ప్రభాస్ తో రాజమౌళి పాన్ వరల్డ్ మూవీ..? బాహుబలిని మించిన కథ.. కాన్సెప్ట్ ఏంటో తెలుసా..?

Published : Nov 14, 2025, 09:49 AM IST

Rajamoul , Prabhas fourth film : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. పాన్ వరల్డ్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ లో మరో మాస్టర్ పీస్ సినిమా రాబోతోందా? డబుల్ డోస్ యాక్షన్ తో.. అంతకు మించి సినిమాను జక్కన్న ప్లాన్ చేస్తున్నాడా? ఇంతకీ కాన్సెప్ట్ ఏంటో తెలుసా?  

PREV
16
ప్రభాస్ తో ముచ్చటగా మూడు సినిమాలు

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో ఇప్పటికే మూడు బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు చేశాడు రాజమౌళి. ఎన్టీఆర్ తరువాత జక్కన్న ఎక్కువ సినిమాలు చేసింది ప్రభాస్ తోనే. ఛత్రపతి సినిమాతో ప్రభాస్ కెరర్ ను మలుపు తిప్పిన రాజమౌళి.. బాహుబలి రెండు సినిమాలతో పాన్ ఇండియా హీరోగా మార్చాడు. ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో.. వరల్డ్ వైడ్ గా గుర్తింపు సాధించాడు ప్రభాస్. రాజమౌళి చేతిలో పడితే ఏ హీరో అయితే ఆ రేంజ్ కు వెళ్లాల్సిందే. ఇక ప్రభాస్ తో రాజమౌళి నాలుగో సినిమా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. కానీ ఈ పరిస్థితుల్లో ఆ సినిమా సాధ్యమేనా?

26
రెబల్ స్టార్ తో యాక్షన్ మూవీ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ టాలీవుడ్ నుంచి ఫస్ట్ పాన్ ఇండియా హీరోగా దూసుకుపోతున్నాడు. భారీ బడ్జెట్ సినిమాలకు ఆయన కేరాఫ్ అడ్రెస్ గా మారాడు. ప్రభాస్ తో సినిమా అంటే 500 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టాల్సిందే. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో అరడజనుకు పైగా భారీ బడ్జెట్ సినిమాలు ఉన్నాయి. వాటితో మార్కెట్ లో 5 వేల కోట్లకు పైగా బిజినెస్ జరిగే అవకావం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రభాస్ కు ఇంత ఇమేజ్ రావడానికి కారణం రాజమౌళి చేసిన బాహుబలి సినిమానే. ఆ సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా హీరో అయ్యాడు. ఇక మరోసారి రాజమౌళితో ప్రభాస్ సినిమా చేస్తే..? అది అంతకు మించి ఉంటుందని అభిమానుల్లో అంచనాలు ఉన్నాయి.

36
ప్రభాస్ తో రాజమౌళి నాలుగో సినిమా

అవును ఇప్పుడు ప్రభాస్ మరోసారి దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli)తో సినిమా చేయబోతున్నారని టాలీవుడ్‌లో టాక్ గట్టిగా వినిపిస్తోంది. అయితే ఈసారి బాహుబలి తరహా ఫ్యాంటసీ లేదా పీరియడ్ మూవీ కాదు, కంప్లీట్ గా యాక్షన్ ఎంటర్టైన్మెంట్ మూవి చేయబోతున్నారట. అది కూడా పూర్తిగా బాక్సింగ్ నేపథ్యంలో సాగే కథతో సినిమాను రూపొందించాలనే ఆలోచనలో ఉన్నారట రాజమౌళి. ఈ విషయాన్ని రీసెంట్ గా రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. రాజమౌళి మాట్లాడుతూ... “ఛత్రపతి, బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్‌తో మళ్లీ సినిమా చేయాలనుకుంటున్నాను. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో కథ ఉంటుంది అని అన్నారు.

46
బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో

బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో టాలీవుడ్‌లో ఇంతకు ముందు కూడా కొన్ని సినిమాలు వచ్చాయి. పవన్ కళ్యాణ్ నటించిన ‘తమ్ముడు’, రవితేజ నటించిన ‘అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి’, జై, రీసెంట్ గా గని లాంటి సినిమాలు వచ్చాయి. అందులో తమ్ముడు, అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి. మరి ఆ సినిమాలను మించి కొత్తగా రాజమౌళి ఏం చూపిస్తారు అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్. అంతే కాదు ప్రభాస్ ఇంత వరకూ స్పోర్ట్స్ డ్రామా మూవీస్ చేసింది లేదు. యాక్షన్ సినిమాలు మాత్రం చాలా చేశారు. ప్రభాస్ హైట్ కు స్పోర్ట్స్ మూవీ బాగుంటుంది.. కానీ ఆయన క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది అనేది పాయింట్.

56
ప్రభాస్, రాజమౌళి సినిమా సాధ్యమేనా..?

ప్రస్తుతం ప్రభాస్ ఇమేజ్‌ వేరు.. పెద్ద హీరో, రాజమౌళి బాహుబలి సినిమా చేసేప్పటి పరిస్థితి వేరు. ప్రభాస్ తో సినిమా అంటే.. అది కూడా రాజమౌళి లాంటి దర్శకుడు చేస్తే అది ఏరేంజ్ లో ఉండాలి. రాజమౌళి, మహేష్ తో చేస్తోన్న సినిమా 2000 కోట్లకు పైగా కలెక్షన్ టార్గెట్ గా తీస్తున్నారు. ఈసినిమా కంప్లీట్ అయితే.. రాజమౌళి రేంజ్ కూడా మారిపోతుంది. ఇక ఆయన ప్రభాస్ తో సినిమా చేయాలంటే.. అంచనాలు ఊహలకు అందవు. హాలీవుడ్ రేంజ్ లో ప్రభాస్ ను చూపించాల్సి వస్తుంది. పైగా ప్రభాస్ ప్రస్తుతం ఆరు సినిమాలు చేస్తున్నాడు. అవి పూర్తవ్వాలంటే చాలా టైమ్ పడుతుంది. దాంతో రాజమౌళి, ప్రభాస్ సినిమాకు స్పేస్ ఉంటుందా అనేది పెద్ద ప్రశ్న.

66
ప్రభాస్ సినిమాలు..

ప్రస్తుతం ప్రభాస్ సినిమాల లైనప్ చూస్తే, వచ్చే మూడు సంవత్సరాలు ఆయనకు కొత్త ప్రాజెక్ట్‌కి సమయం దొరకడం కాస్త కష్టమే. ప్రస్తుతం ‘రాజాసాబ్ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. దీని తర్వాత హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఫౌజీ’ మూవీ కూడా షూటింగ్ కొనసాగుతోంది. అది పూర్తి చేసేలోపు వచ్చే ఏడాది మార్చి నుండి సందీప్ వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ మూవీ సెట్స్ లోకి వెళ్ళబోతోంది. ఈసినిమాకోసం భారీగా ప్లాన్ చేశాడు సందీప్ రెడ్డి.. ఫస్ట్ షెడ్యూల్ మెక్సికోలో ప్లాన్ చేశారట. ఇక ప్రశాంత్ వర్మతో సలార్ పార్ట్ 2 మొదలెట్టాల్సి ఉంది. వీటికి తోడు ‘కల్కి 2’ సినిమా కూడా చేయాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో రాజమౌళి–ప్రభాస్ కాంబినేషన్‌లో వచ్చే బాక్సింగ్ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది. అసలు అది వర్కైట్ అవుతుందా లేదా అనేది చూడాలి.

Read more Photos on
click me!

Recommended Stories