దివాళి పార్టీ అంటే బాలీవుడ్ వైపు చూస్తారు ఆడియన్స్, అక్కడ దివాళీకి స్టార్ సెలబ్రిటీలు స్పెషల్ పార్టీలు చేసుకోవడం కామన్. ఇక ఈ ట్రెండ్ ను టాలీవుడ్ లో కూడా మొదలుపెట్టాడు నిర్మాత బండ్ల గణేష్.
టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వెరైటీ ఏదైనా చేయాలంటే ముందుగా గుర్తుకు వచ్చేది నిర్మాత బండ్ల గణేష్. ఆయన ఏది చేసినా చాలా స్పెషల్ గా ఉంటుంది. ఇక పండుగల్లో ఆయన ప్రత్యకంగా చేసేది దివాళి మాత్రమే. ప్రతి సంవత్సరం బండ్ల దివాళీ పేరుతో తానుపేల్చబోయే పటాకులతో ప్రదర్శన నిర్వహిస్తుంటాడు గణేష్. ఇక ఈసారి బండ్ల దివాళి వేడుకలు మరింత వైభవంగా సాగాయి. 2025 దీపావళి సందర్భంగా ‘బండ్ల దివాళీ 2025’ పేరుతో ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన ఈ గ్రాండ్ పార్టీకి టాలీవుడ్ సీనియర్ స్టార్లు, యంగ్ హీరోలు, స్టార్ డైరెక్టర్లు, నిర్మాతలు హాజరయ్యారు.
25
ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి
ఈ వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరవ్వగా.. విక్టరీ వెంకటేష్, శ్రీకాంత్, సిద్దు జొన్నలగడ్డ, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు తదితరులు సందడి చేశారు. చిరంజీవి వచ్చీరాగానే బండ్ల గణేష్ పాదాభివందనం చేయడం కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మెగాస్టార్ కోసం ప్రత్యేకంగా చైర్ కూడా వేయించాడు బండ్ల. అంతేకాదు, బండ్ల గణేష్‌తో విభేదాలు ఉన్నాయని ప్రచారంలో ఉన్న దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఈ పార్టీకి హాజరవడం విశేషం. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నాడు గణేష్. ఈ పార్టీతో బండ్ల మళ్లీ ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నట్టు తెలుస్తోంది.
35
కమెడియన్ గా కెరీర స్టార్ట్ చేసి..
బండ్ల గణేష్ కమెడియన్ గా తన జీవితం స్టార్ట్ చేసి... ఆతరువాత వ్యాపార రంగంలోకి అడుగు పెట్టారు. ఫౌల్ట్రీ వ్యాపారంలో విజయవంతమై అనంతరం నిర్మాతగా మారారు. పవన్ కల్యాణ్‌తో గబ్బర్ సింగ్, ఎన్టీఆర్‌తో బాద్షా, మహేష్ బాబుతో బిజినెస్‌మ్యాన్ వంటి భారీ చిత్రాలను నిర్మించి పేరు తెచ్చుకున్నారు. రాజకీయాల్లోనూ అడుగుపెట్టిన ఆయన ఈమధ్య జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్సీ టికెట్ ఆశించగా అది రాలేదు. అయినా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన అభిప్రాయాలను వెల్లడిస్తూ వచ్చారు.ఇక రాజకీయంగా యాక్టీవ్ గా ఉంటూనే ఇండస్ట్రీలో కూడా మళ్లీ యాక్టీవ్ అవ్వాలని చూస్తున్నాడట బండ్ల.
ఇక తాజాగా జరిగిన బండ్ల దివాళీ 2025 వేడుకల్లో అల్లు అరవింద్ కానీ, ఆయన టీమ్ కానీ ఎవరు హాజరుకాలేదు. బండ్ల గణేష్‌కు, అల్లు అరవింద్ కు మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నట్టు టాలీవుడ్ లో టాక్ ఉంది. రీసెంట్ గా బండ్ల కామెంట్స్.. దానికి అరవింద్ టీమ్ ఇస్తున్న కౌంటర్ల గురించి తెలిసిందే. రీసెంట్ గా ఒక ఫంక్షన్‌లో బండ్ల గణేష్ మాట్లాడుతూ ‘‘ అందరం ముందు నుంచి కష్టపడితే.. అల్లు అరవింద్ చివర్లో వచ్చి క్రెడిట్ తీసుకెళ్తారు’’, ఆయన జాతకం అలాంటిది అంటూ వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలతో అల్లు అరవింద్ ముందే ఉన్నప్పటికీ హుందాగా స్పందించగా, అదే ఈవెంట్‌లో బన్నీ వాసు బండ్ల గణేష్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ఇది ఫిల్మ్ నగర్లో పెద్ద చర్చకు దారి తీసింది.
55
బండ్ల మార్క్ కౌంటర్
తాజాగా జరిగిన 'మిత్ర మండలి' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బన్నీ వాసు మాట్లాడుతూ తనపై కుట్ర జరుగుతోందని, తన వెంట్రుక కూడా ఎవ్వరూ పీకలేరని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై బండ్ల గణేష్ ‘‘మాటలు మన చేతిలో ఉంటాయి... కానీ ఆట ఎవరిదో ప్రజలే తీర్మానిస్తారు’’ అంటూ ట్వీట్ చేయడం మరోసారి ఈ వివాదానికి దారి తీసింది. ఈ పరిణామాల మధ్య బండ్ల గణేష్ దీపావళి వేడుకలకు అల్లు టీమ్ దూరంగా ఉండటం పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. గణేష్ పిలిచారా లేదా అనేది స్పష్టంగా తెలియదు.