Bigg Boss Telugu 8: బిగ్ బాస్ హౌస్లో కి నందమూరి హీరో.. ఫ్యూజులు అవుట్ అయ్యే న్యూస్! ఎవరో తెలుసా?

బిగ్ బాస్ తెలుగు 8 త్వరలో ప్రారంభం కానుంది. కంటెస్టెంట్స్ లిస్ట్ పై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా నందమూరి హీరో పాల్గొంటున్నారంటూ ఓ న్యూస్ తెరపైకి వచ్చింది. 
 

Bigg Boss Telugu


బిగ్ బాస్  8 కి రంగం సిద్ధమైంది. అతి త్వరలో ఈ సరికొత్త సీజన్ గ్రాండ్ గా ప్రారంభించనున్నారు. బిగ్ బాస్ లవర్స్ లో హడావుడి మొదలైంది. కంటెస్టెంట్స్ ఎవరు?  ఏ ఏ రంగాలకు చెందినవారో? తెలుసుకోవాలనే ఆత్రుత అందరిలో ఉంది. ఇక బిగ్ బాస్ తెలుగు 8 కంటెస్టెంట్స్ వీరే అంటూ రోజుకో వార్త తెరపైకి వస్తుంది. 

ఈ క్రమంలో ఓ సెన్సేషనల్ సెలబ్రిటీ నేమ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.  నందమూరి  హీరో చైతన్య కృష్ణ  బిగ్ బాస్ సీజన్ 8 లో కంటెస్ట్ చేయబోతున్నారని టాక్. నందమూరి కుటుంబ వారసుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు చైతన్య కృష్ణ. 2003లో జగపతిబాబు హీరోగా నటించిన ' ధమ్ ' సినిమాలో కీలక పాత్రలో నటించాడు. చాలా గ్యాప్ తర్వాత ' బ్రీత్ ' అనే థ్రిల్లర్ తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. 


ఈ సినిమా డిజాస్టర్ అయింది.  చైతన్య కృష్ణని నెటిజన్లు  ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు. చైతన్య కృష్ణ పాలిటిక్స్ లో కూడా కనిపించాడు. బాలకృష్ణ, చంద్రబాబు కి సపోర్ట్ గా సోషల్ మీడియాలో చైతన్య కృష్ణ పోస్టులు పెడుతుంటాడు. వైసీపీ ప్రభుత్వం పై గతంలో విమర్శలు చేశాడు. ఈ నందమూరి హీరో బిగ్ బాస్ లో అడుగు పెడుతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. దీనిపై అధికారిక సమాచారం లేదు. అయితే ప్రముఖంగా వినిపిస్తోంది. 

nandamuri chaitanya krishna

ఇక సీజన్ 8 కి సంబంధించిన కంటెస్టెంట్ లిస్ట్ పరిశీలిస్తే .. రీతూ చౌదరి, విష్ణు ప్రియ, యాష్మి గౌడ, అంజలి పవన్, తేజస్విని గౌడ, సీనియర్ నటి సనా, యూట్యూబర్ బంచిక్ బబ్లు, యాదమ్మరాజు, కిర్రాక్ ఆర్పీ, జబర్దస్త్ పవిత్ర, వేణు స్వామి, సింగర్ సాకేత్, అబ్బాస్, సౌమ్య జాను, నిఖిల్, ప్రేరణ, ఏక్నాథ్ - హారిక, జబర్దస్త్ యాంకర్ సౌమ్య రావు వంటి పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 

chaitanya krishna with balayya

కాగా ఇప్పటికే విడుదలైన మూడు ప్రోమోలు ఆకట్టుకున్నాయి. కింగ్ నాగార్జున ఒక్కసారి కమిట్ అయితే లిమిట్ లేదు అంటూ షో పై మరింత హైప్ పెంచేశారు. సెప్టెంబర్ 8వ తేదీన బిగ్ బాస్ సీజన్ 8 లాంచింగ్ ఎపిసోడ్ అని విశ్వసనీయ సమాచారం. ఈసారి మరింత క్రేజీగా షో ప్లాన్ చేశారట. 

Latest Videos

click me!