ఇండియన్ సోషల్ మీడియా చరిత్రలోనే రికార్డులు తిరగరాసింది ఓ యూట్యూబ్ వీడియో. ఏకంగా 500 కోట్లకు పైగా వ్యూస్ ను సాధించి షాక్ ఇచ్చింది. ఇంతకీ ఆ వీడియో ఏంటో తెలుసా?
యూట్యూబ్‌లో ఏదో ఒక్కసారి ప్రపంచవ్యాప్తంగా రికార్డులు తిరగరాసే వీడియోలు, పాటలు వెలుగులోకి వస్తుంటాయి. భారతదేశంలో లెహంగా, రౌడీ బేబీ, దిల్బర్ వంటి పాటలు భారీ వ్యూస్‌ను సాధించినా, వాటన్నింటిని దాటి ఒక వీడియో అసాధారణ ఖ్యాతి సాధించింది. 14 ఏళ్ల క్రితం విడుదలైన శ్రీ హనుమాన్ చలీసా వీడియో ఇప్పుడు యూట్యూబ్‌లో 5 బిలియన్ వ్యూస్‌ను దాటిన ఏకైక ఇండియాన్ యూట్యూబ్ వీడియోగా నిలిచింది.
24
500 కోట్ల వ్యూస్ ను సాధించిన ఏకైక వీడియో
టీసిరీస్ రూపొందించిన Shree Hanuman Chalisa వీడియో 2011 మే 10న యూట్యూబ్‌లో విడుదలైంది. రిలీజ్ అయిన 14 సంవత్సరాల్లో ఈ వీడియో 5,006,713,956 వ్యూస్‌ను సాధించింది. ఇది భారతదేశం నుంచి 5 బిలియన్ వ్యూస్ దాటిన మొదటి ఏకైక వీడియోగా నిలిచింది. ఈ చలీసాకు హరిహరణ్ స్వరం అందించగా, సంగీతం లలిత్ సేన్ అందించారు. వీడియోలో టీసిరీస్ వ్యవస్థాపకుడు గుల్షన్ కుమార్ కూడా కనిపించారు.
34
టీసిరీస్ ప్రత్యేక కృతజ్ఞతలు
ఈ రికార్డు సాధించిన సందర్భంగా టీసిరీస్ మేనేజింగ్ డైరెక్టర్ భూషణ్ కుమార్ అందరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేవారు. ఆయన మాట్లాడుతూ, “హనుమాన్ చలీసా కోట్లాది మంది హృదయాల్లో ప్రత్యేక స్థానం కలిగి ఉంది. నా తండ్రి గుల్షన్ కుమార్ జీ ఆధ్యాత్మిక సంగీతంపై ఉన్న నిబద్ధతే ఈ రికార్డుకు కారణం. 5 బిలియన్ వ్యూస్ దాటడం, ప్రపంచంలో అత్యధికంగా చూసిన యూట్యూబ్ వీడియోల్లో స్థానం పొందడం.. డిజిటల్ అచీవ్‌మెంట్ మాత్రమే కాదు.. దేశం మొత్తం అందరిలో ఉన్న భక్తిని ఈ వీడియో ప్రతిబింబిస్తుంది” అని తెలిపారు.
ఇండియాలో టాప్ వ్యూస్ సాధించిన ఇతర వీడియోల వివరాలు చూస్తే.. ఏ వీడియో కూడా ఇంకా 2 బిలియన్ వ్యూస్ కూడా దాటలేదు. Lehenga పాట 1.8 బిలియన్ వ్యూస్ సాధించగా, హర్యాన్వీ పాట 52, గజ్ కా దమన్ 1.7 బిలియన్ వ్యూస్ వద్ద ఉంది. ఇక సౌత్ నుంచి రిలీజ్ అయిన Rowdy Baby సాంగ్ వీడియో కూడా 1.7 బిలియన్ వ్యూస్‌తో దూసుకుపోతోంది. Zaroori Tha, Vaaste, Laung Laachi, Lut Gaye, Dilbar, Bum Bum Bole పాటలు కూడా ఇండియన్ టాప్ వ్యూస్ లిస్ట్ లో ఉన్నాయి.