Andhra King Taluka OTT Release : అప్పుడే ఓటీటీ రిలీజ్ కు రెడీ అవుతోందట ఆంధ్రా కింగ్ తాలూకా సినిమా. రిలీజ్ అయ్యి రెండు రోజులు అవుతుండగా.. ఓటీటీ రిలీజ్ పై అప్ డేట్ వైరల్ అవుతోంది. ఇక ఈసినిమా రెండు రోజుల కలెక్షన్స్ ఎంతంటే?
రామ్ పోతినేని, భాగ్యలక్ష్మి బోర్సే హీరో, హీరోయిన్లుగా .. మహేష్ బాబు పి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఆంధ్రా కింగ్ తాలూకా. ఈ సినిమా నవంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రం మొదటి షో నుంచే మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోయింది. గతంలో రామ్ హిట్ సినిమాలకు వచ్చినంత ఓపెనింగ్స్ ఈసినిమాకు రాకపోయినా.. చాలా కాలంగా హిట్ లేక ఇబ్బందిపడుతున్న రామ్ కు ఈసినిమా ఓపెనింగ్ కలెక్షన్స్ కాస్త ఊరటనిచ్చాయి.
25
ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ డే కలెక్షన్స్
వీక్ డే అయిన గురువారం ఈసినిమా రిలీజ్ కావడం, ప్రస్తుతం అన్ సీజన్ కావడంతో మొదటి రోజు థియేటర్లలో ప్రేక్షకుల రద్దీ తక్కువగా కనిపించింది. హిట్ టాక్ ఉన్నప్పటికీ, ఇది ఓపెనింగ్స్‌పై గణనీయమైన ప్రభావం చూపినట్టుగా తెలుస్తోంది. దాదాపు 70 కోట్ల రూపాయిల బడ్జెట్ తో రూపొందిన ఆంధ్రా కింగ్ తాలూకా సినిమా.. ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రైట్స్ అన్ని ప్రాంతాలకు కలిపి 23 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. కాగా మొదటి రోజు వరల్డ్ వైడ్ గా ఈ మూవీ 4 కోట్ల 50 లక్షల షేర్ ను వసూలు చేసినట్టు తెలుస్తోంది.
35
వరుస ఫెయిల్యూర్స్ తో తలనొప్పి
రామ్ ఇటీవల నటించిన ‘ది వారియర్’, ‘స్కంద’, ‘డబుల్ ఇస్మార్ట్’ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్‌గా నిలిచాయి. వాటితో పోలిస్తే ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ, మొదటి రోజు ఓపెనింగ్స్ దాదాపు 30 శాతం తక్కువగా నమోదయ్యాయి. అయితే ఈసినిమాకి కొన్ని ప్లస్ పాయింట్లు కూడా ఉన్నాయి. అదే రోజు కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ‘రివాల్వర్ రీటా’ వంటి సినిమాలు విడుదలై డిజాస్టర్స్‌గా మారాయి. దీంతో పోటీ తగ్గిపోయి ‘ఆంధ్రా కింగ్ తాలూకా’కు అదనపు అడ్వాంటేజ్ లభించింది.
రెండో రోజున సినిమా హాల్ లెక్కలు పెరుగుతూ సుమారు 100 స్క్రీన్స్ అదనంగా ఆడ్ అయినట్టు తెలస్తోంది. . అలాగే హైదరాబాద్ లో కొన్ని సాఫ్ట్‌వేర్ కంపెనీలు, స్కూల్స్ కు సెలవులు ఉండటం కూడా సినిమాకి కలిసొచ్చే పరిస్థితి కనిపిస్తోంది. ఈ అంశాల దృష్ట్యా రెండో రోజు తొలి రోజు రేంజ్‌కే సమానంగా కలెక్షన్లు నమోదయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ చిత్రం రెండో రోజు ముగిసే సమయానికి సుమారు 6 కోట్ల కలెక్షన్స్ ను వసూలు సాధించినట్టు తెలుస్తోంది. ఇక వీకెండ్ కావడంతో ఈ రెండు రోజులు ఇదే స్థాయిలో పెర్ఫార్మెన్స్‌ను కొనసాగించగలిగితే, శనివారం , ఆదివారం ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ బాక్సాఫీస్ వద్ద మరింత బలమైన కలెక్షన్లు సాధించే అవకాశాలు ఉన్నాయి.
55
ఆంధ్రా కింగ్ తాలూకా ఓటీటీ రిలీజ్
రిలీజ్ అయ్యి రెండు రోజులే అవుతున్నా.. అప్పుడే ఆంధ్రా కింగ్ తాలూకా ఓటీటీ రిలీజ్ పై సమాచారం వైరల్ అవుతోంది. ఈ మూవీని ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ ఓటీటీ సంస్థ దక్కించుకున్నట్టు తెలుస్తోంది. అంతే కాదు వచ్చే నెల 25 నుంచే ఈసినిమా ఓటీటీలో అందుబాటులో ఉండబోతున్నట్టు సమాచారం. ఈలెక్కన హిట్ సినిమా అయినా.. చాలా త్వరగా ఆంధ్రా కింగ్ తాలూకా సినిమా ఓటీటీలో సందడి చేయబోతున్నట్టు లెక్క. మరి ఈ సినిమా ఈ నెల రోజుల్లో ఎన్ని అద్భుతాలు చేస్తుందో చూడాలి.