Sai Pallavi Remuneration : సైలెంట్ గా ఫిల్మ్ ఇండస్ట్రీలో దూసుకుపోతోంది సాయి పల్లవి. ఎటువంటి హడావిడి లేకుండా భారీ సినిమాలు చేసుకుంటూ.. వెళ్తోంది. రెమ్యునరేషన్ కూడా భారీగా పెంచేసిందట తండేల్ భామ. రజినీకాంత్ సినిమా కోసం ఎంత తీసుకుంటుందంటే?
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హిట్టు, ప్లాప్ తో సంబంధం లేకుండా.. స్టార్ ఇమేజ్ తో దూసుకుపోయే హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే ముందుగా సాయిపల్లవి పేరుమాత్రమే వినిపిస్తుంది. టాలీవుడ్ తో పాటు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో భారీ క్రేజ్ తో దూసుకుపోతోన్న ఈ హీరోయిన్.. ఎవరితో పోటీ లేకుండా.. తన పని తాను చేసుకుంటూ వెళ్తోంది. పెద్దగా టెక్షన్ తీసుకోకుండా తనకు నచ్చిన సినిమాలు మాత్రమే చేసుకుంటూ.. క్రేజ్ ను కొనసాగిస్తోంది. యాక్టింగ్, డాన్స్, గ్లామర్ విషయంలో తగ్గేదే లేదంటోంది సాయి పల్లవి. హిట్ లేదా ఫ్లాప్ తో సంబంధం లేకుండా లేకుండా వరుస అవకాశాలు అందుకుంటోంది.
25
సీత పాత్రలో సాయి పల్లవి
ఈ ఏడాది టాలీవుడ్‌లో రిలీజ్ అయిన తండేల్ సినిమా భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలవడంతో సాయి పల్లవి కెరీర్ మరింత స్పీడ్ అందుకుంది. ప్రస్తుతం సాయి పల్లవి బాలీవుడ్‌లో భారీ స్థాయిలో, రూపొందుతున్న భారీ బడ్జెట్ మూవీ రామాయన్ సీత పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా కొనసాగుతోంది. వచ్చే ఏడాది మొదటి భాగం విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
35
రజినీకాంత్ సినిమాలో సాయి పల్లవి
ఇక తాజాగా సాయి పల్లవి ఖాతాలో మరో భారీ ప్రాజెక్ట్ చేరినట్టు ఫిల్మ్ ఇండస్టరీలో టాక్ నడుస్తోంది. గత కొద్ది రోజులుగా కమల్ హాసన్ నిర్మాణంలో, సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రలో సినిమా కోసం సన్నాహాలు జరుగుతున్నాయి. రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ బ్యానర్‌లో నిర్మించబోతున్న ఈసినిమాకు ముందుగా సుందర్ సి డైరెక్షన్ చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఆయన ప్రాజెక్ట్ నుంచి తప్పకున్నట్టు తెలిసింది. ఇక ఈమూవీని పార్కింగ్ సినిమాతో ఉత్తమ దర్శకుడిగా జాతీయ అవార్డు అందుకున్న రామ్ కుమార్ బాలకృష్ణన్ డైరక్ట్ చేయబోతున్నట్టు సమాచారం. అధికారిక ప్రకటన రానప్పటికీ.. దాదాపు బాలకృష్ణన్ ఫిక్స్ అయినట్టు సమాచారం.
ఇక ఈసినిమాకు సబంధించి అత్యంత ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఈ సినిమాలో సాయి పల్లవిని ఓ ఇంపార్టెంట్ రోల్ కోసం తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. సాధారణంగా సాయి పల్లవి కథ, పాత్ర బలం ఉన్న సినిమాలకే గ్రీన్ సిగ్నల్ ఇస్తుంటుంది. కథ బాగోలేకపోయినా, హీరోయిన్ పాత్రకు యాక్టింగ్ స్కోప్ లేకుపోయినా.. ఆమె సినిమాలు చేయదు. ఎంత పెద్ద హీరో అయినా.. ఆసినిమాను రిజెక్ట్ చేస్తుంది సాయిపల్లవి. అయితే ఈసినిమా కథ నచ్చడంతో పాటు, సాయి పల్లవి పాత్ర కూడా నచ్చిందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
55
సాయి పల్లవికి భారీగా రెమ్యునరేషన్
ఇక రెమ్యునరేషన్ విషయానికి వస్తే, ఈ సినిమా కోసం సాయి పల్లవికి ఏకంగా 15 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ అందుకోబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం సీనియర్లుగా వెలుగు వెలుగుతున్న నయనతార, త్రిష, నేషనల్ క్రష్ రష్మిక మందన్న కూడా ఇంత భారీ పారితోషికం అందుకోవడంలేదు. సాయి పల్లవి బ్రాండ్ వాల్యూ.. ఆమె ఫ్యాన్ బేస్ ను దృష్టిలో ఉంచుకొని నిర్మాతలు ఈ రెమ్యూనరేషన్ ఇవ్వడానికి వెనకాడలేదనేది ఇండస్ట్రీ టాక్. మరి ఈ విషయంలో నిజం ఎంతో తెలియాలంటే.. కమల్ టీమ్.. సాయి పల్లవి విషయం నిజమో కాదో అనౌన్స్ చేసే వరకూ వేచి చూడాల్సిందే.