కించుకొని తనను తాను ప్రూవ్ చేసుకోవాలని జ్యోత్స్న ట్రై చేస్తుంటే నువ్వు ఎందుకు ఆపావు? అంటాడు. నీ లాంటి వాళ్లు ఇంట్లో ఉండటానికి వీల్లేదు. జ్యోత్స్న వెళ్లి అగ్రిమెంట్ తీసుకొని రా అని చెబుతాడు
నా కూతురి జీవితంలోకి వీళ్లు ఏ సంతోషాన్ని రానివ్వరని సుమిత్ర అంటుంది. మీ భార్యభర్తలు కలిసి ఇన్నాళ్లు మాకు చేసిన మంచి చాలు అంటాడు శివన్నారాయణ. కార్తీక్ చేతిలో అగ్రిమెంట్ పెట్టి నీ భార్యను తీసుకొని వెళ్లిపో అంటాడు. వీడు చేసింది తప్పా.. కాదా అని జ్యోను అడుగుతాడు శివన్నారాయణ. తప్పే అంటుంది జ్యో. వీడిని ఇలాగే వదిలేయాలా? అని అడుగుతాడు శివన్నారాయణ. మెడ పట్టుకుని బయటకు గెంటేయాలని జ్యోత్న్స అనడంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ముగుస్తుంది.